Thread Rating:
  • 2 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేటి బాంధవ్యాలు - 6
#5
లావణ్య.... ప్రజాపతి చెల్లెలు... ఆమె ఇంటి కోడలై ఇరవై ఎనిమిది సంవత్సరాలు. గడిచిన పదేళ్ళ క్రిందట మొదట మామగారు నరసింహం... సంవత్సరం లోపలే అత్తగారు మహాలక్ష్మి గతించారు. ఎంతో అన్యోన్యంగా వుండే దంపతులు... వారిలో ఒక్కరు గతించినా... మరొకరు ఎక్కువ కాలం జీవించలేరు. ఆస్తి వుండవచ్చు. మంచి సంతతి వుండవచ్చు... నా అని చెప్పుకొనే అధికారం స్త్రీకి (భార్యకు) తన పురుషుడి పైన... పురుషుడికి తన ఇల్లాలిపైన వారి జీవితాంతం వుంటుంది. ఒక వ్యక్తి నేలరాలితే.... ఎవరికీ చెప్పుకోలేని వేదనతో... మరోవ్యక్తి కూడా త్వరలో నేలరాలడం తథ్యం. అదే జరిగింది... లావణ్య అత్తమామల విషయంలో.....



* * * *
రోజు ఆదివారం.... గతరాత్రి పదకొండు గంటలకు హరికృష్ణ చిన్నకొడుకు ఈశ్వర్... లాయర్గా పనిచేస్తున్నాడు. చివరి సంతతి శార్వరి. బి.ఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతుంది. ఆమెకు సెలవలైనందున వారిరువురూ సొంత వూరికి హైదరాబాద్ నుంచి వచ్చారు.



కాలకృత్యాలు ముగించుకొని అన్నాచెల్లెళ్ళు హాల్లో కూర్చొని కాఫీ తాగుతున్న తల్లిదండ్రులను సమీపించారు.



"అమ్మా శార్వరీ... ఈశ్వర్ కూర్చోండి!..." అన్నాడు హరికృష్ణ.



"అమ్మా కాఫీ!..." అడిగింది శార్వరి.



లావణ్య క్షణంసేపు భర్త ముఖంలోకి చూచింది. చూపును గమనించిన ఈశ్వర్....



"అమ్మా!... నీవు కూర్చో... నేను వెళ్ళి నాకు, శకటానికి కాఫీ తెస్తాను..."



"నాన్నా చూడు... వీడు నన్ను శకటం... శకటం... అని వెటకారంగా పిలుస్తాడు."



"నాన్నా మీరే చెప్పండి!.... శార్వరీ!.... అని పిలిచే దానికంటే శకటం... అని పిలవడం తేలిక కదూ!..." నవ్వుతూ అడిగాడు ఈశ్వర్.



"నాన్నా!... ఈశ్వర్... పేరు మా నానమ్మ పేరు... నాకు ఎంతో ఇష్టమైన పేరు... అలా హేళనగా పిలవకురా!..."



"సరే నాన్నా!. మీ ముందు పిలవను!..." నవ్వుకుంటూ వంటింటి వైపుకు నడిచాడు ఈశ్వర్.



"అంటే!...." గద్దించినట్లు అడిగింది లావణ్య చిరుకోపంతో కూతురివైపు తిరిగి....



"ఆడపిల్లవు నీవు... కాఫీ తెచ్చి వాడికి యివ్వవలసిన దానవు. మహారాణిలా తండ్రిప్రక్కన కూర్చున్నావు. వాడేమో నీకు కాఫీ తెచ్చేదానికి వెళ్ళాడు... వాడు ఎంత మంచివాడో నీకు అర్థం కాలా!..." కొడుకు పక్షాన తల్లి లావణ్య వాదన.



"నాన్నా!.... నేను చాలాకాలంగా గమనిస్తూనే వున్నాను..."



"ఏమిటమ్మాఅది!..."



" అమ్మ!.... నా అమ్మకు.... నీమీద కంటే... వాడిమీదనే ప్రేమ... అభిమానం జాస్తి!... అవును కదా జననీ!..." వ్యంగ్యంగా అడిగింది శార్వరి.



"అలాంటిదేమీ లేదులే అమ్మా!...." అనునయంగా చెప్పాడు హరికృష్ణ.



"అవునే!... వాడంటే నాకు ఇష్టమేనే!... వాడు నీలా పెంకిఘటం కాదు. సౌమ్యుడు..."



"నాన్నా!. విన్నావా!... నా మాతృమూర్తి మనస్సులోని మాట!...." తల ఆడిస్తూ తల్లి ముఖంలోకి చురచుర చూస్తూ చెప్పింది శార్వరి.



" పోలిక ఎవరిదంటావ్!..." చిరునవ్వుతో భార్య ముఖంలోకి చూస్తూ అడిగాడు హరికృష్ణ.



"నాదే!..." ధీమాగా చెప్పింది లావణ్య.



"చిన్న మహారాణిగారూ!... ఇదిగో కాఫీ!... సేవించండి..." నవ్వుతూ కాఫీ కప్పును ఈశ్వర్ శార్వరికి అందించాడు.



"థ్యాంక్యూ రా!... సోదరా!..." నవ్వుతూ చెప్పింది శార్వరి.



"అమ్మా!... విన్నావా సోదరి మాట... నామీద ఎంత అభిమానమో!..." ఓరకంట చెల్లెలి ముఖంలోకి చూస్తూ చిరునవ్వుతో చెప్పాడు ఈశ్వర్.



"కాఫీ తెచ్చి ఇచ్చావుగా!..." నవ్వింది లావణ్య.



హరికృష్ణ... లావణ్య కూతురు కొడుకును చూచి ఆనందంగా నవ్వుకొన్నారు.



కాఫీ త్రాగుతూ ఈశ్వర్ వీధి వాకిటివైపు చూచాడు. వాకిట ఆగిన కారు నుండి ప్రజాపతి కూతురు దీప్తి గేటు తెరుచుకొని గృహ ప్రాంగణంలోకి ప్రవేశించింది.



దీప్తిని చూచిన ఈశ్వర్...
"అమ్మా!... నీ మేనకోడలు దీప్తి వస్తుంది!..."



"ఏమిటీ!..." లేచి అడిగి ఆశ్చర్యంతో సింహద్వారం వైపు చూచింది.



జీన్స్ ప్యాంట్.... టీషర్టు.... విరబోసుకొన్న పొడుగాటి శిరోజాలు... హైహీల్స్... పెదవులకు దొండపండు రంగు లిప్స్ టిక్.... మోడ్రన్ లక్షణాలు... నూటికి నూరుపాళ్ళతో దీప్తి వరండాలోకి ప్రవేశించింది.



ఈశ్వర్ తల్లి ఖాళీ చేసిన కుర్చీలో కుర్చున్నాడు. లావణ్య సింహద్వారాన్ని సమీపించింది. ఆమెను చూచిన దీప్తి "హాయ్!... అత్తయ్యా!... ఎలా వున్నావ్?..." చిరునవ్వుతో అడిగింది.
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: నేటి బాంధవ్యాలు - by k3vv3 - 04-10-2024, 09:53 AM



Users browsing this thread: 3 Guest(s)