15-08-2024, 09:53 AM
ఘోర కలి అరాచకాలు - 4
సింహం రక్తం తాగే ఘోర కలి
సురా యంత్రాన్ని తీసుకుని చీకటి రాజ్యానికి చేరుకున్నాడు. వైద్య బృందం సురా తెచ్చే యంత్రం కోసం ఎదురు చూస్తోంది. సురా యంత్రాన్ని అందివ్వగానే ఒక 10 ఘడియల తరువాత శస్త్రచికిత్స మొదలు పెట్టారు. పది దేశాల నుండి వచ్చిన ఆ పదిహేను మంది జీకే కార్పొరేషన్ బోర్డు డైరెక్టర్ లనూ పూర్తిగా ఘోర కలి రూపంలోకి మార్చేశారు. సురా చీకటి రాజ్యం బయటే ఘోర కలి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు.
అంతలో ఘోర కలి పెద్ద పెద్ద అడుగులు వేస్తూ, వికృతమైన నాట్యం చేస్తూ వస్తున్నాడు. ఈ ప్రపంచానికి అప్పుడే రారాజునైపోయాననే గర్వం కళ్ళల్లో ఉప్పొంగుతోంది. సురా మిత్రుడు కాబట్టి తేలికగానే పసిగట్టాడు.
చీకటి రాజ్యం చేరుకోగానే ఘోర కలి సురాను కౌగిలించుకుంటూ, "సురా నాకిప్పుడు సింహం రక్తం తాగాలని ఉంది రా ", అన్నాడు.
సురా, "సింహం రక్తం ఎందుకన్నా?" అన్నాడు ఏమీ పాలుపోక.
"సింహం తన వేటకు చిక్కిన జంతువు రక్తం తాగటం వల్లే అంత బలంతో ఉంటుంది సురా. అలాంటి సింహం రక్తమే నేను తాగితే ఎలా ఉంటుందా అన్న అద్భుతమైన ఆలోచన తట్టింది రా. ఏమంటావు సురా?" అడిగాడు ఘోర కలి.
"అన్నా అడవికి సింహం రారాజు. ఇందాక మనం కపాలిని దేవి ఆలయంలో సూసినాం కదా. అమ్మోరు సింహం మీదనే ఉండాది. అట్టాంటి సింహంతో మనకు వైరము దేనికి అన్నా? ఆలోచించు", అన్నాడు సురా.
"రేయ్ సురా, నేను నేరుగా పోయి సింహాన్ని చంపుతానా ఏంది? భలే ఉండావే! సింహంలా మారి సింహాన్ని చంపి ఘోర కలిగా రక్తాన్ని తాగుతా. ఇప్పుడు నేను కామరూపధారిని కదరా", అన్నాడు ఘోర కలి ఆనందం పట్టలేనివాడిగా.
"నీకిచ్చిన శక్తిని పరీక్షించుకుంటాను అంటావ్. అంతేనా?" అడిగాడు సురా.
"అది రా సురా. ఇప్పుడర్థం అయ్యిండాది నా మనసు", అన్నాడు ఘోర కలి.
"అయినా సింహం రక్తం తాగితే ఏమొస్తుందన్నా?" ఆశ్చర్యపోతూ అడిగాడు ఘోర కలి.
"సింహం అంటే నాకు పడదురా. ఒక జన్మలో సింహంతో పోరుకు వెళ్ళా. సింహం చేతిలో చనిపోయా. ఆ సింహం దెబ్బ ఇప్పటికీ నన్ను దెబ్బతీస్తూనే ఉందిరా.....దాన్ని నా చేతులతో చంపాలి. దాని రక్తం తాగి దానికంటే గొప్ప రారాజును నేనేనని దాని శవం ముందు చిందెయ్యాలి. కామరూపధారిగా నాకొచ్చిన ఈ శక్తితోనే అది సాధ్యంరా సురా. ఏమంటావ్?" అన్నాడు ఘోర కలి సూటిగా సురా కళ్ళల్లోకి చూస్తూ.
తన మిత్రుడు తనలా మారిపోయిన ఆ పదిహేనుమందినీ చూడటానికి ఉత్సాహపడతాడేమో అనుకున్న సూరాను ఇలాంటి ప్రతిపాదన విస్మయానికి గురి చేసింది. తను ఇప్పుడు కాదన్నాడంటే ఘోర కలికి అది తీరని కోరికగా మిగిలిపోయి మళ్ళీ భవిష్యత్తులో అయినా సింహాన్ని చంపాలని అనిపిస్తుందేమో. అదేదో ఇప్పుడే చంపేస్తే పోతుంది అనుకుని సరే అన్నాడు సురా. ఇదే సురా చెయ్యబోయే అతి పెద్ద తప్పిదం అని బహుశా అతనికి కూడా తెలియదేమో.
సురా నుండి సరే అన్న పదం వినబడగానే సూరాను వెంటబెట్టుకుని చీకటి రాజ్యానికి దగ్గర్లో ఉన్న అడవికి తీసుకెళ్లాడు. అక్కడ అదే సమయంలో ఒక సింహం వేట ముగించుకుని ఆహారాన్ని భుజిస్తోంది.
దూరం నుండి ఇదంతా చూస్తున్న ఘోర కలి సురాతో," ఇప్పుడు దాని నోటి కింది కూడు లాక్కుంటాను చూడు", అంటూ వికృతంగా నవ్వాడు.
వృద్ధ సాధువు ఇచ్చిన మంత్రం జపించిన కొద్ది నిమిషాల్లోనే సింహంలా మారిపోయాడు ఘోర కలి. పరిగెత్తుకుంటూ ఆ సింహం దగ్గరికెళ్లి తన ఆహారాన్ని లాక్కుని తినటం మొదలు పెట్టాడు. ఆ సింహం ఉగ్రరూపం ధరించి పంజా విసిరింది. ఆ సింహాన్ని చిత్తుగా ఓడించాడు సింహం రూపంలో ఉన్న ఘోర కలి. రెండే రెండు దెబ్బలకు నేలకొరిగింది.
వెంటనే తన స్వంత రూపంలోకి మారిపోయిన ఘోర కలి సింహం బ్రతికున్నదా, చచ్చినదా అని పరీక్షగా చూసాడు. కొనఊపిరితో ఉండటంతో ఆ సింహం పంజా చురుకుగా ఘోరకలి మొహాన్ని తాకింది. ఘోరకలి అసలు రూపాన్ని చూస్తూ ఆ సింహం తుది శ్వాస విడిచింది. చనిపోయే ముందు కూడా తన గుర్తును వదిలి వెళ్ళింది. ఘోర కలి మొహంపై ఏటవాలుగా పెట్టిన గాటు ఇందుకు తార్కాణం. ఘోర కలి ఆవేశం కట్టలు తెంచుకుంది. తన దగ్గరున్న కత్తి తీసి ఆ సింహాన్ని నిలువునా చీల్చేసి మరిగే ఆ రక్తాన్ని తాగాడు. తనేం చేస్తున్నాడో తనకే అంతుబట్టని కోపంలో ఊగిపోతున్నాడు ఘోర కలి. సింహం మెడ పై కాలు పెట్టి, "చచ్చిందిది చివరికి....హహ్హాహ్హా", అంటున్నప్పుడు తన మొహం పై పడ్డ సింహం గాటు బలంగా ఉండటంతో రక్తం కారుతూ బొట్లు బొట్లుగా నిర్జీవంగా పడి ఉన్న సింహం పై పడ్డాయి.
సరిగ్గా సింహం నాలుక తెరుచుకుని ఉన్న చోట ఈ రక్తం బొట్లు పడ్డాయి. అంటే సింహం కూడా ఘోర కలి రక్తాన్ని రుచి చూసిందన్న అర్థం వచ్చేలా ఉందా దృశ్యం. కానీ అప్పటికి సింహంలో ప్రాణం లేదు. ఈ దృశ్యాన్ని దూరం నుండి చూస్తున్న సూరాకు భవిష్యత్తులో జరగబోయే దేనికో ఇది సంకేతంలా అనిపించింది.
ఘోర కలి దగ్గరకొచ్చి, "అన్నా ! తృటిలో తప్పించుకున్నావ్ . సింహాన్ని చంపి, రక్తం తాగావు కదా. మన చీకటి రాజ్యానికి పోదాం పద", అన్నాడు సురా.
"నాకు సింహం రక్తం బాగా నచ్చిందిరా. దాని కడుపు నిండా పౌరుషమే. ఆ పౌరుషం మొత్తం తాగేసానురా.
హహహ...ఇలాగే ప్రతీ వారం నాకు సింహం రక్తం కావాలిరా", అంటూ ఆవేశం కట్టలు తెంచుకున్నవాడిలా నడుస్తూ ముందుకెళ్లాడు ఘోర కలి.
కనీసం వెనక్కి తిరిగి తన వంక కూడా చూడకుండా వెళ్తున్న ఘోర కలి వైపే చూస్తూ స్థాణువులా నిలబడిపోయాడు సురా. ఇలాగే కొనసాగితే తన మిత్రుడేమైపోతాడా అన్న భయంతో, బాధతో ఆలోచనలో పడ్డాడు.

ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ