11-10-2024, 01:26 PM
"ఈశ్వర్ని అడిగి చూద్దామా!..."
"ఇప్పుడు కాదు... అసలు వాణ్ణి అడగవలసిన అవసరం లేదు. వాడు మన మాటను కాదనడండీ!..."
"పట్టుదల... పగ... ప్రతీకార వాంఛలు వాడిలోనూ వున్నాయని నా అభిప్రాయం!..."
"మనం నచ్చచెబితే.... వాడు మన మాటను మీరడండీ!...."
"మొన్న నాతో వాడేమన్నాడో తెలుసా!..."
"ఏమన్నాడు!..."
"ఈ సంవత్సరంలో శార్వరి చదువు అయిపోతుందిగా... ముందు దాని వివాహం ఘనంగా జరిపించాలి. ఆ తర్వాతనే నా వివాహ ప్రసక్తి" అన్నాడు.
"వాడి నిర్ణయం మంచిదే కదా!..."
"అవును... చాలా మంచిది..."
"ఈ విషయంలో నా సలహా ఏమిటంటే!..."
"చెప్పు లావణ్యా!..."
"శివరామకృష్ణ అన్నయ్యకు ఉత్తరాన్ని వ్రాయండి. వారు రావాలనుకొంటున్నారుగా!... రాబోయే ముందు ఆ ప్రాంతంలో మనకు తగిన మంచి కుటుంబాల్లో మొగపిల్లలు వున్నారేమో విచారించి రావలసిందిగా వ్రాయండి. వారు పేదవారైనా సరే.... గుణ గణాల్లో.... పరువు మర్యాదల విషయంలో... మంచివారుగా... మనకు తగినవారుగా వుండాలి."
"అలాగే లావణ్యా!... ఈ రోజే వ్రాస్తాను."
"ఫోన్లో అన్ని వివరంగా మాట్లాడలేము. అందుకే అన్ని విషయాలను వివరంగా వుత్తరంలో వ్రాయండి."
"సరే..."
ఈశ్వర్ వరండాలోకి వచ్చాడు.
"నాన్నా!.... నేను మన తోటవరకూ వెళ్ళొస్తాను. కేరళ నుంచి ఆరుటెంకాయ మొక్కలను నా స్నేహితుని ద్వారా తెప్పించాను అవిగో... వాటిని తోటలో నాటించి వస్తాను..."
"సరే జాగ్రత్తగా వెళ్ళిరా!..."
ఈశ్వర్ తన... హీరోహోండా పై టెంకాయ మొక్కలను పెట్టుకొని తోటవైపుకు వెళ్ళిపోయాడు.
"అమ్మ!.... అన్నాన్ని దించేశాను.... కూర ఏం చేయమంటావ్!..." వరండాలోకి వచ్చి అడిగింది శార్వరి.
"వంకాయలు... బెండకాయలు... చిక్కుడుకాయలు వున్నాయ్.... నీకు ఏది యిష్టమో వాటిని తరుగు...."
"వంకాయలు తరుగుతా!..."
"సరే!...."
శార్వరి లోనికి వెళ్ళిపోయింది.
హరికృష్ణ కుర్చీనుంచి లేచి "లావణ్యా!... నేను శివాలయానికి వెళ్ళి వస్తాను" అన్నాడు.
"మంచిదండి వెళ్ళిరండి."
హరికృష్ణ వీధివైపుకు.... లావణ్య వంటగది వైపుకు నడిచారు.
కారులో ఇంటికి బయలుదేరిన దీప్తి... తాను హరికృష్ణ ఇంటికి వెళ్లడం... అక్కడ జరిగిన సంభాషణ... ఈశ్వర్ తనను చూచి పలకరించకపోవడం.... ’బయలుదేరుతాను’ అని చెప్పి లేచిన తనను, లావణ్య అత్త పిలవడం.... తనకు ఇష్టమైన గారెలు, పాలు ఇవ్వడం... తల దువ్వి పూలు పెట్టడం... అన్నీ చిత్రంగా ఒకదానికి మరోదానికి సంబంధం లేకుండా జరిగినట్లనిపించింది దీప్తికి.
’మామయ్య!... చిన్ననాడు నన్ను ఎలా పలకరించాడో అదేలా అభిమానంతో పలకరించాడు. అత్తయ్య తొలుత ఆవేశంగా మాట్లాడినా, తర్వాత నా ఇష్టాన్ని మరవలేదనే దానికి నిదర్శనంగా గారెలు, పాలు ఇవ్వడం... తలలో పూలు పెట్టడం... ’ఇది మన పద్ధతి... మరచిపోయినట్లున్నావు...’ అని చెప్పడం... అంటే ఒక్క ఈశ్వర్కు తప్ప అందరూ నన్ను పూర్వంలా ఆదరించే మనస్సు వున్నవారే... ఈశ్వర్కు మాత్రం ఎందుకు నా మీద అంత కోపం!... ఆ కోపానికి కారణం నేనా!... కాదే... మరి ఎవరు?... నాన్నా!!!... నేను ఇక్కడ లేని గత అయిదేళ్ళలో ఈ రెండు కుటుంబాల మధ్య ఏదో పెద్ద గొడవే జరిగి వుంటుంది. మామయ్య, అత్తయ్య పెద్దవారు గనుక నా పెద్దవారిపైన వున్న కోపాన్ని వారు నా మీద చూపించలేదు. కానీ ఈశ్వర్.... ఈ ఇంటికి సంబంధించిన నన్ను అసహ్యించుకొంటున్నాడు. యువకుడు కదా!... యంగ్ హ్యాండ్సమ్ మ్యాన్!... ఆ కథ నాకు ఎలా తెలుస్తుంది. అమ్మను నాన్నను అడగవద్దని మామయ్య చెప్పారు. నేను తలూపాను. వారిని అడిగితే మాట తప్పినదాన్ని అవుతాను. వారికి ఆ విషయం తెలిస్తే ఈనాడు వారు నామీద చూపిన అభిమానం స్థానంలో అసహ్యం ఏర్పడవచ్చు. నాలో నిజాయితీ లేదని అనుకోవచ్చు... అలా జరుగకూడదు. పైన వున్నాడుగా... నే నమ్మిన శ్రీ భగవాన్ రమణ గురువులు... నా ఆవేదనను వింటున్నాడుగా... వారే ఏదో దారి చూపిస్తారు... నిజాన్ని వారు ఎవరో ఒకరి ద్వారా నాకు తెలియజేస్తారు’ అనుకొంది దీప్తి. కారు వారి ఇంటి పోర్టికోలో ఆగింది. దీప్తి దిగి ఇంట్లోకి నడిచింది.
====================================================================
ఇంకా వుంది..

ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ