Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేను చదివిన కథలు - పందిట్లో పెళ్లవుతున్నది
#8
భార్యా బాధితులు
రచనతాత మోహనకృష్ణ
                          


"హలో సర్! నా పేరు రవి.. నాకు మీ హెల్ప్ కావాలి సర్.. !"
"నేను ఏమీ హెల్ప్ చెయ్యలేను... వెళ్ళు... "



"చెప్పాను కదా! అయ్యగారు కేసులు వాదించి చాలా సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు కేసులు టేక్అప్ చెయ్యట్లేదు. వెళ్ళండి సర్.. "



ది గ్రేట్ లాయర్ పద్మనాభం అంటే.. చాలా గొప్పగా ఉంటారేమో అనుకున్నాను. ఈయన చూస్తే, మందు కొట్టి.. పగలే సగం నిద్రలో ఉన్నాడు.. 



అలా అనకండి సర్! నేను అయ్యగారి దగ్గర చాలా సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నాను. మా అయ్యగారు చాలా గొప్పవారు. అప్పట్లో, ఆయన కేసు టేక్అప్ చేస్తే, గెలిచేసినట్టే. ఆయనని అందరూ విడాకుల స్పెషలిస్ట్ అనేవారు.. 



"అంత గొప్ప ఆయన ఇలా అయిపోయారేమిటి.. ?"



విధి సర్.. ఎంత గొప్ప లాయర్ అయినా, ఆయనా ఒక భార్యా బాధితుడే కదా! పెళ్ళి కి మునుపు.. అయ్యగారు చాలా హుషారుగా వాదించి.. ఎంతో మంది భార్యా బాధితులకు విడాకులు ఇప్పించి.. స్వేఛ్చ ని ఇచ్చారు. ఇప్పటికి తొంభై తొమ్మిది మందికి విడాకులు ఇప్పించిన తొలి లాయర్ గా అయ్యగారికి సన్మానం కుడా చేసారు.. ఆ భార్యా బాధితుల సంఘం వారు. 



అవును.. ఈ భార్యా బాధితుల సంఘం గురించి నేనూ విన్నాను. నేను చేరడం కోసం వెళ్ళాను. భార్యా బాధితులు ఎక్కువమంది ఉన్నారని... రోజు రోజు కు పెరుగుతూ ఉన్నారని తెలిసింది. భార్యల కారణంగానే ఎంతోమంది జీవితాలు నాశనమయ్యాయని అక్కడే నాకు తెలిసింది. దాని గురించి ఇప్పుడు వద్దు గానీ.. మీ అయ్యగారి తర్వాత కేసు.. ?"



అప్పుడే అయ్యగారికి పెళ్ళి అయ్యింది.. అమ్మగారు వచ్చిన తర్వాత.. కొన్ని రోజులు ఈ కేసులు పక్కన పెట్టి.. ఇద్దరూ సరదాగానే ఉన్నారు. 



ఆ తర్వాత ఏమైంది?



ఏముంది.. అమ్మగారికి డబ్బు మీద ఆశ పుట్టింది. వచ్చిన ప్రతి జంట కు విడాకులు ఇప్పిస్తానని ముందే ఎక్కువ ఫీజు తీసుకునేవారు. ఈ విషయం అయ్యగారికి అసలు నచ్చలేదు. ఎందుకంటే, మా అయ్యగారు కేసు నచ్చితేనే ఒప్పుకుంటారు. ఈ విషయమై ఇద్దరికీ రోజూ గొడవలు అయ్యేవి. అలా.. పెరిగి ఆ గొడవలు బాగా పెద్దవి అయ్యాయి. కొన్ని రోజుల తర్వాత, అమ్మగారు విడాకుల కోసం నోటీసు పంపించారు. అయ్యగారు.. డిప్రెషన్ లోకి వెళ్ళిపోతే, కొడుకు పరిస్థితి చూసి.. విడాకులు ఇచ్చేయమని తల్లి చెప్పగా.. అయ్యగారు ఇచ్చేసారు. అప్పటి నుంచి కేసులు వాదించడం మానేసారు. 



అయితే, నేను రేపు ఉదయం వస్తాను.. అయ్యగారు ఇంట్లోనే ఉంటారు కదా.. ?
"అవును సర్! ఉంటారు"



మర్నాడు ఉదయం, లాయర్ ఇంటికి వచ్చాడు రవి. అప్పటికే పద్మనాభం గారు బ్రేక్‌ఫాస్ట్ చేసి, గార్డెన్ లో కూర్చున్నారు. 



"గుడ్ మార్నింగ్ సర్! "
"ఎవరు?"
"నేను.. రవి! నిన్న సాయంత్రం వచ్చాను.. మీతో మళ్ళీ మాట్లాడాలని ఇప్పుడు వచ్చాను.. "
"నాతో ఏమిటి పని రవి?"



"నాకు మీ సహాయం కావాలి సర్. నేను భార్యా బాధితుడను.. నాకు మీరు విడాకులు ఇప్పించాలి"
"విడాకులా?"
"పెళ్ళయి ఎన్ని సంవత్సరాలైంది?"
"త్రీ ఇయర్స్ సర్"



నా స్టొరీ చెబుతాను సర్.. అప్పుడు మీకు అన్నీ అర్ధమవుతాయి.. 



నేను ఒక చిన్న కంపెనీ లో ప్రైవేటు ఎంప్లాయ్. అందరి లాగే నేను కుడా పెళ్ళి గురించి చాలా గొప్ప కలలే కన్నాను. మా ఇంట్లో అమ్మాయిని చూసి పెళ్ళి చేసారు. మొదటి సంవత్సరం నా కన్నా లక్కీ ఈ ప్రపంచంలోనే ఎవరు లేరేమో అనిపించింది. తర్వాత మా ఆవిడ నన్ను సాధించడం మొదలు పెట్టింది. తను ఏది చెబితే అదే చెయ్యాలని మొండిగా ఉండేది. అప్పటికీ చాలా పనులు కష్టమైనా, నష్టమైనా చేసాను. తర్వాత నా వల్ల అవలేదు.. అనవసర వస్తువలు కొనడం.. ఏమైనా అంటే.. గొడవ పెట్టుకుని.. పుట్టింటికి వెళ్ళిపోయేది. ఇలా ఇంకో రెండు సంవత్సరాలు సాగింది. కూర్చోమంటే, కూర్చోవాలి.. నిల్చోమంటే.. నిల్చోవాలి.. బొత్తిగా స్వేఛ్చ లేదు సర్! ఇంక ఆ తరువాత నా వల్ల అస్సలు కావట్లేదు. 



మీరే నన్ను కాపాడాలి.. పెళ్ళాం లేకపోయినా జీవితాంతం ఒంటరిగానే ఉండిపోతాను... మీరు ఆ విడాకులు ఇప్పించండి సర్.. 



ఏమైంది సర్... మీ కంట్లో నీళ్ళు?



నీ కథ వింటుంటే, నా కథ గుర్తొచ్చింది రవి... లోకం లో ఎక్కువ మంది ఆడవారు ఇంతేనేమో!... వారికి డబ్బు, అధికారం కావాలి. భర్త పై అధికారం తొందరగా సంపాదించి.. వాళ్ళు చెప్పినట్టు ఆడిస్తారు మన మగవాళ్ళని. నేను ఇప్పించిన విడాకుల కేసులలో ఎక్కువ మంది ఇలాంటి భార్యా బాధితులే రవి. అయినా.. నేను ఇప్పుడు కేసులు వాదించడం లేదు.. మానేసాను. వేరే లాయర్ ని చూసుకో’. 



ప్లీజ్ సర్.. మీ తమ్ముడు లాంటి వాడిని.. నా ముఖం చూసి చెప్పండి సర్! మీ లాంటి లాయర్ ఇలా అంటే, మా లాంటి భార్యా బాధితులకు విముక్తి ఎలా వస్తుంది సర్? మీరు కేసు టేక్అప్ చేస్తే చాలు, నేను గెలిచినట్టే.. ”



“సరే రవి, నీ కోసం.. మన మగవారి స్వేఛ్చ కోసం ఇకపై కేసులు వాదిస్తాను.. ”



****
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 3 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: నేను చదివిన కథలు - నన్ను కోరి - by k3vv3 - 16-10-2024, 01:32 PM



Users browsing this thread: 1 Guest(s)