Thread Rating:
  • 2 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేటి బాంధవ్యాలు - 6
#16
కాశీకి వెళ్ళిన నరసింహం, భార్య మహాలక్ష్మి రైలు ప్రమాదంలో మరణించారు. కైలాసపతి తన మేనల్లుడికి అండగా నిలబడి ఓదార్చాడు. అతని అభివృద్ధికి సహకరించాడు. తండ్రి నరసింహం వలె... హరికృష్ణ తండ్రికి తగిన తనయుడుగా ఎంతో పేరు తెచ్చుకున్న కారణంగా... కైలాసపతి తన ముద్దుల కుమార్తె లావణ్యకు.. హరికృష్ణకు ఎంతో వైభవంగా వివాహాన్ని జరిపించాడు.
హరికృష్ణతో లావణ్య వివాహం జరగడం ప్రజాపతికి ఇష్టం లేదు. తండ్రిని ఎదిరించలేక మౌనంగా వుండిపోయాడు. ఆకారణంగా... తల్లిదండ్రులను గౌరవించడం మాని... వారిపై ద్వేషాన్ని, వ్యతిరేకతను పెంచుకొన్నాడు. పెద్దల సలహాలు పాటించే వాడుకాదు. తన ఇష్టానుసారం స్వేచ్ఛగా నడుచుకొనేవాడు. ఎదిగిన కొడుకు రీతిగా ప్రవర్తిస్తూ.... తమని గౌరవించకుండా అభిమానించకుండా పోయాడనే బాధ దంపతులను కృంగదీసింది.
హరికృష్ణ, లావణ్యల వివాహానంతరం తొమ్మిది సంవత్సరాల్లో నాలుగు ప్రసవాలు జరిగాయి.
కానీ... ప్రజాపతికి... ప్రణవికి ఆరు సంవత్సరాలుగా సంతతి లేదు. ఏడవ ఏట... తొలుత ఆడబిడ్డ. ఒకటిన్నర సంవత్సరంలోనే మగబిడ్డ కలిగారు.
కైలాసపతి.... రుక్మిణి గతించి ఎనిమిది సంవత్సరాలు గడిచాయి. మొదట రుక్మిణి... తర్వాత ఆరునెలల లోపే కైలాసపతి స్వర్గస్థులైనారు.
వదిన మరదళ్ళు ప్రణవి, లావణ్యలు ఎంతో ఒద్దికగా అక్కాచెల్లెళ్ళ వలె వుండేవారు. కాలగమనంలో ప్రజాపతి మనస్సు మారింది.
వదిన మరదళ్ళవలె హరికృష్ణ, ప్రజాపతి కూడా పరస్పరం ఎంతో ప్రేమాభిమానాలతో వుండేవారు.
ప్రజాపతికి చెల్లెలు లావణ్య అంటే పిచ్చి ప్రేమ...
మూడు సంవత్సరాల క్రిందట జరిగిన ఒక దుస్సంఘటన రెండు కుటుంబాలను వేరుచేసింది. వారి మధ్యన వుండిన ఆత్మీయతను, అభిమానాలను చంపేసింది.
కైలాసవతి... చివరిరోజుల్లో తన యావదాస్తిని రెండు భాగాలుగా చేసి కొడుకు ప్రజాపతికి, కుమార్తె లావణ్యకు వీలునామా వ్రాసి రిజిస్టర్ చేయించి ఇరువురికీ అందించాడు. లావణ్య సంతోషించింది కానీ... ప్రజాపతికి తన తండ్రి నిర్ణయం... వ్రాసిన వీలునామా నచ్చలేదు. జరిగిన సంఘటనకు ముందే వీలునామాలు సిద్ధం అయిన కారణంగా తండ్రి గతించిన తర్వాత హరికృష్ణ, లావణ్యల మీద ప్రజాపతికి కోపతాపాలను పెరిగే దానికి ఆస్థిపంపకం కూడా ఒక ముఖ్యకారణం అయింది. ప్రణవికి మాత్రం... తన మామగారు ధర్మబద్ధంగా చేశారనే సంతోషం. భర్త ధోరణిలో, మాటల్లో కుటుంబానికి సంబంధించి పగ పెరుగుతూనే వుందని గ్రహించి అతనికి ఎదురుచెప్పలేక మౌనాన్ని పాటించేది.
కొన్ని కుటుంబాల్లో మగవారు స్వార్థంతో ఇంట్లో శ్రీరాముడిగా, వీధిలో రావణాసురుడుగా ప్రవర్తించేవారు కొందరుంటారు. కానీ ఇంటి గృహిణి... భర్త తత్త్వాన్ని విమర్శించలేక... అతన్ని హెచ్చరించలేక... తన మనోవ్యధను తాను నమ్ముకొన్న దేవునికి మొర పెట్టుకొంటుంది. తన భర్త తత్త్వాన్ని మార్చమని వేడుకొంటుంది. అలాంటి కోవకు చెందింది ప్రణవి. ఆమె ప్రార్థన.... దైవ ఆరాధన.. ప్రజాపతికి అతనికి తెలియని అండదండలు.
====================================================================
ఇంకా వుంది..
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 3 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: నేటి బాంధవ్యాలు - 3 - by k3vv3 - 21-10-2024, 09:11 AM



Users browsing this thread: 3 Guest(s)