Thread Rating:
  • 2 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Comedy హాస్య కథలు - ఆ కొందరి వలన
#31
వామన రావు - విమానయానం

[Image: image-2024-10-18-121228091.png]

రచన: వీరేశ్వర రావు మూల


చిన్నప్పుడు అందరిలా మా వామనరావు కి చదువు అబ్బ లేదు. బండి పదవతరగతి దగ్గరే ఆగి పోయింది. 



ఏమవుతాడో అని తల్లితండ్రి బెంగ పెట్టుకున్నారు. 



కాని వామనరావు మేనమామ వెంకట్రావు వామనరావు లో స్పార్క్ ని గమినించి "అక్కా! నువ్వు బెంగ పెట్టుకోకు. నేను వీడిని చాకులా తయారు చేస్తాగా" అని చెప్పి తనతో పాటు హైదరాబాద్ తీసుకుపోయాడు. 



ఐదేళ్ళ వరకూ వామనరావు గురించి వివరాలు మనకు తెలియలేదు. వామనరావు తల్లి కి మాత్రం పిల్లాడు క్షేమమని సమాచారం వచ్చింది. 



ఆరోజు పేపర్లో ప్రకటన వచ్చింది. 



ప్రముఖ వాస్తు, జ్యోతిష్య విద్వాన్ వామనరావు గారు మీ పట్టణానికి విచ్చేయుచున్నారు. మీ వాస్తు సమస్యలు పరిష్కారానికి సంప్రదించు వేళలు: ఉదయం పది నుండి ఐదు వరకూ.. 



ప్రకటన చూసి వామనరావు తల్లీ, తండ్రీ సంతోషించారు కొడుకు ప్రయోజకత్వాన్ని చూసి. 



 *******



వామనరావు ఆందోళన గా ఉన్నాడు. 
అర్జంటు గా వైజాగ్ వెళ్ళాలి. మంత్రి గారు కొన్న కొత్త ఇంటి వాస్తు చూడాలి. ఏం చెయ్యాలో తెలియక ఫ్రెండు కి ఫోన్ చేసాడు. 



"ఇందులో వర్రీ అవడానికి ఏముంది ? విమానం ఎక్కు "



"విమానమా !" అన్నాడు సందేహం గా 



"ఆరు నెలల గుడ్డు కూడా విమానం ఎక్కుతోంది. రేపు ఉదయం ఫ్లైట్ కి టిక్కెట్ పంపుతా. హేపి గా వెళ్ళండి. "



 **********
వామన రావు విమానం లో కూర్చుని లిప్ స్టిక్, స్కర్ట్ పిల్ల ని పిలిచాడు బెల్ట్ పెట్టమని. నెమ్మది గా విమానం గాలి లోకి లేచింది. వామన రావు లో కవి నిద్ర లేచాడు. 



చిన్నప్పటి కవిత నెమరువేసు కున్నాడు. చేపలు పట్టే ఆడ పిల్ల ని చూసి అశువు గా అల్లాడు. 
"నీ చేతి లో కొరమీను 
 నల్లగా మెరిసింది నీ మేను "



వామనరావు కాస్సేపు కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు తెరిచే సరికి పానీ పూరి బండి లాంటి దాన్ని తోసుకు వచ్చి "స్నాక్స్ కావాలా ? " అడిగింది క్రూ మెంబర్. 



"కాఫీ ? " 



"టు హండ్రెండ్ "



"మా ఊళ్ళో ఇరవై మంది తాగుతారు " అని గ్లాసుడు నీళ్ళు తాగాడు. 



కొంచెం సేపయ్యాక కెప్టెన్ ప్రకటన వినబడింది. మా విమానం ఎక్కినందుకు కృతజ్ఞతలు. మీరు హాయిగా గమ్య స్ధానం చేరతారు మా విమాన సర్వీసు తో.. 



పది నిమిషాల తర్వాత.. విమానం లో కలకలం.. 



పిస్తోలు పట్టు కున్న వ్యక్తి వచ్చి 
" విమానం ను హైజాక్ చేసాను. ఇది ఇప్పడు పాకిస్థాన్ పోతోంది. గోల చెయ్య కుండా కూర్చోండి. మా డిమాండ్ జలీలూద్దీన్, ను ప్రభుత్వం విడిస్తే మీరు బయట పడతారు " అన్నాడు అబ్దుల్. 



"మంత్రి గారిని అర్జంటు గా కలవాలంటే పాకిస్ధాన్ అంటాడేమిటి నా పిండాకూడు " అన్నాడు వామనరావు. 



"వాడు చేసింది హైజాక్ తినే క్రాక్ జాక్ కాదు. మిమ్మల్ని తాపి గా వైజాగ్ లో దింపి, RK బీచ్ లో తిప్పి తరువాత కరాచి తీసుకెడతాడు. గోల చెయ్యకు " అన్నాడు పక్కనున్న ప్రయాణికుడు విసుగ్గా. 



ఏం చెయ్యాలి ? ఏం చెయ్యాలి ఆలోచించగా వామనరావు మెదడు లో ఫ్లాష్.. 



కదిలేది కదిలించేది 
పెను నిద్దర వదిలించేదయిన నా అక్షరాయుధం 
కవిత్వం ఉండగా హైజాకర్ కి భయపడటమా ?
చూపిస్తా నా పెన్ పవర్.. 
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: హాస్య కథలు - తారుమారు మారుతారు - by k3vv3 - 18-10-2024, 12:14 PM



Users browsing this thread: 1 Guest(s)