Thread Rating:
  • 2 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేటి బాంధవ్యాలు - 6
#9
నేటి బాంధవ్యాలు ఎపిసోడ్ 2

కాలేజీ నుంచి నేరుగా... హరికృష్ణ ఇంటికి వచ్చిన దీప్తి ఊయల చెక్కపై పుస్తకాల సంచిని వుంచి... పరుగున వంటింట్లోకి వెళ్ళింది.
"అత్తయ్యా!..."
"ఏరా కాలేజీ వదిలేశారా!.."
"వదలబట్టేగా ఇంటికి వచ్చాను!..."
"ఏమిటే పరాగ్గా వున్నావ్!..."
" జ్యోతి లేదూ!..."
" జ్యోతీ!..."
"రామలింగం అంకుల్ కూతురు!..."
"నిన్నేమన్నా అందా!..."
"అంది..."
"ఏమంది?..."
"అత్తయ్యా!... అది కాలేజీకు మూడు గారెలు తెచ్చింది. నాకు చూపించింది. నేను.. నాకు ఒకటివ్వవే అడిగాను. అది... నన్ను ఏమందో తెలుసా!..."
"ఏమందిరా!..."
"నేను ఇవ్వను... నీకు కావాలంటే నీ మొగుడి అమ్మను... అదే మీ మేనత్తను అడిగి చేయించుకొని తిను... అంది అత్తయ్యా!... అది చాలా చెడ్డది అత్తయ్యా!..." రోషంతో చెప్పింది దీప్తి. లావణ్య పకపకా నవ్వింది.
"అత్తయ్యా!.... మీరూ నన్ను వెక్కిరిస్తున్నారా!..."
లావణ్య దీప్తిని సమీపించి తన చేతుల్లోకి దీప్తి ముఖాన్ని తీసుకొని... చిరునవ్వుతో... "అది తప్పుగా ఏం చెప్పలేదురా. నీవు నా మేనకోడలివి. నేను నీ మేనత్తను. నా కొడుకు ఈశ్వర్ నీకు కాబోయే మొగుడు... ఇంతకూ ఇప్పుడు నా కోడలికి గారెలు కావాలి... అంతేగా!..." నవ్వింది లావణ్య.
"అవును..." బుంగముతితో చెప్పింది దీప్తి.
"అరగంటలో లోపల నీ ముందు వేడివేడి గారెలు వుంటాయి. ముఖం కడుక్కొనిరా. పాలు తాగు."
పరుగున దీప్తి వెళ్ళి ముఖం కడుక్కొని లావణ్యను సమీపించింది. పాలగ్లాసును దీప్తి చేతికి అందించింది లావణ్య. గటగటా త్రాగి గ్లాసును ఖాళీ చేసింది దీప్తి.
"హోంవర్కు ఏదైనా వుంటే వ్రాసుకో... గారెలు రెడీ చేసి పిలుస్తాను." అంది లావణ్య.
"వుంది అతయ్యా వ్రాస్తాను" వెళ్ళి ఊయల చెక్కపై కూర్చొని హోంవర్కు వ్రాయసాగింది దీప్తి.
అరగంట గడిచింది. హోంవర్క్ పూర్తిచేసింది దీప్తి.
"అత్తయ్యా!... హోంవర్క్ ఫినిష్!..." బిగ్గరగా అరిచింది.
"గారెలు కూడా రెడీ!... రా తిందువు గాని..." అంది లావణ్య.
దీప్తి వంటింట్లోకి వచ్చింది.
లావణ్య టేబుల్పై గారెల ప్లేటును వుంచింది.
దీప్తి కుర్చీలో కూర్చుంది.
"దీపూ!... గారెలు వేడిగా వున్నాయి. నిదానంగా వూదుకొని తిను..." అంది లావణ్య.
అదే... డైనింగ్ టేబుల్... అదే కుర్చీ...
* * * *
పది సంవత్సరాల క్రిందట జరిగిన సంఘటన దీప్తికి గుర్తుకు వచ్చింది. ఆమె కళ్ళల్లో కన్నీరు...
వాటిని చూచిన... శార్వరి...
"దీప్తి! ఏడుస్తున్నావెందుకు?" ఆశ్చర్యంతో అడిగింది.
"గతం గుర్తుకువచ్చింది శారు. ఇవి కన్నీరు కాదు... ఆనందభాష్పాలు. అత్తయ్య... నాకు ఏది ఇష్టమో కాదో అనే విషయాన్ని మరువలేదు" సాలోచనగా చెప్పింది దీప్తి.
"తిన్నావా దీపూ!" అడిగింది లావణ్య.
"ఆఁ... తిన్నానత్తయ్యా!... గతాన్ని గుర్తు చేసుకుంటూ తిన్నాను."
"శార్వరీ!... వచ్చి పాలగ్లాసుకు తీసుకు వెళ్ళు." అంది లావణ్య.
శార్వరి వెళ్ళి పాలగ్లాసులతో డైనింగ్ టేబుల్ను సమీపించింది. ఒక గ్లాసును దీప్తికి అందించింది.
పాలగ్లాసులోని పాలపై దీప్తికి లావణ్య ముఖం గోచరించింది. చిరునవ్వుతో.... జరిగిన గొడవ ఏందో... దాని కారణంగా అత్తయ్యకు నాన్నమీద కోపం వున్నా... నా విషయంలో ఆమె మనస్సులో ఎలాంటి ద్వేషమూ లేదు. దానికి సాక్షి... తను నాకు ఎంతో ఇష్టమైన గారెలు చేయడం... నాచేత తినిపించడం.... నాకు ఇష్టమైన పాలు నాకు అందించడం... అనుకొంది దీప్తి.
లావణ్య... డైనింగ్ టేబుల్ను సమీపించింది.
"అత్తయ్యా!.... ఇక నేను వెళ్ళిరానా!..." చిరునవ్వుతో ప్రీతిగా లావణ్య ముఖంలోకి చూస్తూ అడిగింది దీప్తి.
"సరే వెళ్ళిరా!... ఆఁ.... ఒక్కమాట!...."
"తప్పుగా అనుకోవుగా!.."
"అనుకోనత్తయ్యా!..."
" మాటను నేను... నీపై నాకు వున్న వాత్సల్యంతో చెబుతున్నాను..."
"చెప్పండత్తయ్యా!..."
" ఇంటికి నీవు ఎప్పుడైనా ఇక ముందు వచ్చేటప్పుడు... శారూను చూడు... వేషంలో రావాలి..."
దీప్తికి.... విషయం అర్థం అయింది.
తల దించుకొని... "అలాగే అత్తయ్యా!.... బయలుదేరుతాను..." అంది.
టేబుల్ పైనున్న డబ్బాను చూపుతూ...
"దాన్ని చేతికి తీసుకో!..."
"శారూ!... దేవుడి రూంలో పూలు వున్నాయి తీసుకురా!..." అంది.
శార్వరీ పూజగదివైపుకు నడిచింది.
" డబ్బాలో ఏమున్నాయి అత్తయ్యా!..."
"సున్నివుండలు... మీ అమ్మకు ఎంతో ఇష్టం...."
"అమ్మకా!.... నాన్నకా!...."
"ఆఁ.... ఒకసారి చెబితే నీకు అర్థం కాదా!..."
"ఆఁ....ఆఁ.... అర్థం అయింది అత్తయ్యా!..." నవ్వుతూ చెప్పింది దీప్తి.
శార్వరి రెండుమూర్ల మల్లెపూల దండను తెచ్చి లావణ్యకు అందించింది. పూలను టేబుల్పై వుంచి...
"దీపూ!... వెనక్కు తిరుగు!..." అంది లావణ్య.
దీప్తి ఆమెకు వీపు మళ్ళించి నిలుచుంది.
తల వెంట్రుకలను తన చేతుల్లోకి తీసుకొని... మూడు పాయల జడను అల్లి... మల్లెపూలను తల్లో వుంచింది లావణ్య.
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 3 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: నేటి బాంధవ్యాలు - by k3vv3 - 11-10-2024, 01:24 PM



Users browsing this thread: 2 Guest(s)