26-10-2024, 05:17 PM
అయితే అతని వైమనస్యం ఎంతో కాలం నిలవలేదు. దానికి రెండు కారణాలున్నాయి. మొదటిది తేజస్విని. చూడగానే గౌరవించాలనిపించే, ఆమె వ్యక్తిత్వం, అతనికి ఎంతగానో నచ్చింది. రోజుకొకసారైనా అమ్మా అని ఆమెతో కబుర్లు చెప్పాలన్నది అతని కోరిక. ఇక రెండవది జయంతి. ఆమె చూడ చక్కగా వుంది. ఆమెను పెళ్ళి చేసుకుంటే, అందమైన భార్యనే గాక, అనురాగమయి తేజస్వినిని తల్లిగా పొందవచ్చు. ఇలా సాగే అతని ఆలోచనలకు బ్రేక్ వేస్తూ, ఫోన్ మ్రోగింది. తేజస్విని దగ్గరనుంచి.
“జయంతి కి జ్వరం తగ్గింది, ఇప్పుడు కులాసాగానే వుంది. నీకు థాంక్స్ చెప్పాలనుకుంటోంది. సాయంత్రం అయిదు గంటలకు టీ కి రాగలవా” అని అడిగింది.
“రాలేను” అని చెప్పాలనుకుంటూనే, వస్తానని చెప్పేసాడు.
---
@@@
సాయంత్రం సరిగ్గా అయిదు గంటల వేళ, అతను తేజస్విని యింటి గుమ్మం ముందు నిలుచున్నాడు. అతడి రాకను గమనించిన జయంతి ఎదురు వచ్చి, " స్వాగతం ! ఆపద్బాంధవులకు" అని నమస్కరించింది. చక్కగా అలంకరించుకుని, ముగ్ధమోహనంగా వున్న జయంతిని చూడగానే అతడిలో ఇంతవరకు తారాడిన ప్రతికూల ఆలోచనలు జాడలేకుండా పోయాయి.
"టీ తో పాటు తినడానికి పకోడీలు, మైసూరుపాక్ చేసింది. జయంతి వంట చక్కగా చేస్తుంది. " అంటూ తేజస్విని వచ్చిఅతనికెదురుగా కూర్చుంది.
జయంతి ఆరోగ్యం, పరీక్షలు, హాస్టలు జీవితం వంటి అంశాలపై కబుర్లుసాగాయి. అందరూ తీరికగా టీ తాగిన తర్వాత, తేజస్విని, జయంతి, రవీంద్రలని వుద్దేశించి యిలా అంది.
" నేను చెప్పే మాట మీకు నచ్చకపోతే, మన్నించండి. మరచిపోండి. నాకు జయంతి అంటే ఎంతో యిష్టం. అలాగే రవీంద్ర అంటే కూడా. నిజానికి రవీంద్రలో నా కొడుకుని చూసుకుంటున్నాను. మీరిద్దరూ మాట్లాడుకొని, మీకు ఓకే అనిపిస్తే, మీ పరిచయాన్ని స్నేహంగా, స్నేహాన్ని ప్రణయంగా. చివరకు పెళ్ళిగా మార్చుకుంటే సంతోషిస్తాను. ఇది నా కోరికగా భావించి, నా కోసం మీరెలాంటి త్యాగాలు చెయ్యకండి.
సాధకులకు, జీవితం ఎప్పుడూ క్రొత్త, క్రొత్త అవకాశాలనిస్తుంది. మీకిదొక అవకాశం మాత్రమే. మంచి అవకాశమనిపిస్తే, ఆలోచన చేయండి. లేదంటే వదిలివేసి, మరో అవకాశం కోసం యెదురుచూడండి. నేను గుడికి వెళ్ళి వస్తాను. "
ఆ తర్వాత, ఆమె ప్రసన్న వదనంతో, వారి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయింది. ఆమె అక్కడ లేకున్నా, మంద్ర స్వరంలో ఆమె చెప్పిన మాటలు వారి చెవుల్లో వినిపిస్తూనే వున్నాయి. దాదాపు అయిదు నిమిషాలపాటు వారు ఆలోచిస్తూ వుండిపోయారు. ఆ తర్వాత రవీంద్ర చొరవ తీసుకుని, ముందుగా తన అభిప్రాయం చెప్పాడు.
"అమ్మ సలహా నాకు శిరోధార్యం. జయంతీ! నీకు అభ్యంతరం లేకుంటే మనం, ఆమె కోరినట్లు చేద్దాం "
"నాకు అత్తయ్య మాట శిలా శాసనం. ఆమె ఎంతో ఆలోచించి, మీ సంబంధం నాకు సూచించింది. మీతో వివాహం, నాకు ఈ క్షణమైనా పూర్తిగా అంగీకారమే. అయితే ఒక్క మాట. నేను ఒక సారి పెళ్ళి చేసుకుని కొన్నాళ్ళు కాపురం చేసినదాన్ని. అందువల్ల, మీకు లేకున్నా, మీ తల్లిదండ్రులకు అభ్యంతరం వుండవచ్చు. "
"నా తల్లి చనిపోయింది. తండ్రి మళ్ళీ పెళ్ళి చేసుకుని నాకు దూరమయ్యాడు. నాది ఏక వ్యక్తి కుటుంబం. ఆ వ్యక్తిని నేనే. నాకూ పూర్తిగా అంగీకారమే. "
“త్వరపడి నిర్ణయానికి రాకండి. నాకంటే అమ్మలా ఆలోచించించే అత్తయ్య వున్నారు. బహుశా కొన్నాళ్ళు డేటింగు చేస్తే మంచిదేమో. మీకు నా గురించి తెలుస్తుంది. "
“అవసరం లేదు. నెలలు, సంవత్సరాలు డేటింగ్ చేసిన జంటలు, రోజుల్లో విడాకులు తీసుకుంటున్నాయి. నీ కోసం నేను, నా కోసం నువ్వు అని గాఢంగా నమ్మి, అన్యోన్యంగా బ్రతికితే, మన బంధం శాశ్వతం, ఆదర్శం అవుతుంది. జయంతీ, ప్రమాణం చేసి చెప్తున్నాను. ఇంక నీతోనే నా జీవితం. భర్తగా నీతో, కొడుకుగా అమ్మతో కలిసి, కలకాలం జీవించాలని ఆ పార్వతీ పరమేశ్వరులని ప్రార్ధిస్తున్నాను. ”
జయంతి అతని చేతులు, తన చేతుల్లోకి తీసుకుని కళ్ళకు అద్దుకుంది. ఆమె కనులనిండా కన్నీరు ఉబికి వస్తోంది. ఆమె దేవ దేవుని ప్రార్ధించింది.
“శిలగా మారిన నా జీవితానికి అత్తయ్య కరుణ, ప్రాణ శక్తిని ప్రసాదించింది. రవీంద్ర వలపు, క్రొత్త జీవితంలోకి అడుగిడమని స్వాగత గీతం పాడుతోంది. చీకటి నుంచి వెలుగు వైపుగా, నా మరో ప్రయాణం ఇప్పుడే మొదలవుతోంది. భగవాన్! తమసోమా జ్యోతిర్గమయ. ”

ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ