31-08-2024, 10:02 AM
అప్పుడే సరిగ్గా ఒక విచిత్రం జరిగింది. ఆ స్ట్రేంజర్ బుక్ చేసుకుంది ముంబై ఫ్లైట్. జోసెఫ్ బుక్ చేసుకున్న నెక్స్ట్ ఫ్లైట్ డైరెక్ట్ గా చెన్నై కెళ్తుంది. బెంగళూరు - చెన్నై - దుబాయ్ ఇలా జోసెఫ్ ఫ్లైట్ బుక్ చేసాడు. జోసెఫ్ డైరెక్ట్ గా ముంబై కే ఫ్లైట్ బుక్ చేసుకుని ఉంటాడు అనుకుని ఆ స్ట్రేంజర్ బెంగళూరు - ముంబై ఫ్లైట్ చేసాడు.
జోసెఫ్ చెన్నై చేరుకోగానే అక్కడున్న కొరియర్ సర్వీస్ ద్వారా తాంబరంలోని ప్రియా కృష్ణన్ ఇంటికి కృష్ణ స్వామి లాప్టాప్ ని చేరవేసేలా అరేంజ్ చేసాడు. తను కంగారు పడకుండా ఒక ఉత్తరం కూడా జత చేసాడు. అన్నీ అందులోనే వివరించాడు.
చెన్నై డొమెస్టిక్ వింగ్ లో నుండి తన లగేజ్ కలెక్ట్ చేసుకుని ఇంటర్నేషనల్ సర్వీస్ వింగ్ కెళ్ళి దుబాయ్ కి బుక్ చేసిన నెక్స్ట్ ఫ్లైట్ కోసం చెక్ ఇన్ అయ్యాడు.
దుబాయ్ లోని జీకే కార్పొరేషన్ హెడ్ క్వార్టర్స్ లో డేటా అనలిస్ట్ గా మరుసటి రోజే జాయిన్ అవ్వబోతున్నాడు జోసెఫ్ సెబాస్టియన్. కాదు కాదు. ఇప్పుడు తన పేరు ముత్తుస్వామి అయ్యర్. ఈ డిస్గైజ్ తోనే జీకే కార్పొరేషన్ జాయిన్ అయ్యి, అక్కడే ఉంటూ ఘోర కలిని దగ్గర నుండి చూస్తూ అశుతోష్ ఇప్పుడెలా ఉన్నాడో, ఎక్కడున్నాడో తెలుసుకుంటూ ఘోర కలికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ నీ సిబిఐకి ఎప్పటికప్పుడు అందించేలా పెద్ద ప్లాన్ తోటే బయలుదేరుతున్నాడు.
చెన్నై డొమెస్టిక్ వింగ్ కి సరిగ్గా అదే టైములో ఆ స్ట్రేంజర్ రాగలిగాడు. చాలా హై లెవెల్ ఇన్ఫ్లూయెన్స్ వాడి బెంగళూరు నుండి చెన్నై కి చేరుకోగలిగాడు. కానీ ఇప్పుడు చెన్నై డొమెస్టిక్ వింగ్ లో జోసెఫ్ కనబడటం లేదు. ఆ స్ట్రేంజర్ కి జోసెఫ్ ప్లాన్ అంతుబట్టడం లేదు. అటు ఇటు చూస్తున్నాడు. అంతలో జోసెఫ్ ఒక ఎయిర్పోర్ట్ బస్సు లో కనిపించాడు. డొమెస్టిక్ వింగ్ నుండి బయటికొచ్చిన ఆ స్ట్రేంజర్ అక్కడున్న స్టాఫ్ ని ఆ బస్సు ఎక్కడికెళ్తోందని అడిగాడు. దుబాయ్ కెళ్లే బస్సు అని చెప్పాడు. షాక్ లో ఉండిపోయిన ఆ స్ట్రేంజర్ అలా చూస్తుండగానే తన కళ్ళముందే దుబాయ్ ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయాడు జోసెఫ్.
జోసెఫ్ ప్లాన్ ఏంటో అంతుబట్టక, తన బాస్ కి తన మొహం ఎలా చూపించుకోవాలిరా దేవుడా అని ఆ స్ట్రేంజర్ కి తల దిమ్మెక్కిపోయింది. తన బాస్ కి ఇప్పుడేం చెప్పాలో తెలియక తికమక పడుతున్నాడు.
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ