Thread Rating:
  • 3 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అదృశ్య మందిరం - శంభల రాజ్యం – 14(సమాప్తం))
శంభల రాజ్యం – 4
విక్రమసింహుడి పరాక్రమం
 
అభిజిత్ సింహాల వెంట పర్వత శ్రేణులపై ఉన్న శిక్షణా కేంద్రాన్ని సమీపిస్తున్నాడు. ముందుగా వెళ్తున్న సింహం ఒక్కసారి ఆగి అభిజిత్ వైపు తిరిగి చూసింది. చూపు స్పర్శ అభిజిత్ ని బలంగా తాకింది. అలాంటి సన్నివేశం ఎన్నో సార్లు అక్కడ జరిగినట్టు అనిపించింది. తన స్మృతి పథంలోకి వెళ్ళిపోయాడు. ఇదే సింహం అలా ఎన్నో సార్లు వెనక్కి తిరిగి చూసేది. కానీ అప్పుడున్నదేదో ఇక్కడ కనబడటం లేదు. అసలేంటది ? ఒక వస్తువా? మనిషా? అభిజిత్ చుట్టూ ఉన్న సింహాలు కూడా ఇప్పుడు అభిజిత్ నే చూస్తూ ఉన్నాయి అదేదో గుర్తించు అన్నట్టు. ఒకే సారి ఎనిమిది సింహాల వంక చూస్తూ ఉన్నాడు అభిజిత్. ప్రతీ సింహం తనను ఒకేలా చూస్తోంది. వాటి చూపుల స్పర్శ తాలూకు గాంభీర్యం అదే. మాత్రం తేడా లేదందులో. అభిజిత్ కే తెలియకుండా కన్నీళ్ళొచ్చేస్తున్నాయి. ఏం చెప్పాలని చూస్తున్నాయో అంతుబట్టక కలిగే బాధ నుండి వస్తున్న కన్నీటి అలలవి. కన్నీళ్లు తుడుచుకుని మళ్ళీ ఒకసారి వాటి వంక చూసాడు. ఇప్పుడు సరిగ్గా అర్థం అవుతోంది. అక్కడ ఒకప్పుడు ఉండే మనిషి ఎవరో కాదు. తనే అని. ఇప్పుడు అభిజిత్ లా కాదు. విక్రమసింహుడిలా ఆలోచించాడు. విక్రమసింహ చూపు ఎలా ఉంటుందో అలా చూసాడు అక్కడున్న సింహాసనం వైపు.
 
ఎదురుగా ఉన్న అడ్డంకులు అన్నీ గుర్తుకొచ్చాయి. ఇదొకప్పుడు తన శిక్షణా కేంద్రమే. సింహాసనం పై తన గురువు  సమవర్తి ఉండేవాడు. సింహాసనం వైపుగా నడుచుకుంటూ వెళ్లి గురువును గుర్తుచేసుకోగానే ఆయన రూపం మెదిలింది అక్కడ. ఆయన పాదపద్మాలకు నమస్కరిస్తున్నప్పుడు కన్నీటి బొట్లు అక్కడ పడ్డాయి. కన్నీటి చుక్కలు నేలపై పడ్డాయి. అంటే ఆయన అక్కడ లేకపోయినా తనకు కనిపిస్తున్నాడు అన్న దానికి సంకేతం అది.
 
"విక్రమసింహా....జయించు....జయించు....జయించు 
నీలో ఉన్న ఆవరణలు దాటు
నీ ముందున్నదేదీ నీకు అడ్డు కాదు....నీలో ఉన్నది మాత్రం ఖచ్చితంగా నీకు అడ్డుపడుతోందని తెలుసుకో 
విక్రమసింహా......జయించు.....జయించు....విజయం నీదే తెగించు
 
అవే మాటలు. ఎన్నో సార్లు తన చెవులతో తనే విన్న విజయ డంకాలు.
 
అగాధపు అంచుల్లోకి తను పడిపోతున్నప్పుడు పైకి తీసుకొచ్చిన చేతులలాంటి మాటలవి.
 
ఓటమి అంటే భయపడే విక్రముడిని విజయం తప్ప మరొకటి తెలియని విక్రమసింహుడిగా మార్చిన మంత్రాలవి.
 
విక్రముడు విక్రమసింహుడిగా మారితే అతని నడక చాలు సింహాలు కనిపెట్టేస్తాయి. ఒక నిఖార్సయిన యోధుడిని అదీ విక్రమసింహుడి లాంటి ప్రాణాలకు తెగించైనా వీరత్వాన్ని ప్రదర్శించే యోధుడిని అవి ఎప్పటికీ మరిచిపోవు. అందుకే అవి మామూలు సింహాలు కావు అన్నది.
 
అభిజిత్ ఇప్పుడు విక్రమసింహుడైపోయాడు. తన ఎదురుగా ఉన్న అడ్డంకులు ఇప్పుడు కళ్ళ ముందు ప్రత్యక్షం అయ్యాయి.
 
అగ్ని వలయం కనిపించింది మొదటగా. మరో ఆలోచన లేకుండా దూకేసాడు. దాన్ని చూసిన సింహాలు గర్జిస్తూ వచ్చాయి. ఒక దాని వెంట మరొకటి అదే అగ్ని వలయంలో విక్రమసింహ ఆజ్ఞ జారీ చేసినట్టు కళ్ళు మూసుకుని దూకేశాయి. అగ్ని వలయం మాయమై   సుడి గుండం ప్రత్యక్షం అయ్యింది. మరో ఆలోచన లేకుండా సుడి గుండంలో దూకేసాడు. సుడి గుండాన్ని చూస్తే గుండె ఆగిపోయే భయం వేస్తుంది ఎవ్వరికైనా. అలాంటి సుడి గుండం విక్రమసింహుడికి కనిపించట్లేదు. మరేదో కనిపిస్తోంది. ఆపద కనిపిస్తే ఎవ్వరైనా ఆగిపోతారు. ఒక యోధుడికి మామూలు వాడికి సరిగ్గా ఇక్కడే వ్యత్యాసం ఉంటుంది. యోధుడికి ఆపద చివరన ఉన్న ఉపాయం కనిపిస్తుంది. అందుకే కళ్ళ ముందున్న ఉపద్రవం అపాయంలా అనిపించదు. విక్రమసింహుడి వెంట సుడి గుండంలోకి సింహాలు రక్షక భటులలా వెంట వచ్చేసాయి. అనుకున్నట్టే సుడిగుండం కూడా ఆగిపోయింది.
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 6 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: అదృశ్య మందిరం - ఘోరకలి అరాచకాలు - 4 - by k3vv3 - 09-10-2024, 09:55 AM



Users browsing this thread: