19-08-2024, 06:28 PM
"మొదట్నించీ చూస్తున్నదే గదా నీ వరుస. ఫంక్షన్లకు గూడా పట్టుచీరలెందుకు అనే టైపు నువ్వు. మీరంటే అన్నాదమ్ముళ్ళు. సర్దుకుంటారు. నా పరిస్థితి అట్లా కాదు. మీ చెల్లెలు ముందు, తోడి కోడలి ముందు, వాళ్ల బంధువుల ముందు నా మర్యాద పోతాది. ముందు ఏమి అనకపోయినా వెనక చెవులు కోరుక్కుంటారు. ఆడదానివయిపుడ్తే తప్ప నా బాధ నీకర్ధం కాదు. కనీసం ఒక గొలుసయినా తీసుకుపోదాం."
ఆ మాటలకు కాసేపు మౌనంగా ఉండి అంది "చేతి నుండి ఏమి పడకుండా నేనొకటి చెప్తా విను. పాప గొలుసుంది కదా... దాన్ని కరిగించి వేరే డిజైన్ చేపిచ్చుకురా... ఇచ్చేద్దాం."
"ఆడపిల్ల గొలుసా" నసిగాను.
"ఐతే ఇంకోపని చేద్దాం. చిన్నదానికి బాగాలేదని చెప్పి నేనూ, పిల్లలు ఈన్నే ఉంటాం. నువ్వు ఒక్కనివే పోయిరా..."
ఇక నాకు మాట్లాడే అవకాశం దొరకలేదు.
పాప గొలుసు కరిగి కొత్తరూపం దాల్చుకుంది.
ఆలోచనల్లోనే సెల్ మోగింది. తీయడానికి జేబులో చేయివేశా. రెండు మూడు కళ్ళు ఆశబ్దానికి తిరిగి నన్నే చూస్తున్నాయి. తీయడానికి సిగ్గనిపించి జేబులోనే అరవకుండా దాని పీక పిసికేశా.
లైఫ్ లాంగ్ కార్డేసి, ఆ బ్లాక్ అండ్ వైట్ పీస్ నాకిచ్చేసి, నీవు వేరే మోడల్ కలర్లో కెమెరా, ఎమ్పీత్రీ వున్నది కొనుక్కో" అని నా భార్య చాలా సార్లు చెబుతూనే ఉంటాది. సంగీతం వినడమంటే ఎంత ఇష్టమైనా జీవితంలో ఒకసారి ఒక వస్తువును మాత్రమే కొనగలిగే నాకు, మళ్ళీ అదే వస్తువుపై ఐదారువేలు పోయాలంటే చాతగావడం లేదు.
ధైర్యం చేద్దామని అప్పుడప్పుడు అనిపించినా ఇంటి బడ్జెట్ అంతా కళ్ళముందు మెదులుతాది.
ఇంటి అద్దె, పిల్లలకు ఆటో, కాలేజీ ఫీజు, సరుకులు, కూరగాయలు, ఎల్ఐసీ, పోస్టల్ ఆర్డీ... ఇలా లెక్కలేసుకుంటూ పోతే మిగిలేది ఏ వెయ్యో... ఐదువందలో... అదిగూడా పండగలకు బట్టలు కొనాల్సి వచ్చినప్పుడో,శుభాకార్యాలప్పుడో, అనుకోని ఆపదలొచ్చినప్పుడో హారతయిపోతాది. ఆరునెల్లకోసారి పెరిగే 'డీఏ' ల కోసం, సంవత్సరానికోసారి పెరిగే ఆన్యువల్ ఇంక్రిమెంట్లకోసం, ఐదు సంవత్సరాల కోసారి జరిగే రివిజన్ కోసం నిరంతరం ఎదురుచూస్తూ, కలలు కంటూ, బడ్జెట్ ఫ్లానును ఎప్పటికప్పుడు సవరించుకుంటూ బండిని ముందుకు నడిపే నాకు కొన్ని కోరికలు తీరని కల.
"సర్... ప్లీజ్" అనే మాట వినబడేసరికి తలెత్తి చూశాను. ఎదురుగా ఇద్దరు యువకులు. మూతి మీద అప్పుడప్పుడే మీసాలు మొలకలేస్తా ఉన్నాయి. "ఏం" అన్నట్లు కళ్లెగరేశాను.
"ఎవరైనా వస్తారా?" అన్నారు న పక్కనున్న ఖాళీ కుర్చీలని చూపిస్తూ.
"లేదు లేదు కూర్చోండి" అంటూ కొద్దిగా వెనక్కి జరిగాను. వాళ్ళు నన్ను దాటుకుంటూ పోయి సీట్లలో కూర్చొని మాటల్లో పడ్డారు.
పక్కనే ఉండడంతో వారి మాటలు నా ప్రమేయం లేకుండానే వచ్చి చెవుల్లో పడుతున్నాయి.
"ఏం గురూ! అమెరికా పోయే ఆలోచనేమన్నా ఉందా?"
"లేదు గురూ... ఐనా ఒకప్పుడు ఇక్కడ సంపాదించుకునే అవకాశాల్లేక అక్కడకు పొయినారు గానీ, ఇప్పుడు మన్లాంటి జెమ్స్ ఇక్కన్నే కాస్త అనుభవముంటే నెలకు యాభై పైనే ఇచ్చే సంస్థలు కొల్లలున్నాయి. అదీగాక ఈ మధ్య రోజురోజుకి మన రూపాయి బలపడుతూ ఉంది. అప్పుడే టెన్ రూపీస్ తేడా వచ్చింది..."
ఆ మాటలు వింటుంటే నాకు నా జీతంగుర్తుకొచ్చింది. పీహెచ్ డీ చేసి డాక్టరేట్ సంపాదించినా అప్పటికే నాలుగు కాలేజీల్లో అవకాశాలు మూసుకుపోవడంతో మరోదారి లేక డీఎస్సీలో టీచర్ ఉద్యోగం సంపాదించాను.
నెలకు పన్నెండు వందల్తో ప్రారంభం. పది సంవత్సరాలు దాట్నా ఇంకా తొమ్మిది వేలు దాటని జీతం.
తమ్మునివి చిన్నప్పటి నుంచీ కాన్వెంట్ చదువులే. డిగ్రీ పూర్తికాకుండానే అప్పుడే తెరమీదకొస్తున్న ఎంసీఏ లో చేరి పూర్తయ్యేసరికి క్యాంపస్ సెలక్షన్లో ఉద్యోగం సంపాదించేశాడు. మీసాలు కూడా పూర్తిగా మొలవకముందే ఇరవై వేలతో ప్రారంభమై ఐదు సంవత్సరాలు తిరిగేసరికి, నాలుగు కంపెనీలు మార్చేసి, అరవై వేలకి చేరుకున్నాడు. హైదరాబాదులో డబల్ బెడ్ రూం ఫ్లాట్ కొనేశాడు. మరో సాఫ్ట్ వేర్ ని మంచి కట్నంతో పెండ్లి చేసుకున్నాడు. ఆ డబ్బుతో నాన్న చెల్లెలికి ఒక ఇంజనీర్ సంబంధం తేగలిగాడు. దాంతో వాళ్ళందరి ముందూ నా పరిస్థితి తీసేసినట్టయిపోయింది. ఇంతకుముందులా వాళ్ళతో స్వేచ్చగా కలవలేకపోతున్నాను.
అంతలో హడావిడి మొదలైంది.
ముఖ్యమైన వాళ్ళంతా వచ్చేశారు. బొద్దుగా, ముద్దుగా నల్లని సూట్ లో చిరునవ్వులు చిందిస్తున్న అఖిల్ చేయి పట్టుకొని కిరణ్ కేకు కట్ చేయిస్తుంటే, అందరూ చప్పట్లు చరుస్తూ "హ్యాపీ బర్త్ డే" అంటూ వెనకనుంచి వస్తున్న మ్యూజిక్ తో గొంతు కలిపారు.
దగ్గరి బంధువులు తమ తాహతును తెలియజేసే బహుమతులు మొదట అందజేస్తుంటే... నా భార్య కళ్ళతోనే నాకోసం గాలించి... కనబడకపోయేసరికి ఇది మామూలే అన్నట్లు గొణుక్కుంటూ... బంగారు గొలుసు తీసి అందరి ముందూ కాస్త గర్వంగా అఖిల్ మెడలో వేస్తూ ఫోటో దిగింది.
స్నేహితులంతా ఏవేవో బహుమతులు అందజేస్తూ విషెస్ చెబ్తూవుంటే మరోపక్క డిన్నర్ ప్రారంభమైంది.
అందరూ వెళ్లేసరికి రాత్రి పదకొండు దాటింది.
"అన్నా... టుమారో మార్నింగ్ టెన్ థర్టీకి వస్తాను. రెడీగా ఉండండి. ఇంటికి పోదాం" అన్నాడు కిరణ్ బై చెబుతూ.
'ఇంట్లో ఎందుకు అందరం ఇరుకిరుకుగా' అంటూ అదే హోటల్లో గది తీశాడు. పొద్దున బస్టాండ్లో దిగగానే రిసీవ్ చేసుకొని నేరుగా హోటల్లోనే వదిలి వెళ్ళాడు. నిద్రపోతున్న చిన్నోన్ని భుజమ్మీద వేసుకొని లిఫ్ట్ లో నాలుగో అంతస్తులోని గదికి చేసుకున్నా.
తరువాత రోజు పొద్దునే కిరణ్ వచ్చి బిల్ పే చేసి ఇంటికి తీసుకునిపోయాడు.
ఇల్లు చాలా అందంగా విశాలంగా ఉంది. గృహప్రవేశం తర్వాత మళ్ళీ ఇప్పుడే రావడం. గదులన్నీ విలాసవంతమైన వస్తువులతో నిండిపోయి ఉన్నాయి. ఒక్కొక్క గదిని చూస్తూ షోకేస్ దగ్గరకొచ్చి ఆగాను. అందులో బంగారు రంగులో మెరిసిపోతున్న చిన్న ఫ్లవర్ వాజ్ లాంటిది కనిపించింది. గాని వెడల్పాటి మూతికి ఎరుపురంగులో రిబ్బన్ కట్టివుంది. అది బోసిగా అనిపించి పక్కనేవున్న ఇంకో ఫ్లవర్ వాజ్ నుండి కొన్ని పూలు తీసి అందులో ఉంచబోయాను.

ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ