Thread Rating:
  • 11 Vote(s) - 2.82 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ (Completed)
#12
(12)

నా ఫోన్ తీసుకొని ఫోన్లో "ప్రియ డార్లింగ్" బదులు "స్వీటీ డార్లింగ్" అని ఫీడ్ చేసుకున్నాను.

"నువ్వెప్పుడూ చీరలే వేసుకుంటావా ??"

"లేదు.... చుడీ దార్స్ వేసుకుంటాను....."

"hmmmmm.......ఒకే"

"స్వీటీ, ఎంగేజ్మెంట్ వచ్చేస్తుంది. ఊరికి ఎప్పుడు వెళ్తున్నావ్??"

"ఒక 3 డేస్ తర్వాత......."

"hmmmmmmm...... నెక్స్ట్ వీక్ నుంచి మన వేళ్ళకి రింగ్స్ ఉంటాయి"

"యా..... అంత చాలా ఫాస్ట్ గా అయిపోతుంది"

నేను మనసులో - ఫాస్టా ?? నాకు ఒక్కో రోజు ఒక వారం లాగా గడుస్తుంది అనుకున్నాను.

"స్వీటీ, జస్ట్ తెలుసుకుందాం అని అడుగుతున్నాను, నా ప్రొఫైల్ చూసి ఫస్ట్ మీరు అమానుకున్నారు ??"

"huh ??"

"అదే సంబంధం చూసినప్పుడు, నా ప్రొఫైల్ చూసుంటాడు కదా"

"ఓకే.... ఫస్ట్ ప్రొఫైల్ చుసినప్పుడు ఒకే అనిపించింది..... కానీ మీ చెల్లి పెళ్లి ఎందుకు కాలదు అని మాకు అర్థం కాలేదు.... తర్వాత ఒకసారి జాతకాలు చూపిస్తే....... ఇప్పటి వరకు చుసిన వాటిల్లో చాల మంచి మ్యాచ్ అని మా గురువు గారు చెప్పారు. తర్వాత పెళ్లి చూపులకు వచ్చినప్పుడు, మీ ఫాదర్ జవాబు చెప్పారు ఆ విషయం గురించి... అప్పుడు ఒకే అనుకున్నారు"

"ఓకే"

"మరి నా గురించి??"

"ఫస్ట్ నిన్ను చూసినప్పుడు ఓకే అనుకున్నాను. కానీ నువ్వు ఓపెన్ గా నాతో ఆలా మాట్లాడేసరికి కొంచెం నెగటివ్ గా అలాగే పాజిటివ్ గ

గా ఫీల్ అయ్యాను"

"నెగటివ్ గానా ఎందుకు ??"

"అంటే కొంచెం నెగటివ్ గా అనుకున్నాను కానీ నీ ఫ్యామిలీని చూసాను, నువ్వు ఫ్రాంక్ గా అన్ని చెప్పేసావు. ఓవరాల్ గా పాజిటివ్ గానే ఫీల్ అయ్యాను"

"hmmmmm...."

"నీకు బాగా సిగ్గెక్కువ"

"ఉండదా మరి....."

నేను లైట్ గా నవ్వాను, నన్ను చూసి తను కూడా నవ్వింది.

"సో ఎలా అనిపించింది మన మీటింగ్ ఈ రోజు నీకు"

"గుడ్"

ప్రియ తో ఇలా సరదాగా గడపడం చాలా ఆనందాన్ని కలిగించింది. ఎందుకో తను సెక్సీ గా కాకుండా ఈ రోజంతా చాలా క్యూట్ గా కనిపించింది. పెళ్ళై ఉండుంటే కచింతంగా ఒక పది లిప్ లాక్ లు ఇచ్చేవాడిని. అంత క్యూట్ గా ఉంది తను. తన బుగ్గలను నలిపేయాలనిపించింది. తన కళ్ళు చాలా అందంగా ఉన్నాయి.

పెళ్ళైతే ఇలాగే తనతో రోజు కబుర్లు చెప్పుకుంటూ సరదాగా సాయంకాలాలు గడిపేయవచ్చు. ఇప్పుడు మాత్రం బయట వెథర్ చాలా చల్లగా హాయిగా ఉంది. ఒకళ్ళ చేయి ఒకళ్ళు పట్టుకొని ఆలా చల్లటి గాలిలో కబుర్లు చెప్పుకుంటూ, తను చెప్పే తీయటి మాటలు వింటూ తిరగాలనిపించింది. తనను బైక్ లో ఎక్కించుకొని తను నన్ను గట్టిగ కౌగిలించుకొని సరదాగా ఆలా ఆలా బైక్ మీద హైవే లో తిరుగుగుతూ బ్రేకులు వేస్తూ.......తనని టీస్ చేస్తూ ఉండాలనిపించింది.

నా జోబీలో ఉన్న పూవు తీసి తనకు ఇచ్చాను. తాను కొంచెం ఆశ్చర్యంగా చూసింది.

"దారిలో ఈ పువ్వుని చూసాను, నచ్చింది, కాళీ చేతులతో ఎందుకు అని......"

తాను నవ్వి "ఇప్పుడు వద్దు సంజు, నెక్స్ట్ టైం తీసుకుంటాను"

"వాడిపోతుంది"

"ఈ పువ్వు దేవుని కోసం"

"స్వీటీ....."

"సంజు.... ఇంకా మానకి పెళ్లి కాలేదు కదా...... అందుకే"

"hmmm సరే..... "

"పెళ్లయ్యాక ఎన్నైనా ఇలాంటివి ఇవ్వు తీసుకుంటాను.... సంజు"

"అలాగైతే రోజు తెస్తాను నీకోసం"

"సరే...." అని నవ్వుతూ చెప్పింది.

ఈ లోపల ఐస్ క్రీమ్స్ వచ్చాయి. అలా ఐస్ క్రీం తింటూ ఉంటె... కొన్ని ఊహలు ఆలోచనలు..... ఒక చల్లటి కోన్ ఐస్ క్రీం ఇద్దరం తింటూ ఉంటె..... తను ఐస్ క్రీం తింటూ కొంచెం ఐస్ క్రీం తన పేదలకు అంటుకొని. ఆ టైం లో తన పెదాల పై నా పెదాలను పెట్టి ఆ ఐస్ క్రీం ను నా పెదాలతో అలా పక్కకు అని తీయటి తన పెదాలను రుచి చూసి తన చెవిలో ఎంత అందంగా ఉందొ తనకి చెప్పాలనిపించింది.  

ఇద్దరం నెమ్మదిగా ఐస్ క్రీం తింటున్నాము:

"స్వీటీ..... నీకు చాక్లెట్ అంటే ఇష్టమా ??"

"ప్రాణం"

"hmmmm"

"నీకు"

"నాకు అన్ని ఇష్టమే. బోరు కొట్టినప్పుడల్లా మారుస్తుంటాను"

"hmmmm"

ఈ లోపల వెయిటర్ ని పిలిచి బిల్ తెమ్మన్నాను. ఐస్ క్రీం తిని, బిల్లు కట్టి బయటకు వచ్చి కార్ ఎక్కాం.

కార్ లో సైలెంట్ గానే ప్రియా అపార్ట్మెంట్ దగ్గరకు వెళ్ళాము. కార్ అక్కడ ఆపి ప్రియను వాళ్ళ నాన్నకు ఫోన్ ఫోన్ చేసి ఇప్పుడే ఇంట్లో డ్రాప్ చేశాను అని అంకుల్ కి చెప్పాను.

ప్రియ కార్ దిగి నాకు చేయి ఊపింది. నేను తనకు చేయి ఊపి, తను లోపలి వెళ్లే వరకు అక్కడే ఉండి, అప్పుడు ఇంటికి వెళ్ళిపోయాను

టు బి కంటిన్యూడ్......
Images/gifs are from internet & any objection, will remove them.
[+] 2 users Like pastispresent's post
Like Reply


Messages In This Thread
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by pastispresent - 05-11-2018, 05:20 AM



Users browsing this thread: 6 Guest(s)