25-10-2024, 01:44 PM
శంభల రాజ్యం – 5
తురగ ప్రాకారానికి పయనం
విక్రమసింహుడు సింహద్వారం దగ్గరకు వచ్చాడు. అంకిత, సంజయ్ అతన్ని విచిత్రంగా చూస్తున్నారు.
"అభిజిత్..." అని కాసేపు పాజ్ ఇచ్చింది అంకిత.
విక్రమసింహుడి వైపు నుండి ఏ స్పందన లేదు.
రుద్రసముద్భవ, "విక్రమసింహా నీ కోసం అనిలుడు ఎదురుచూస్తున్నాడు" అనగానే అక్కడున్న సింహద్వారం నుండి బలంగా గాలి వీచింది ఎవరో అటుగా వస్తున్నట్టు.
భూలోకంలో అంకిత, సంజయ్ లు అంతక ముందు గుర్రపు డెక్కల చప్పుడును ఎన్నో సార్లు విని ఉన్నారు. కానీ ఇప్పుడొచ్చేది శబ్దమో, చప్పుడో కాదు. హోరు. హోరెత్తిస్తూ వచ్చే అనిలుడు. తురగ ప్రాకారంలోని అశ్వమే ఈ అనిలుడు. అనిలుడికి విక్రమసింహుడు వస్తాడని తెలుసు. తనను అధిరోహిస్తాడనీ తెలుసు. అది తన స్వామి భక్తికి నిదర్శనం. తన ఉనికికి దర్పణం. నల్లటి చీకటిలో నుండి తెల్లటి ధూపము ఏదో వస్తోంది. ఆ సింహద్వారం నుండి తురగ ప్రాకారం కనిపించట్లేదు కానీ అనిలుడి రాకను తెలియజేసేలా ఈ ధూపము చీకటిని చీల్చుకుంటూ వస్తోంది.
తనను సమీపిస్తున్న కొద్దీ అనిలుడి శ్వాసను కూడా వినగలుగుతున్నాడు విక్రమసింహుడు. అంకిత, సంజయ్ లకు గుండెలు అదిరిపోతున్నాయి. అంతలోనే సింహద్వారం పైన నుండి డంకా మోగటం మొదలైంది.
"అనిలుడి రాకకు సూచన", అన్నాడు రుద్రసముద్భవ.
సింహద్వారం దాకా వచ్చిన అనిలుడు ఆగిపోయాడేమో అన్నట్టు అప్పటి దాకా ఉన్న ఆ తెల్లటి ధూపం ఆగిపోయింది. అంతా చీకటే అన్నట్టుంది ఇప్పుడు. సింహద్వారం ఆవల అంతా చీకటి సముద్రమేమో అన్న భ్రమను కలిగిస్తోంది. సరిగ్గా అప్పుడే రెండు కళ్ళు విక్రమసింహుడిని చూస్తున్నట్టు మెరిసాయి.
ఆ చిక్కటి చీకట్లో తళుక్కున మెరిసిన కళ్ళను చూసేసరికి అంకిత, సంజయ్ లకు రోమాలు నిక్కబొడుచుకున్నాయి.
విక్రమసింహుడే అని తెలిసిందో ఏమో కుడి కాలు పెట్టి సింహద్వారానికి ఈవలననున్న జటిలలోకి ఇలా అడుగుపెట్టిందో లేదో పెద్ద ఉరుము ఒకటి ఇటు పడ్డట్టు అక్కడ ఒకటే మోత. ఒక కాంతి పుంజమేదో అక్కడ వెలిసినట్టు ఎంతో వెలుగు. ఆ వెలుగు ఎప్పుడాగిపోతుందా అన్నట్టు నొప్పెడుతున్న కళ్ళతో చూస్తున్నారు అంకిత, సంజయ్ లు.
అంతలో అక్కడ అనిలుడు ప్రత్యక్షం అయ్యాడు. తెల్లటి మేనిఛాయ. ఆ విగ్రహం చూస్తే అది మామూలు లాకలూకాయలు నడిపే అశ్వం కాదని ఎవరికైనా ఇట్టే అర్థం అయిపోతుంది. దేవతా మూర్తిలా అనిపిస్తుంది. ఆ ఎత్తే ఏడు అడుగులు పైన ఉంటుందేమో.
అనిలుడి చూపులు అక్కడున్న విక్రమసింహుడి మీద తప్ప ఎవ్వరి మీద పడటం లేదు. విధేయుడు ఎలా ఉంటాడని ఎవరైనా అడిగితే మనం అనిలుడినే చూపించాలి. కొంత మందిని చూస్తే చాలు మళ్ళీ ప్రత్యేకించి వారి గుణగణాలని విడమరచి చెప్పఖ్ఖర్లేదు. అలాంటి అరుదైన వ్యక్తిత్వం ఉన్న దేవతా అశ్వం ఈ అనిలుడు. మెల్లగా అడుగులో అడుగు వేస్తూ విక్రమసింహుడి దగ్గరికొచ్చి నిలబడ్డ అనిలుడు తల వంచి రెండు కన్నీటి బొట్లను కార్చాడు. అవి సరిగ్గా విక్రమసింహుడి పాదాల్ని తడిపాయి. తన రాజుకు ఆ క్షణానే జరిగిన అభిషేకం అది. విక్రమసింహుడేమైనా తక్కువా !
ముంచుకొస్తున్న సంద్రాన్ని ఆపగలమా అలాంటి కన్నీటిని ఆపే ధైర్యం విక్రమసింహుడికి కూడా లేదు. ఆ కన్నీరు నిండిన మొహంతో తన రెండు చేతులతో అనిలుడి తల పట్టుకుని కళ్ళు మూసి కన్నీటిని మాత్రం చెంపల కిందకు జారవిడిచారు ఇద్దరూ. ఆ దృశ్యాన్ని చూస్తున్న రుద్రసముద్భవ కూడా తన కన్నీటిని ఆపుకోలేకపోయాడు. అంకిత, సంజయ్ లకు ఇదంతా అర్థం కాకపోయినా ఏదో అంతుబట్టని బలమైన కారణం చేత కన్నీరొచ్చేసింది. అలా ఉంది అక్కడి పరిస్థితి.
లోకాల్ని చుట్టే అశ్వమా
శంభల రాజ్య మకుటమా
అనిలా
అందుకో ఈ రుద్రసముద్భవుని వందనాలు అంటూ రుద్రసముద్భవుడు నమస్కారం చేసాడు.
ఎరుకగలిగినట్టు అనిలుడు తల ఊపాడు. ఆనందంగా రుద్రసముద్భవ తల ఆడించాడు.
చాకచక్యంగా అనిలుడిని అధిరోహిస్తున్న విక్రమసింహుడిని చూస్తూ విస్తుపోతున్నారు అంకిత, సంజయ్ లు.
వాళ్ళు చూస్తూ ఉండగానే వాయువేగంతో జటిల దాటేసి తురగ ప్రాకారం వెళ్ళిపోయాడు విక్రమసింహుడు అనిలుడితో.
అక్కడున్న ధూళి కొంత పైకెగసింది. రుద్రసముద్భవకు ఏదో గుర్తొచ్చినట్టు గట్టిగా నవ్వాడు.
"పదండి వెళదాం", అంటూ రుద్రసముద్భవ అంకిత, సంజయ్ లను చూస్తూ అన్నాడు.
ఇప్పటికీ సింహద్వారం ఆవల మొత్తం చిక్కటి చీకటితో దారే కనిపించకుండా ఉంటే ఎలా వెళ్ళాలిరా దేవుడా అని భయపడుతూ బిక్కుబిక్కు మంటున్న అంకిత, సంజయ్ లను తీసుకుని రుద్రసముద్భవ జటిల దాటాడు.

ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ