Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
కల్పతరువు Part - 15
#31
కల్పతరువు - పార్ట్ 15



 “మన సూపర్ మార్కెట్ లాభాల వలన ముందుకు సాగుతున్నాము కానీ రెడీమేడ్ బట్టల వ్యాపారములో అంతగా అభివృద్ది లేదు. అన్ని రంగాల్లోనూ పోటీ పెరిగి పోయింది. ఏమైనా చేయాలి.” ఆనంద్ ఖాతా పుస్తకాల తనిఖీ పిమ్మట ఆలోచించ సాగాడు. 



“ఫ్యాషన్ డిజైనింగ్ ట్రైనింగ్ వున్న స్టాఫ్ కావాలి” ప్రజ్ఞ సలహా ఇచ్చింది. 



“అదొక్కటే కాదు, కొంత పబ్లిసిటీ కూడా పెంచాలి. బ్యాంక్ లోన్ తీసుకుని, ధైర్యం చేద్దామా?” బిజినెస్ పెంపుదలకు ప్లాన్ వేశాడు. 



“న్యూస్ పేపర్ ప్రకటన యిద్దాము. కుదర లేదంటే, బ్యాంక్ లోన్ గురించి ఆలోచిద్దాం.” 



భార్య అంచనా మేరకు రెడీమేడ్ బట్టల వ్యాపారం ముందడుగు కోసం పలుకుబడి వున్న దిన పత్రికల్లో బుటిక్ అభివృద్ది కొరకు ప్రకటించారు. 



***



భోజనాలానంతరము "పెదనాన్న, బట్టల వ్యాపారం కొంత మార్పులతో కొత్తగా మార్చాలను కున్నాం, ఏదైనా మంచి పేరు చెప్పండి…." అందిప్రజ్ఞ.



కేశవ రెడ్డి కొద్ది సేపు ఆలోచించి 'కల్పతరువు' అన్నాడు.



నిర్దారణ జరిగింది



>>>>>>>>>> 



ఇంటికి దగ్గర్లోని కాలేజ్లో జ్వాలను జాయిన్ చేసింది సత్యలీల.



“మన ఇంటికి దగ్గరగా వుండాలి అని బిజినెస్ పెట్టుకోవద్దు. మనం వుండేది బర్కత్పురా, నీ స్థలంలో బుటిక్ పెట్టాలనుకున్నది బంజారాహిల్స్. 



కొత్తగా బిల్డింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మార్కెటింగ్ అంటే చాలా యిబ్బందులు ఎదుర్కోవాలి. 



నా సలహా ఏమిటంటే, ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన బుటిక్ ఎన్నుకొని కొంత మన వంతు డబ్బు, శ్రమ పెట్టి బిజినెస్ మొదలు పెడితే సబబు.” వదిన జగదాంబ తన మనసులోని మాట చెప్పింది. 



సత్యప్రకాష్ చలోక్తి "అంబ పలుకు జగదాంబ పలుకు…" 






దిన పత్రికలో వెలువడ్డ కుట్లు అల్లికలకు సంబంధించిన ప్రకటనలన్నిటికీ సత్యలీల జవాబు యిస్తున్నా, తృప్తికరమైన నిర్ధారణ చేసుకోలేక పోతున్నది. 



అన్వేషణ ఆగక మానదు. జాతీయ దినపత్రికల కంటే ప్రాంతీయ దినపత్రికల ద్వారా వెలువడ్డ బడీచౌడి 'కల్పతరువు' ప్రకటనకు అచల, సత్యలీల హాజరు అయ్యారు. 



వచ్చిన అప్లికేషన్స్ అన్నిటిలోకి సత్యలీలకు అవకాశం లభించింది. 



………



కొత్త బిజినెస్కు సంబంధించిన నోట్ తయారు అయింది. అందులోని కొన్ని ముఖ్యాంశాలు : 



“వ్యాపార పెట్టుబడి ప్రజ్ఞా, సత్యలీల వంతు. 



మౌలిక సదుపాయాలు, స్తలమూ ఆనంద్ సమకూర్చాలి. 



ముడి సరుకు కొనుగోలు, అమ్మకపు పర్యవేక్షణ అచల, సత్యలీల జాబితాలోకి వచ్చాయి. 



ప్రస్తుత ఫాషన్ డిజైన్స్, కస్టమర్స్ అవసరాలను సమన్వయంతో శిక్షణ పొందిన ప్రజ్ఞ; శిక్షణ లేకున్నా ప్రతిభ గల అచల బాధ్యత వహించాలి.”



వీరందరికి సాయంగా శిక్షణ గల టైలరింగ్ నిపుణులు కొందరు ప్రోరేటా బేసిస్ ఉద్యోగ భృతి పొందారు.



అందంగా నిర్మించిన గాజు తలుపుల షోరూమ్ను చాణక్య, చాతుర్య తాత కేశవరెడ్డిగారిని చెరొక ప్రక్క పట్టుకొని దీపారాధన చేయించి, ప్రారంభోత్సవము జరిపించారు.



ఎల్లప్పుడూ జనసందోహం కల్గిన చోట అనతి కాలంలోనే ప్రచార వ్యవస్త ప్రజల్లో ప్రకాశించింది కల్పతరువు.



====================================================================
సమాప్తం
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply


Messages In This Thread
కల్పతరువు Part - 15 - by k3vv3 - 04-05-2024, 02:15 PM
RE: కల్పతరువు - by sri7869 - 04-05-2024, 10:20 PM
RE: కల్పతరువు - by k3vv3 - 10-05-2024, 02:25 PM
RE: కల్పతరువు Part-2 - by k3vv3 - 25-05-2024, 04:51 PM
RE: కల్పతరువు Part-2 - by k3vv3 - 25-05-2024, 05:29 PM
RE: కల్పతరువు Part - 14 - by k3vv3 - 20-09-2024, 10:47 PM



Users browsing this thread: 2 Guest(s)