Thread Rating:
  • 2 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేటి బాంధవ్యాలు - 6
#14
నేటి బాంధవ్యాలు ఎపిసోడ్ 3






హాల్లో కుర్చొని వున్న ప్రజాపతి.... కూతురు లోనికి రావడాన్ని చూచి....
"అమ్మా దీప్తి!.... ఎక్కడికి వెళ్లావురా!..."
"మీతో చెప్పాను కదా నాన్నా!,.... నేను మామయ్య వాళ్ళ ఇంటికి వెళుతున్నానని."
"ఆఁ....ఆఁ... చెప్పావ్!.... నిన్ను చూచి ఏమంది మీ అత్త!..."
"ఆమె ముందు మీకు చెల్లెలు, తర్వాత నాకు అత్త అయింది కదా నాన్నా! మా చెల్లెలు నిన్ను చూచి ఏమంది అని కదా నాన్నా అడగాల్సింది?..." అంది దీప్తి.
దీప్తి ముఖంలోకి కొన్ని క్షణాలు పరీక్షగా చూచాడు ప్రజాపతి.
కూతురు గొంతువిని దీప్తి తల్లి ప్రణవి హాల్లోకి వచ్చింది.
"కూతురు నాకు బాంధవ్యాలను గుర్తు చేస్తూ వుంది ప్రణవీ!..." వ్యంగ్యంగా నవ్వాడు ప్రజాపతి.
"హక్కు వుంది కనుక... చెబుతుంది... అండులో అతిశయోక్తి ఏముందండీ!" చిరునవ్వుతో చెప్పింది ప్రణవి.
ప్రజాపతి నిట్టూర్చి తలను ప్రక్కకు తిప్పుకొన్నాడు.
దీప్తి తల్లిని సమీపించి...
"అమ్మా!... అత్తయ్య వీటిని నీకోసం పంపింది" తండ్రి ముఖంలోకి చూస్తూ చెప్పింది దీప్తి.
"ఏమిటే అవి?..."వ్యంగ్యంగా నవ్వాడు ప్రజాపతి.
"సున్నివుండలట... అవి నీకు చాలా ఇష్టం అని కూడా చెప్పిందమ్మా!"
"అవునే!.... మీ అత్తయ్య అదే నా వదిన... సున్నివుండలను ఎంతో బాగా చేస్తుంది. ఇలా ఇవ్వు..." కూతురు చేతిలోని డబ్బాను అందుకుంది.
ప్రజాపతి గుటకలు మ్రింగుతూ ప్రణవి ముఖంలోకి చూచాడు.
"రంగీ!... ప్లేటు తీసుకురా!..." కాస్త హెచ్చుస్థాయిలో పలికింది ప్రణవి భర్త ముఖంలోకి చూస్తూ.
పిలుపును విన్న పనిమనిషి రంగి పరుగున వచ్చి ప్లేటును ప్రణవికి అందించింది.
మూత తీసి ఆరు వుండలను అందులో వుంచి ప్లేటుతో ప్రజాపతిని సమీపించింది.
"తీసుకోండి..." అంది.
"నాకు అక్కర్లేదు."
"ఉదయాన్నే కదా చేయమన్నారు!..."
"నిన్ను చేయమన్నాను..."
"మనం మనుషులం... కోపాలు, తాపాలు, పంతాలు, పట్టింపులు వుండడం సహజమే!.... కానీ ప్రాణం లేని యీ తీపికి మనలోని వాటికి అంటగట్టడం తప్పుకదండీ!... యీ వుండలను మా వదిన పంపింది మీ కోసమే!... మీ ఇష్టాయిష్టాలు ఆమెకు తెలియంది కాదుగా!.... తీసుకోండి!..." లాలనగా చెప్పింది ప్రణవి.
"నేను చెప్పింది నీకు అర్థం కాలేదా!..." గొంతులో కరుకుదనం.
"అంతేనా!...." అంది ప్రణవి.
"అంతే!...." కుర్చీ నుంచి లేచి వరండాలోకి వెళ్ళిపోయాడు ప్రజాపతి.
"ఏంటమ్మా!... నాన్న ఇంత పెంకిగా తయారైనాడు!..." ఆశ్చర్యంతో అడిగింది దీప్తి.
"పాపం... పాపం చేస్తే... మనిషికి శాంతి వుండదు. ఇలాగే ప్రతి విషయానికీ కోపం, ఆవేశం వస్తుంది తల్లీ!..."
"అంటే నాన్న!..."
"మీ అత్తయ్య, మామయ్యల విషయంలో నేను ఎంతగా చెప్పినా నా మాట వినకుండా తప్పుచేశాడు!..."
"ఏం చేశాడమ్మా!..."
"పాపాన్ని!..."
"అంటే!..."
"అదో పెద్ద కథలే!... ముందు నన్ను రెండు సున్నివుండలను తిననీ!..."
"ఆఁ... ఆఁ.... తినమ్మా!.... నాకూ రెండు ఇవ్వు!...."
"ప్రణవీ!.... గ్లాసు మంచినీళ్ళు ఇవ్వు!...." అడిగాడు ప్రజాపతి.
"అమ్మా!... నీవు కూర్చొని తిను. నాన్నకు నేను మంచినీళ్ళు ఇస్తాను" వేగంగా ఫ్రిజ్ను సమీపించి బాటిల్ను చేతికి తీసుకొని సున్నివుండను నోట్లో వేసుకొని వరండాలోకి వచ్చి...
"నాన్నా!.... వాటర్...! అంది దీప్తి.
నోటిలో సున్నివుండ ఉండడం కారణంగా... మాటల్లో స్పష్టత లోపించింది. వంగి గ్లాసును ప్రజాపతికి అందించబోయింది దీప్తి. కూతురు ముఖంలోకి చూచాడు ప్రజాపతి. తల్లోని మల్లెలు ముందు వైపుకు జారాయి.
గ్లాసును అందుకొన్నాడు ప్రజాపతి... నీళ్ళను కొంత త్రాగి... "నీ తల్లోని మల్లెపూలు!..."
"మా అత్తయ్య అంటే మీ చెల్లెలు గారు ప్రేమతో తల్లో పెట్టారు. మల్లెల సువాసన చాలా బాగుంది కదా నాన్నా!..." గోముగా అడిగింది దీప్తి.
కొన్నిక్షణాలు దీప్తి ముఖంలోకి చూచి... అవునన్నట్లు తల ఆడించి మంచినీళ్ళు త్రాగాడు ప్రజాపతి. గ్లాసును దీప్తికి అందించాడు.
"ఏం తింటున్నావ్!..."
"సున్నివుండ!..."
"వాసన చాలా బాగుంది!..." అప్రయత్నంగా ప్రజాపతి నోటినుంచి మాట జారింది.
"తీసుకురానా నాన్నా!...."
రోషం... అహంకారాల బుస... "వద్దని చెప్పానుగా!..." అన్నాడు.
"సరే!... మీ ఇష్టం!...." లోనికి వెళ్ళిపోయింది దీప్తి.
మాధవయ్య ప్రజాపతిని సమీపించాడు.
"రా మాధవా!... కూర్చో..."
మాధవయ్య ప్రజాపతికి ఎదుటి కుర్చీలో కూర్చున్నాడు.
ప్రజాపతి సింహద్వారం వైపు ఒకసారి పరీక్షగా చూచి....
"అక్కడికి వెళ్ళావా!... మాట్లాడావా!...." మెల్లగా అడిగాడు.
" రెండూ నేను చేయవలసినవి... సవ్యంగా చేశాను!.."
"మరి... వాళ్ళేమన్నారు?..."
మౌనంగా ఉదయం హరికృష్ణ ఇంట్లో తనకు జరిగిన పరాభవాన్ని తలచుకొంటూ కూర్చున్నాడు మాధవయ్య.
అతని మౌనాన్ని సహించలేక ప్రజాపతి...
"ఏమన్నారో చెప్పరా!..."
"మీ సోదరి నా నోటికి తాళం వేసింది..."
"అంటే!..."
"ఒరే! ప్రజా!... నేను హరికృష్ణతో శార్వరి వివాహం... అన్నానో లేదో.... మహాతల్లి నీ సోదరి లావణ్య నన్ను బెదిరించింది. నిన్ను అసహ్యించుకొంది. సంబంధాలను కలుపుకోవాలనే మంచి మనస్సు వాడికి వుందేమో కానీ మాకు అంతటి గొప్ప మనస్సులేదు. వాడు మాకు చేసిన ద్రోహాన్ని మేము మరువలేదు. మా పిల్లలకు సంబంధాలు చూచే ప్రయత్నాన్ని మీరు మానుకోండి.. అంది" విచారంగా చెప్పాడు మాధవయ్య.
ప్రజాపతి... కళ్ళల్లో క్రోధం... ముఖంలో చిరాకు.
"హరి ఏమీ అనలేదా!..." సాలోచనగా అడిగాడు ప్రజాపతి.
" ఇంట్లో ఆమె మాటను కాదనే ధైర్యం ఎవరికి వుందిరా!... మీ బావ సత్తా నీకు తెలీదా!..." వ్యంగ్యంగా నవ్వాడు మాధవయ్య.
హృదయంలో ఆవేశాన్ని అణచుకొని 
"నా గురించి నీకు బాగా తెలుసుగా!..."
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 3 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: నేటి బాంధవ్యాలు - 2 - by k3vv3 - 21-10-2024, 09:07 AM



Users browsing this thread: 2 Guest(s)