Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేను చదివిన కథలు - పందిట్లో పెళ్లవుతున్నది
#4
నన్ను కోరి
రచన: తాత మోహనకృష్ణ



అబ్బాయి తేజ ఎక్కడ? అని భార్య రమ ను అడిగాడు భర్త మురళి. ఇంకా నిద్ర లేవలేదని బదులు ఇచ్చింది రమ. వీడెప్పుడు మారతాడో తెలియదు.. ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి రెండు సంవత్సరాలు అవుతోంది.. ఏదైనా ఉద్యోగం చూసుకోమని చెబితే, టైం వస్తే చేస్తాను అని కోపంగా చెబుతాడు. వాడితో మాట్లాడాలంటేనే భయంగా ఉంది. గట్టిగా అడిగితే, ఏమైపోతాడో అని భయం. ఇప్పటికి చాలా సార్లు చెప్పి చెప్పి ఊరుకున్నాను. ఒక తండ్రిగా, నా ఒంట్లో శక్తి ఉన్నంతవరకూ వాడిని పోషిస్తాను.. తర్వాత వాడి అదృష్టం. 



పోనీ.. తలివితేటలు లేవా అంటే, ఉన్నాయి. ఇంజనీరింగ్ చదవడం ఇష్టం లేకుండా చదివించానని.. నా మీద పీకలదాకా ఎప్పుడూ కోపమే. పోనీ, వాడికి ఇష్టమైన జాబ్ చూసుకోమని చెప్పి వదిలేసాను. దేవుడే వాడి మనసు మార్చాలి ఇంక! 



ఉదయం పది కి గానీ నిద్ర లేవడు. పోనీ, ఇంట్లో ఏమైనా సాయం చేస్తాడా అంటే, అదీ లేదు. కడుపు నిండా మెక్కి, ఊరు మీద పడడం.. ఉన్న నలుగురు ఫ్రెండ్స్ వేసుకుని; ఊరంతా తిరగడం.. మళ్ళీ రాత్రి ఎప్పుడో ఇంటికి చేరడం.. పడుకోవడం. 



వాళ్ళమ్మ వాడిని గారాబం చేసి చెడగొడుతుంది. గట్టిగా అనడానికి తల్లి ప్రేమ అడ్డొస్తుంది దానికి. తండ్రిగా నేను ఎన్ని మాటలు అన్నా.. చివరికి తల్లి ప్రేమే గెలుస్తుంది. పెళ్ళి చేస్తే, దారికి వస్తాడేమోనని ప్రయత్నాలూ చేసాము. ఉద్యోగం లేని, కనీసం బాధ్యత కి అర్ధం తెలియని మనిషికి.. పిల్లని ఇవ్వడానికి పిల్ల తండ్రి ముందుకు రాలేదు. 



ఒకరోజు.. మా ఇంట్లో ఒక వింత చూసాము. మా అబ్బాయి ఉదయమే లేచి.. స్నానం చేసి.. నీట్ గా రెడీ అయి బయటకి వెళ్ళాడు. సాయంత్రానికే ఇంటికి చేరుకొని.. తొందరగా పడుకుని.. మరల ఉదయం లేచి, అదే రొటీన్. పోనీ, ఉద్యోగం ఏమైనా వచ్చిందా? అని అడిగితే, అలాంటిదే అని చెప్పాడు. ఇలాగ రెండు నెలలు గడిచాయి. 



కొడుకు ఏమిటి చేస్తున్నాడో నని బెంగ ఒక పక్క, భయం మరో పక్క. మంచి పని అయితే, ధైర్యంగా చెప్పేవాడు కదా.. ఎందుకు దాస్తున్నాడో నని అనుమానం వచ్చింది. రోజుల్లో, చెడిపోవడానికి ఎన్నో మార్గాలు లోకంలో. అసలే తేజా కి కోపం ఎక్కువ. ఎంత ఊరుకుందామన్నా, మనసు ఒప్పుకోవట్లేదు.. ఒక తండ్రిగా, రేపు కొడుకు ఏమైనా.. కాని పని చేస్తే.. తండ్రినే అంటారు కదా!



ఇలా కాదని.. ఉదయం అబ్బాయి తో పాటు నేను కుడా వెనుకాలే వెళ్ళాను. చాలా దూరం వెళ్ళిన తర్వాత.. ఒక ఇంటిలోకి వెళ్ళాడు తేజ. మనసు ఉండబట్టలేక, తలుపు కొట్టాను. లోపల నుంచి ఒక పెద్ద మనిషి తలుపు తీసారు. అతనికి ఒక యాభై ఏళ్లు ఉంటాయి. నన్ను లోపలికి రమ్మని మర్యాదగా ఆహ్వానించాడు. ఒక్క క్షణం నాకేమీ అర్ధం కాలేదు. 



ఏదో రోజు మీరు ఇక్కడకు వస్తారని, మీ అబ్బాయి చెప్పాడు. కొడుకు మీద మీకున్న ప్రేమే.. మిమల్ని ఇక్కడ వరకు తీసుకుని వచ్చింది. మీరు ఏమీ కంగారు పడనవసరం లేదు. మంచం మీద పడుకున్నది మా అమ్మాయి. ఆక్సిడెంట్ అయిన దగ్గర నుంచి.. ఉలుకు పలుకు లేకుండా ఉంది. ఒక రోజు అటుగా వెళ్తున్న మీ అబ్బాయిని చూసి.. మొదటి సారి నవ్వింది మా అమ్మాయి. ఇలాగ రెండు మూడు సార్లు జరిగింది. డాక్టర్ కు చూపిస్తే, అతను మా అమ్మాయితో రోజూ మాట్లాడితే, త్వరగా కోలుకుంటుందని చెప్పడం తో.. మీ అబ్బాయిని పిలిచి ఒప్పించాను. రెండు నెలలలో మా అమ్మాయి కి చాలా నయమైంది. ఇప్పుడు అందరినీ గుర్తు పడుతుంది. 



ఉన్న ఒక్క కూతురి కోసమే కదా.. అంతా.. అందుకే, మీ అబ్బాయికి మంచి ఉద్యోగం వేయించి.. మా అమ్మాయిని ఇచ్చి పెళ్ళి చేస్తానని చెప్పడంతో.. మీ అబ్బాయి ఒప్పుకున్నాడు. 



మా అమ్మాయి పూర్తిగా కోలుకున్నాకే పెళ్ళి. దానికి మీ దంపతుల అభిప్రాయం కోసం చూస్తున్నాము. 



మీ అంతటి పెద్దవారు ఉద్యోగం ఇచ్చి.. పిల్లనిస్తానంటే.. సరే అనడం తప్ప, వేరే ఆలోచన లేదు. అంతా మా అబ్బాయి అదృష్టం.. ” 



****
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: నేను చదివిన కథలు - by k3vv3 - 10-10-2024, 02:23 PM



Users browsing this thread: 2 Guest(s)