04-10-2024, 09:54 AM
"మీ మధ్యన ఏం గొడవలు జరిగాయో... నాకు తెలీదు మామయ్యా!... మీ యింటికి వెళతానని నాన్నకు ఉదయాన చెప్పాను. ’వెళ్ళిరా’ అన్నారు. ఎలాంటి అభ్యంతరాన్ని చెప్పలేదు. చాలారోజులు అయింది కదా, మిమ్మల్నందర్నీ చూచి సరదాగా మాట్లాడాలని వచ్చాను. కానీ అత్తయ్య మాటలు... ఈశ్వర్ మాటలు నా ధోరణికి వేరుగా వున్నాయి. ఇక నేను ఇంటికి వెళతాను మామయ్యా!... ఈశ్వర్ అన్నట్లు... మన రెండు కుటుంబాల మధ్యన రాకపోకలు లేకుండా చేసిన ఆ కారణం ఏమిటో నాన్నను అడిగి తెలుసుకొంటాను. తప్పు ఎవరిదో, ఒప్పు ఎవరిదో నా స్వనిర్ణయంతో తేల్చుకొంటాను. వస్తాను మామయ్యా!...." సోఫా నుంచి లేచింది దీప్తి.
శార్వరి దీప్తిని సమీపించింది.
"అన్నయ్య మాటలకు బాధపడుతున్నావా!...."
"బాధ కాదే.... అయోమయంగా వుంది. నిజాన్ని తెలుసుకోవాలి. అప్పుడే నా మనస్సుకు శాంతి..."
"అమ్మా దీప్తి!..."
" ఏం మామయ్యా!..."
"వాడిని కాని, అమ్మను కానీ... నీవు ఏమీ అడగవద్దు"
ఆశ్చర్యంతో చూచింది హరికృష్ణ ముఖంలోకి దీప్తి....
"అంటే!...."
"నీవు చిన్నపిల్లవు.... ఐదేళ్ళ తర్వాత నిన్ననేగా నీవు వచ్చింది. ప్రయోజకురాలివై నీవు తిరిగి వచ్చినందుకు వాడు ఇప్పుడు ఎంతో ఆనందంగా వుంటాడమ్మా!... అ విషయాన్ని గురించి అడిగి... వాడికి ప్రస్తుతంలో వున్న ఆనందాన్ని వాడి నుంచి దూరం చేయకమ్మా!... ఇకపై ఇక్కడే వుంటావుగా!... నిలకడ మీద నిజాలు... నీకు తెలుస్తాయి. నా మాటను పాటించు..." అనునయంగా చెప్పాడు హరికృష్ణ.
హరికృష్ణ తత్త్వం... దీప్తికి బాగా తెలుసు. తన చిన్న వయస్సులో సెకండరీ చదువును చదివే రోజుల్లో దీప్తి... కాలేజీ హరికృష్ణ ఇంటి ప్రక్కనే అయినందున ఎక్కువ సమయం వారి ఇంట్లోనే వుండేది. హరికృష్ణకు దీప్తి అంటే ఎంతో ప్రేమ, అభిమానం. దీప్తికి హరికృష్ణ దగ్గర ఎంతో చనువు.
"సరే మామయ్యా!... నేను మీ మాటను పాటిస్తాను" ఆ గతాన్ని తలచుకొని... కొన్ని నిముషాల తర్వాత దీప్తి మెల్లగా చెప్పింది.
లావణ్య హాల్లోకి వచ్చింది. ఆమె చేతిలో మూతతో కూడిన ఓ స్టీల్ డబ్బా వుంది.
దీప్తి లావణ్యను చూచి... "వెళ్ళొస్తానత్తయ్యా!" అంది.
"ఆగు..." దీప్తిని సమీపించింది లావణ్య.
"ఎం తినకుండా, త్రాగకుండా వెళ్ళిపోతానంటున్నావ్!... అలా చేయమని మీ నాన్న చెప్పాడా!..."
"లేదత్తయ్యా!..."
"లావణ్యా!... దీప్తి... చిన్నపిల్ల” ఇక ఆపు అని చేతిని పైకెత్తి సౌంజ్ఞ చేశాడు హరికృష్ణ.
"నాతోరా!..."
"వెళ్ళమ్మా దీప్తీ!....." అనునయంగా చెప్పాడు హరికృష్ణ.
ముందు లావణ్య నడువగా వెనకాలే దీప్తి... శార్వరి నడిచి... డైనింగ్ రూంలో ప్రవేశించారు.
"కుర్చీలో కూర్చో!..." అంది లావణ్య.
దీప్తి డైనింగ్ టేబుల్ ముందున్న కుర్చీలో కూర్చుంది.
శార్వరి తల్లిని సమీపించి... "అమ్మా! అన్నయ్య అన్న మాటలకు దీప్తి భయపడిపోయిందమ్మా!..." ఆందోళనగా మెల్లగా చెప్పింది.
"ఆఁ.... దానికి భయమా!... అది ఎవరి కూతురు.... వీరమనేని ప్రజాపతి కూతురు... నీలాంటి నాలాంటి వాళ్ళకి వందమందికి భయాన్ని కలిగిస్తుంది తన చూపుతోనే... దానికంటే ఐదేళ్ళు చిన్నదానివి. దాని సంగతి నీకేం తెలుసు!... ఆ గారెల ప్లేట్లు చేతికి తీసుకో... ఒకటి దానికి... ఒకటి నీకు... తినండి."
కుకింక్ ప్లాట్ఫామ్ మీద వున్న ప్లేట్లు చేతికి తీసుకొని శార్వరి డైనింగ్ టేబుల్ను సమీపించి.... ఒకదాన్ని దీప్తి ముందు వుంచి ఆమె ప్రక్కనే కూర్చొంది శార్వరి. దీప్తి ముఖంలోకి చూచి... "తిను" అంది.
దీప్తి వడను తుంచి నోట్లో పెట్టుకొంది.
పాలు కాస్తూ... లావణ్య...
"దీప్తి!... నీకు మినప వడలంటే ఎంతో ఇష్టం కదా!... పెట్టిన నాలుగింటినీ తినాలి!..." అంది.
"అలాగే అత్తయ్యా!..." అంది దీప్తి.
"గారె బాగుందా!..." అడిగింది శార్వరి.
"చాలా బాగున్నాయి..."
====================================================================
ఇంకా వుంది..

ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ