04-10-2024, 09:49 AM
(This post was last modified: 04-10-2024, 09:51 AM by k3vv3. Edited 2 times in total. Edited 2 times in total.)
నేటి బాంధవ్యాలు
[font=var(--ricos-font-family,unset)]
[/font]
రచన: సిహెచ్. సీఎస్. రావు
మిత్రుడు, బంధువు... శివరామకృష్ణ వ్రాసిన వుత్తరాన్ని చదువుతున్నాడు హరికృష్ణ.
"2016 ఆగష్టు పదిహేను నాటికి మనకు స్వాతంత్య్రం సిద్ధించి సంవత్సరాలు..... ఏడు పదులైనాయి. పాత తరానికి ప్రొద్దు తిరిగింది. క్రొత్త తరం మూడు పువ్వులు.... ఆరు కాయలుగా నవనాగరీకతతో నడిపొద్దు సూర్యునిలా భాసిల్లుతూ వుంది. జగమంతా కంప్యూటర్ యుగం అయిపోయింది.
పోస్టుకార్డ్సు.... ఇన్లాండ్ లెటర్స్... తంతి సమాచారాలు మరుగున పడ్డాయి. అందరి చేతిలో సెల్..... ఐ ఫోన్... విద్యావంతుల టేబుల్స్ పై ల్యాప్టాప్స్..... పెన్తో కాగితంపై వ్రాసే విధానం తరిగిపోయింది. మనుషుల మనస్సులో ’ఎలాగైనా’ డబ్బు సంపాదించి దర్జాగా కారు, బంగళాతో.... హాయిగా బ్రతకాలనే తీవ్ర ఆకాంక్ష. ఆ ఆకాంక్షకు మూలం, స్వార్థం.... ఆ స్వార్థం పెరిగేదానికి కారణం.... మనిషిలో మనుగడకున్న ప్రాధాన్యత.... విచక్షణ... విజ్ఞత.... యుక్తాయుక్త విమర్శనారహిత లక్ష్యసాధనాసంకల్పం. తాను పైకెదిగేదానికి ఎదుటివారి భుజాలను నిచ్చెనలా వాడుకోవడం.... పై అంతస్థుకు చేరగానే నిచ్చెనను కాలితో తన్నడం.... కొందరు వారి అభివృద్ధికి పాటించే సూత్రం.
తాత తండ్రుల చరిత్ర.... సంస్కృతి.... సాంప్రదాయం... హైందవతకు సంబంధించిన నీతి... నిజాయితీ... ప్రేమ... సౌభాంత్రం... సహనం.... ఈ కొత్త పధానికి క్రమంగా దూరం అయిపోతున్నాయి. యీ విధానంలో విచారకరమైన మరో విషయం.... కొందరు తల్లితండ్రులు.... తమ సంతతి ఎన్నుకొన్న ఆ జీవిత విధానాన్ని సమర్థించడం. అది తప్పు అని పిన్నలకు చెప్పి.... వారి లక్ష్యాన్ని... మనస్తత్వాన్ని మార్చలేకపోవడం.... పిన్నలు అహంకారంతో చేసే నేరాలను తమ పలుకుబడి.... చేతిలో వున్న ధనంతో... వారు చేసిన నేరానికి శిక్ష అనుభవించి పరివర్తన పొందేదానికి ఆస్కారం లేకుండా చేయడం, బిడ్డలను సక్రమమైన మార్గంలో నడిపించి వారి భవిష్యత్తును సాటివారికి ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దలేకపోవడం.
ధన, పదవీ బలాలతో... అన్నింటినీ సాధించగలం అనే పెద్దల మనస్తత్వం.... పిన్నలకు తల్లిదండ్రుల నుంచి సంప్రాప్తించిన కారణంగా... సాటి మనుషుల మీద పెద్దల మీద.... యువతకు గౌరవం.... అభిమానం.... ఆదరణ అనే మంచి భావాలు సమసిపోతూ వున్నాయి.
వారికి భిన్నంగా వర్తించేవారు.... వారి దృష్టిలో ఎలా బ్రతకాలో... అనే విషయం తెలియని అప్రయోజకులు. ఏ కొందరో తప్ప.... చాలామంది పై విధానంతోనే మనుగడ సాగిస్తున్నారు. యువత హృదయాల్లో వున్న వారి స్వార్థం కారణంగా.... తమ తల్లిదండ్రులు కూడా వారికి కానివారి జాబితాలో చేర్చబడుతున్నారు. పెద్దల ఆ స్థితికి కారణం.... కొడుకులు ఏరికోరి అర్థాంగిగా స్వీకరించిన నవనాగరీకతా సౌందర్యరాశులు... చదువరులు. ఓ నా నేస్తమా!.... ప్రియ బంధువా!.... హరీ!... నీ వుత్తరాన్ని చదివాను. మనస్సుకు ఎంతో బాధ కలిగింది. నీవు అనుకొన్నట్లున్నావు నేను పొద్దు తిరిగిన జీవితాన్ని పరమానందంగా యీ విశాఖ మహానగరంలో అనుభవిస్తున్నానని... మన ఇరువురి శేషజీవిత పయనం ఒకే రీతిగా సాగుతూ వుంది. నిన్ను చూడాలని... నా ప్రస్తుత సమస్యలను... మన చిన్ననాటి జ్ఞాపకాలను నీతో ముచ్చటించాలనేది నా ఎదలోని కోరిక.... వస్తున్నా నీ వద్దకు... త్వరలో....’
ఇట్లు
నీ.... శివ
వుత్తరాన్ని చదివిన హరికృష్ణ నిట్టుర్చాడు.
భార్య లావణ్య వరండాలోకి వచ్చింది. హరికృష్ణ చేతిలో వున్న వుత్తరాన్ని చూచింది. ఆమె చూపులోని భావాన్ని గ్రహించిన హరికృష్ణ... "మీ అన్నయ్య శివరామకృష్ణ వ్రాశాడు లావణ్య!..." అన్నాడు.
"అలాగా!.... అంతా క్షేమమే కదా!...."
"వుత్తరాన్ని చదువు.... నీకే తెలుస్తుంది... వాడు ఊర్మిళ అక్కడ ఆనందంగా లేనట్లు వున్నారు... మనలాగే!...." మెల్లగా చెప్పి వుత్తరాన్ని లావణ్యకు చూపించాడు.
లావణ్య వుత్తరాన్ని అందుకొంది. రెండు నిమిషాల్లో చదివింది... భర్త ముఖంలోకి చూచింది.
"విషయం అర్థం అయిందిగా!..." విరక్తితో కూడిన చిరునవ్వుతో అడిగాడు హరికృష్ణ.
"అయింది!..." శూన్యంలోకి చూస్తూ చెప్పింది...
కొన్ని క్షణాల తర్వాత....
"అన్నయ్యకు అక్కడ ప్రశాంతంగా లేకుండా వున్నట్లు వుంది!..." అంది మెల్లగా లావణ్య.
"ఎలా వుండగలడు?.... కొడుకులు ఒకరికి ఇద్దరుండీ కూడా... చంద్ర అమెరికాలో... రాఘవ ఆస్ట్రేలియాలో వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతుకుతున్నారే కాని... వాణ్ణి నా చెల్లెలు ఊర్మిళను పట్టించుకోరాయె!.... ఇక ఆడపిల్లలు వైశాలి... శారద. పెద్దామె ముంబాయిలో.... చిన్నామె చెన్నైలో. వాళ్ళ సంసారాలు వారివి... వారూ వీరిని పట్టించుకోలేరు!.... చిన్నవాడు విష్టు జన్మతః అంధుడు... పేరుకు ఐదుగురు బిడ్డలు వున్నారని పేరేగాని... యీ వయస్సులో వారి స్థితిగతులు పట్టించుకునేవారు... లేరే అని వాడి బాధ" వివరంగా చెప్పాడు హరికృష్ణ.
"మనదీ అలాంటి బ్రతుకేగా!... పెద్దవాడు దివాకర్ అమెరికాలో... మధ్యలోని వాణి తన ఇష్టానుసారంగా ఢిల్లీలో... ఇకపోతే చిన్నవాడు ఈశ్వర్... శార్వరి... ఉద్యోగం... చదువురీత్యా హైదరాబాద్లో.... మన బ్రతుకులూ అన్నవాళ్ళలాగా ఒంటరి బ్రతుకులేగా!.... ఒక్కోసారి నాకు చాలా బాధగా అనిపిస్తుందండీ... వాళ్ళను కనిపెంచి పెద్దచేసి... మనకున్నదంతా వూడ్చి వారికి పెట్టి చదివించింది ఇందుకేనా!.... ఈశ్వర్కు తప్ప... శార్వరికి కూడా... మనలను వదలి పై చదువులకు అమెరికాకు వెళ్ళాలనే ఆశ... ఏం కాలమో!.... ఏం పిల్లలో.... తన మన అనే భావన... ప్రేమాభిమానాలు యీ కాలం పిల్లల్లో క్రమంగా... నశించాయనే చెప్పాలి..." అంటూ వీధి వాకిటి వైపు చూచిన లావణ్య....
"అదిగో మీ బావగారు!.... మంతనాల మాధవయ్యగారు వేంచేస్తున్నారు. ఊరకరారు మహానుభావులు. తస్మాత్ జాగ్రత్త...:" లోనికి వెళ్ళిపోయింది లావణ్య.
మాధవయ్యగారు హరికృష్ణగారి మేనత్త కుమారుడు. వారు... మ్యారేజ్ బ్రోకర్... పురోహితుడు... మంచి మాటకారి.... ఏ వాలున తిరగలిని త్రిప్పినా పిండి తనవైపే పడాలనే లక్ష్యవాది. అవసరానికి అబద్ధాలు చెప్పడం అంటే వారికి మంచినీళ్ళను త్రాగడంతో సమానం....
"ఏరా!... హరీ.... బాగున్నారా అంతా!..."
"ఆఁ.....ఆఁ.... రా బావా.... రా... కూర్చో!..."

ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ