Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
కల్పతరువు Part - 15
#29
కల్పతరువు - పార్ట్ 14



మనిషిలో వికృత బుద్దులు దూసుకుంటున్నాయి. ప్రజ్ఞా, నువ్వు నా దానివి. నా జీవితానికి ఏదో గ్రహణం పట్టి వదిలింది, ఇప్పుడు నేను మనస్ఫూర్తిగా నిన్ను కోరి వచ్చాను. పృథ్వి అంతరాత్మ ఘోషిస్తుంది. 



ప్రజ్ఞ "మా పిల్లల చదువులు మొదలైన రోజు నుండి మావారే ప్రతీ విషయంలోనూ శ్రద్ధ, క్రమశిక్షణ నేర్పించారు. ” 



ఎటో దిక్కులు చూస్తున్నాడు అతిధి. 



పృథ్వీధర్ మనసు విప్పి మాట్లాడ లేక పోతున్నాడని, ప్రజ్ఞ ఆనంద్ని బయటకు వెళ్ళమని సైగ చేసింది. ఆనంద్ బాడ్మింటన్ ఆడుకుంటున్న పిల్లల్ని పిల్చుకొని మేడ పైన స్టడీ రూమ్ వైపు వెళ్లారు. 



స్త్రీ తలచుకుంటే ఇంటా, బయటా ఎలాటి వాతావర్ణణాన్ని ఐనా సృష్టించ గలదు. కావాలను కుంటే యుద్దం, లేదంటే శాంతి ప్రకటించే చాకచక్యం గల నేర్పరి మహిళ!
 
ప్రజ్ఞా, పృథ్వీధర్ హాల్లోనే కూర్చున్నారు. 
 
మళ్ళీ మళ్ళీ రావటం కుదరదు. ఇప్పుడే తను వచ్చిన పని చెప్పాలి.. ఒక ఇల్లాలిగా ఇల్లు చక్కపెట్టుకునే ప్రజ్ఞ, నా ప్రేయసిలా నాతో శాశ్వతంగా నాకోసం ఒక కొత్త జీవితాన్ని ఒప్పుకుంటుందా? 



పొలం గట్టు కలలు కదిపితే సరి, ప్రజ్ఞ హృదయం కనబడుతుంది. ఏమాట కామాట ఆనంద్ ముందు నేనెంత హాండ్సమ్ గా వుంటాను. 



పృథ్వి ఆలోచనలకు కళ్ళెం పడ్డది. “అత్తా మామలను ఈ సారి వచ్చేప్పుడు తీసుకునిరా, మా ఆడపడుచులకు పెళ్లి సంబంధాలు గురించి బాగా తెలుసు. వాళ్ళు ఏదైనా మంచి సంబంధం చూసి నీ కాపురం నిలబడేలా చూద్దాం. ”



“ప్రజ్ఞా, ఆనంద్ ముందు చెప్పలేనిది, నీతో మాత్రమే చెప్పే ముఖ్య విషయం ఒకటుంది. ” 



ఏమిటన్నట్టు చూసింది. 



“కోపం తెచ్చుకోవద్దు మరి. ”



“లేదు బావా, నాకు కోపం, పగ, ఈర్ష్య యిలాటివి ఎవరి మీద లేవు, రావు కూడా, ఎలాంటి సందేహం పెట్టుకోక చెప్పు. ”



“ఆనంద్ వస్తే టాపిక్ మార్చాలి. ” పృథ్వీధర్ ఆర్తన. 



“ముందు మొదలు పెట్టు. ”



“ప్రజ్ఞా, నేను ఓడిపోయను. దెబ్బ తిన్నాను, నా మనసు పూర్తిగా చితికి పోయినది, మిగిలన జీవితమయినా తృప్తిగా బతకాలంటే.. అంటే.. నువ్వు నాకు తోడుగా వుండాలి. 



నా విషయం సరే, ఈ రోజు కూడా అమ్మానాన్నలు నిన్ను కోడలిగా చేసుకోనందుకు నిధి కోల్పోయినట్టు బాధ పడుతున్నారు. ఆనంద్ ను వదిలేసి నాతో వచ్చేయ్. 



నిన్ను అణువంత కూడా కష్ట పెట్టాను. మహారాణివై రాజ్యం చేద్దువు, ప్లీజ్.. 



నీ సహచర్యంలో నా ఈ దౌర్భాగ్యపు బావను చక్క దిద్దవా..” చిన్న స్వరంతో కేవలం ప్రజ్ఞకు మాత్రమే వినిపించేలా హృదయ వేదన వ్యక్త పరిచాడు. 



ప్రజ్ఞ మహా మేధావిలా వింటూ వున్నది. తిట్టి, అరిచి బయటికి గెంటలేదు. 



మళ్ళీ అన్నాడు “నువ్వు గానీ నాతో రాక పోతే; ఒకే. కానీ నాకోసం వేరే సంబంధాలు చూసే పెత్తనం తీసుకోవద్దు. ఇలాగే నీ జ్ఞాపకాలతో.. ” 



చెప్పాల్సిన మాట చెప్పాడు. ఇప్పుడు చాలా రిలీఫ్ గా వుంది. కానీ వినాల్సిన జవాబు సస్పెన్స్; ఏదో తమాషా.. కొత్త ఫీలింగ్! 



“బావ, నా సంసారంలో నాకు ఏం తక్కువైందని నేను నీ వెంట రావాలి. నా వైవాహిక జీవతంలో ఏ ఒక్క రోజు కూడా మా వారు నన్ను బాధపెట్టలేదు, హింసించలేదు. 



నీ గురించి కూడా తెల్సు, అయినా ఎన్నడూ అనుమానించలేదు, వేధించలేదు, ఆనంద్ ఫ్యామిలీ వాళ్ళందరూ నన్ను అపురూపంగా చూస్తారు. ”



పృథ్వీధర్ వినాలనుకున్నది వేరు. 



“సూపర్ మార్కెట్ బిసినెస్ చూస్కుంటు, పిల్లల పెంపకం, చదువులు, మావారి సహృదయత, పసిపిల్లల బాల్యంలోని ముద్దు చేష్టల ఆనందంలో నా మనసు నుండి నువ్వు పూర్తిగా సమసిపోయావు. ”



ఎంత చెవులు రిక్కరించి విన్నా, వినసొంపు మాటలు లేవు పృథ్వీధర్కు. 



“భార్యగా, తల్లిగా అన్ని కోణాల్లో మా దాంపత్యం సుఖసంతోషాలతో వుంది. మా భాగ్యానికి పిల్లలు క్రమశిక్షణలో, విద్యలో మంచి దారిలోనే వున్నారు. 



మావారు నాకు కనిపించే దేవుడు. ”



ప్రజ్ఞ యిచ్చే లెక్చర్ బోరు కొడుతున్నది. 



“మనం సుఖపడటం అనేది మన ఆలోచనల మీద ఆధార పడి వుంటుంది. అంతేగానీ సైన్సు ల్యాబ్ లో మాదిరి ఏదో ఘన పదార్థానికి మరేదో ద్రవ పదార్థం కలిపితే ఇంకేదో వాయు పదార్థం ఏర్పడుతుందని జీవితాన్ని అదే పంధాలో నడవాలంటే కుదరదు. 



మనిషిని మనిషిగా దగ్గరకు తీసి ఆప్యాయత పంచుకుంటే బంధం నిలుస్తుంది. 



నేను కాకుంటే వేరే ఎవరినో పునర్వివాహం చేసుకోను అనే మూర్ఖత్వపు మాటలు మానేయి. అయినా, నీ జీవితం నీ ఇష్టం. ”



“ఓకే, నేను వెళ్తాను. ” లేచాడు. 



“నీతో నేను రావాలని, వస్తానేమో అనే ఆశ, కాదు, నీ పిచ్చి వూహ ఇతర ఏ వివాహిత స్త్రీ పట్ల రానీకు, వచ్చాయంటే నీలో అనారోగ్యం చోటు చేసుకున్నట్లే.. ”



ప్రజ్ఞ కూడా లేచి నిలబడింది. 



“రాత్రి భోజనం చేసి వెళ్ళు. ”



“వద్దు, నేను వెళ్ళాలి. ” 



“బావా! మా వారితో చెప్పి వెళ్ళు. ”



“నువ్వు దేవుడనే వ్యక్తి నాకు దయ్యం లాగా కనబడుతుంటే ఎలా చెప్తాను. ”



“ఇదే నీ తప్పు, ప్రతీ వ్యక్తిని నెగిటివ్ గా చూస్తావు, అయినా యిలా కలుస్తున్నట్టూ అత్తకు మామకు తెల్సా?”



“తెల్సు, నేను వాళ్ళ నుండి ఎప్పుడూ ఏదీ దాచలేదు. ”



“ఎవరో ఒక వ్యక్తి వచ్చి సౌభాగ్యత్తను అన్నీ వదిలేసి తనతో వచ్చేయమంటే, ఆ వ్యక్తి సుఖసంతోషాల కోసం వెళుతుందా?” చురక తగిలించింది. 



“ఎక్కువగా మాట్లాడకు, మాటలు మంచిగా రానీయి, మా అమ్మను చీప్ చేస్తావా?” ముక్కు మీది కోపం నోటంట పలికింది. 



“నేనెమన్నాను, ఇక్కడ చీప్ ఏమిటీ? మావారిని నువ్వెలా విలన్ అనుకుంటున్నావో, అలాగే మా పిల్లలు కూడా నిన్ను అలాగే అనుకుంటె.. కానీ అనుకోరు, మేము అందరి గురించి మంచిగానే ఆలోచిస్తాము. ”



బుర్ర వేడెక్కి, తిరస్కారాన్ని ఎదుర్కునే ఓపిక లేక పృథ్వీ లేచి బయటకు నడిచాడు. 



====================================================================
ఇంకా వుంది..
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply


Messages In This Thread
కల్పతరువు Part - 15 - by k3vv3 - 04-05-2024, 02:15 PM
RE: కల్పతరువు - by sri7869 - 04-05-2024, 10:20 PM
RE: కల్పతరువు - by k3vv3 - 10-05-2024, 02:25 PM
RE: కల్పతరువు Part-2 - by k3vv3 - 25-05-2024, 04:51 PM
RE: కల్పతరువు Part-2 - by k3vv3 - 25-05-2024, 05:29 PM
RE: కల్పతరువు Part - 13 - by k3vv3 - 13-09-2024, 01:15 PM



Users browsing this thread: 1 Guest(s)