Thread Rating:
  • 2 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేటి బాంధవ్యాలు - 6
#6
ఆమె వేషాన్ని చూచి... షాక్ తిన్న లావణ్య... ఆమె మాటలు వినగానే... వాస్తవానికి వచ్చి మరోసారి దీప్తిని క్రింది నుంచి పైదాకా పరీక్షగా చూచింది.



డ్రైవర్ కాశీ... బత్తాయిల బుట్టను తెచ్చి అరుగుమీద వుంచి.. వినయంగా లావణ్యకు నమస్కరించాడు.



"అత్తయ్యా!.... నన్ను గుర్తుపట్టలేదా! నేను మీ అన్నయ్య ప్రజాపతిగారి కుమార్తెను. దీప్తిని... ఐదేళ్ళ తర్వాత అమెరికా నుండి తిరిగి వచ్చాను. ఇప్పుడు దీప్తి... డాక్టర్ దీప్తి!" కనుబొమ్మలు ఎగరేస్తూ చెప్పింది చిరునవ్వుతో.



దీప్తి మాటలను విన్న శార్వరి తల్లిని సమీపించింది.



"నాన్నా!.... విన్నావా దీప్తి మాటలు!..." ఆమె మాటలు నచ్చని ఈశ్వర్ కూర్చునే తండ్రి వంక చూచి చెప్పాడు.



హరికృష్ణ చిరునవ్వు నవ్వాడు "అంతా తండ్రి పోలిక!..." అన్నాడు.



"హాయ్!... శారు!... ఎంతగా ఎదిగిపోయావే!" ఆశ్చర్యంతో నవ్వింది దీప్తి శార్వరిని చూస్తూ.
"లోపలికి రా దీప్తి!..." సాదరంగా ఆహ్వానించింది శార్వరి.



"అత్తయ్యా!.... నన్ను చూచి షాక్ తిన్నట్లున్నావు!..." నవ్వింది దీప్తి.



"షాక్ తిన్నట్లు కాదే!... షాక్ తగిలినట్లు!...." వ్యంగ్యంగా అంది లావణ్య.



క్షణం తర్వాత "రా!..." అని చెప్పి భర్త కూర్చుని వున్న సోఫాను సమీపించి... ఎదుటి సోఫాలో కుర్చుంది. శార్వరి... దీప్తిలు హరికృష్ణ సోఫాను... లావణ్య... ఈశ్వర్ కూర్చొని వున్న సోఫాను సమీపించారు.



హరికృష్ణకు ఇరువైపులా శార్వరి... దీప్తి కూర్చున్నారు.
"ఏమ్మా దీప్తి!... ఎప్పుడొచ్చావు!" ప్రీతిగా అడిగాడు హరికృష్ణ.



హరికృష్ణ నిండుకుండ... అతను ఎప్పుడూ త్వరపడడు... ఎంతో జీవితాన్ని చూచి... కష్ణసుఖాలను అనుభవించి, సహనం, శాంతిని ప్రసాదిస్తుందనే నమ్మకాన్ని జీర్ణించుకొన్న గొప్ప వ్యక్తి.



"హాయ్!.... అంకుల్... బాగున్నారా!.... నేను నిన్ననే వచ్చాను. హాయ్! ఈశ్వర్!... హవ్ ఆర్ యు!...." నవ్వుతూ పలకరించింది ఈశ్వర్ను తదేకంగా చూస్తూ దీప్తి.



"మిమ్ముల్నందర్నీ చూడాలనిపించింది వచ్చాను.... ... మామయ్యా! మీకు ఆరెంజ్ అంటే ఇష్టం అని నాన్న పండ్లను పంపారు" పరుగున వెళ్ళి వరండాలో వున్న పండ్ల బుట్టను తెచ్చి హరికృష్ణ ముందు ఉంచింది.



"చాలా ఫ్రెష్గా ఉన్నాయి తినండి" ప్రీతిగా చెప్పింది దీప్తి.



"ఐదేళ్ళు అమెరికాలో వున్నా, నీ మాటల ధోరణిలో మార్పు లేదు దీప్తి!...." అంది శార్వరి.
"అక్కడికి మన అవసరం కోసం వెళ్ళాం. అంత మాత్రాన మనం అమెరికన్స్ గా మారిపోతామా!.... నా దేశం ఎంతో పవిత్ర భారతదేశం... నేను ఆంధ్రుల ఆడపడుచును. మాట తీరు మారవచ్చు... కానీ మనం ఎవరమన్నది ఎన్నటికీ మరువరాదు... కదా మామయ్యా!..." అంది దీప్తి.



"అవునమ్మా!.... నీవు చెప్పింది నిజం..."



"అత్తయ్యా!.... ఈశ్వర్!... ఎం అలా మూగవాళ్ళలా కూర్చొని వున్నారు... నాతో సరదాగా మాట్లాడండి!..." ఇరువురినీ చూస్తూ చెప్పింది దీప్తి.



"మా ఇంట్లోనూ మూడు ఆరెంజ్ చెట్లు వున్నాయి. చెట్లకు ప్రస్తుతంలో కాయలు ఉన్నాయి. త్వరలో అవి పండ్లుగా మారుతాయి. పాపం... మీ నాన్న విషయాన్ని మరిచినట్లున్నాడు!...." వ్యంగ్యంగా నవ్వింది లావణ్య.



"లావణ్యా!" తప్పు అన్నట్లు భార్య ముఖంలోకి చూచి తలాడించాడు హరికృష్ణ.



"ప్రస్తుతం అవి కాయలేగా!.... ఇవి పండ్లు తినేదానికి బాగుంటాయి కదా మామయ్యా!..." లావణ్యను ఓరకంట చూస్తూ చెప్పింది దీప్తి.



"అవునమ్మా!..."



"ఈశ్వర్!.... ఏదైనా మాట్లాడు!..." అంది దీప్తి, ఈశ్వర్ను చూస్తూ...



"ఏం విషయాన్ని గురించి మాట్లాడమంటావ్?..."



"నీ విషయాన్ని గురించి... నా విషయాన్ని గురించి... మన అందరి విషయాలను గురించి!..." ప్రీతిగా అతని కళ్ళల్లో చూస్తూ చెప్పింది దీప్తి.



"నా విషయం... నేను ఎం.బి.బి.యల్ ముగించి ప్రస్తుతంలో హైదరాబాద్లో... హైకోర్టు సీనియర్ లాయర్ బలరామరావు గారి వద్ద పని చేస్తున్నాను. నీ విషయం... అమెరికాలో ఎం.బి.బియస్ పూర్తి చేశావు. స్వదేశానికి తిరిగి వచ్చావు.... ఇక... మనందరికీ సంబంధించిన విషయం... ప్రస్తుతంలో... మీ యింటివారు మా ఇంటికి రావడం కాని... ఇంటివారు మీ ఇంటికి పోవడం కాని లేదు... దానికి కారణం మీ నాన్న!... వివరాలు కావాలంటే... వెళ్ళి మీ నాన్ననే అడుగు...." లేచి వ్యంగ్యపు చిరునవ్వు నవ్వి... వేగంగా ఈశ్వర్ తన గదికి వెళ్ళిపోయాడు.



అతని మాటలకు దీప్తి ఆశ్చర్యపోయింది. అంతవరకూ ఆమె ముఖంలో వున్న ఆనందం స్థానంలో విచారం చోటు చేసుకొంది. తలదించుకొంది. కొన్ని క్షణాలు మౌనంగా వుండిపోయింది. లావణ్య లేచి వంటింటి వైపుకు నడిచింది.
నిట్టూర్చి దీప్తి లేచి నిలబడింది.
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: నేటి బాంధవ్యాలు - by k3vv3 - 04-10-2024, 09:54 AM



Users browsing this thread: 1 Guest(s)