13-11-2018, 11:54 AM
25.మోసం..
"ఏం మాట్లాడుతున్నావ్....రియా....నువ్వు చెప్పిందంతా అబద్దం అని చెప్పు...నేను కలగంటున్నానని చెప్పు...."అని తన భుజం పట్టుకుని కన్నీళ్ళు దిగమింగుకుంటూ అడిగాడు విజయ్
"ఐ యాం సారీ విజయ్..."అతి కష్టం మీద చెప్పింది రియా
ఆ మాట వినడం తోనే అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు విజయ్.....వెంటనే అతని వద్దకు పరుగుతీసింది రియా...."వద్దు నా దగ్గరికి రావొద్దు......"అని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు.....వెనకనే అతన్ని అనుసరించింది రియా...
ఒక్క వుదుటున వెనక్కి తిరిగి....."డోంట్ ఫాలో మి...."అని అన్న విజయ్...వడి వడి గా ముందుకు అడుగులు వేశాడు....
వెంటనే రియా అభి కి కాల్ చేసింది..."ద నెంబర్ యూ ఆర్ కాలింగ్ ఈస్ కరెంట్లి బిసి..ప్లీస్ ట్రై ఎగైన్ లేటర్..."అని రావడం తో.....వెంటనే ఒక మెసేజ్ పెట్టింది..."కాల్ మీ వెన్ యూ ఆర్ ఫ్రీ..."
షాలిని తో ఫోన్ మాట్లాడుతున్న అభి తన మెసేజ్ చూసినా కూడా పట్టించుకోలేదు...
గంట తర్వాత....ఫోన్ పెట్టెసిన అభి కాల్ చెయ్యాలా వద్దా అని ఆలోచిస్తున్నాడు......ఇంతలో తన ఫోన్ రింగ్ అయ్యింది....
"నీతో మాట్లాడాలి,...మీ ఇంటి బయట వెయిట్ చేస్తున్నా...నువ్వు రా...."అని చెప్పి ఫోన్ కట్ చేసింది రియా
ఒక అరగంట గడిచాక కిందకి వెళ్ళాడు అభి.....చలిలో అక్కడున్న ఫుట్ పాత్ పైన కూర్చుని వుంది రియా....అభి రావడంతోనే...లేచి నిల్చుంది....."
"ఏంటి...?"అడిగాడు అభి....అభి లేట్ గా వచ్చాడన్న కోపమున్నా.....తమాయించుకుని...."నేనొక పని చేశాను...దాని వల్ల ఏం జరుగుతుందో నాకర్థం కావట్లేదు..."అంది రియా ఆందోళనగా
"ఐతే నేనేం చెయ్యాలి..."చిరాకుగా ముఖం పెట్టి అడిగాడు అభి
ఒక్క నిమిషం షాక్ అయ్యి....మరు నిమిషం తేరుకుని..."ఐ హోప్ యూ విల్ స్టాండ్ బై మై సైడ్..."అంది అతని కళ్ళలోకి చూస్తూ...చేతులు కట్టుకుని చూస్తున్నాడు అభి
"నేను విజయ్ కి చెప్పాను.,....తనంటే నాకు లవ్ లేదని...దానికి కారణం...."అని చెప్పబోతుండగా ఇంట్లోంచి గావు కేక వినపడటంతో.....పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళాడు అభి...ఏం చెయ్యాలో అర్థం కాక అక్కడే ఆగిపోయింది రియా.....సరిగ్గా 5 నిమిషాల తర్వాత....కార్ లో బయల్దేరిన అభి ని చూసి రియా కి ఏం అర్థం కాలేదు......."ఏమై వుంటుంది ...?"అని ఆలోచిస్తు వుండిపోయింది....
ఆ మరుసటి వుదయం 4:20 కి అభి నుంచి రియా కి కాల్ రావడం తో....వెంటనే ఫోన్ ఎత్తింది రియా
"హలో...."అంది రియా
"కేర్ వెల్ హాస్పిటల్ కి రా నువ్వు అర్జెంట్ గా"అని చెప్పి ఫోన్ కట్ చేశాడు అభి....హుటాహుటిన హాస్పిటల్ చేరిన రియా అక్కడ కనిపించిన దృస్యానికి నిశేష్టురాలై నిల్చుండిపోయింది.....బెడ్ పై విజయ్ స్పృహ లో లేడు అతని చేతికి కట్టు వుంది.....రియా ని చూసిన అభి.....రియా ని పక్కకి లాకెళ్ళి.,..."అసలు ఏం చేశావ్...వాడ్ని...? ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నాడంటే తప్పకుండా నీ హస్తం వుండే వుంటుంది ఏమయ్యింది చెప్పు...?"నిలదీశాడు అభి
తల వంచుకున్న రియా...మెల్లగా తల ఎత్తి...."తనని నేను లవ్ చెయ్యట్లేదని చెప్పాను...."అంది ఏడుస్తూ
"నువ్వెందుకే ఏడుస్తావ్...నిన్ను ప్రాణంగా ప్రేమించిన నేను-నీ కోసం ప్రాణాన్నే తీసుకోవాలనుకున్న వాడు ఏడ్వాలి...ఏమ్మా నీకు ఇంకా రాక్షసానందం చావలేదా...?ఇంకా ఎంతమంది జీవితాలతో ఆడుకుంటావ్...?ఈ సారి ఎవరు దొరికారు నీకు...?"అడిగాడు అభి
అభి మాటలు గునపాలై గుండెల్లో గుచ్చుకోగా......"అది కాదు అభి...."అని సర్ది చెప్పబోతుండగా.....
"అది కాదు అభి.....నేను ఇదంతా చేసింది నీకోసం నీ ప్రేమ కోసం...."అని జరిగిన విషయమంతా చెప్పింది.....రియా
"నోర్మూయ్...ఇదింకో నాటకమా..."అని తన చెంప చెళ్ళుమనిపించాడు అభి
ఆ దెబ్బ నిజంగా తగిలిందేమో...అన్నట్టు నిద్ర నుంచి మేల్కుంది రియా....టైం చూస్తే 7:30 ఇంకో అరగంట లో విజయ్ ఫ్లైట్ దిగుతాడు......అని అంచనా వేసి...వెనువెంటనే ఎయిర్పోట్ కి బయలుదేరింది రియా