10-08-2024, 04:49 AM
(25-02-2019, 02:52 PM)siva_reddy32 Wrote:![]()
మిత్రులారా ,
నేను ఒక పాఠకుడినే, కథ మద్యలో ఆపితే ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు , కాబట్టి మద్యలో ఆపే సమస్యే లేదు.
మీకు కొన్ని విషయాలు చెప్పక తప్పడం లేదు ఎందుకంటే కథ లెట్ అవుతుంటే కొందరు మిత్రులకు బాగా విసుగు వస్తుంది.
Xossip మూసిన తరువాత , మేము కూడా అందరి లాగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటే ఇప్పుడు మనం చూస్తున్న సైట్(xossipy.com) మనకు ఉండేది కాదు.
మన అందరి కోసం ఎదో ఒక సైట్ తయారు చేద్దాం అని మొదలు పెట్టి.(ఇలాంటి సైట్స్ తయారు చేయడం లో మేము నిష్ణాతులు కాదు ). మొదట ఎక్కడ ఫ్రీ గా సైట్ హోస్ట్ చేయవచ్చు నో అక్కడ స్టార్ట్ చేశాము.
ఏదన్నా సైట్ హోస్ట్ చేయాలంటే దాని వెనుక బోలెడు తతంగాలు ఉంటాయి కొన్ని ఫ్రీ గా దొరికినా , కొన్నింటి కి డబ్బులు పెట్టాలి మరి ఆ డబ్బులు ఎవరు పెడతారు ??
మన సంతోషం కోసమే కదా చూద్దాం అని మేమే ఆ ఖర్చు భరించి మొదట ఫ్రీ గా హోస్ట్ చేసే ప్లేస్ లో సైట్ స్టార్ట్ చేశాము.
ఇంతకూ ముందు చెప్పినట్లు మేము అందులో నిష్ణాతులు కాదు. సైట్ లో ఎదైనా సమస్య వచ్చినప్పుడల్లా గూగుల్ తల్లిని అడిగి ఆ సమస్యకు పరిష్కారం కనుక్కొని అలా ముందుకు నడిపించాము.
ఒక నెలలో మన సైట్ ఎంత పాపులర్ అయ్యింది అంటే. ఫ్రీ గా హోస్ట్ చేసుకున్నా ప్లేస్ సరిపోవడం లేదు. మాటి , మాటికీ సైట్ డౌన్ అవుతూ ఉండేది. అది ఎంత ఇబ్బంది గా ఉంటుందో మీకు తెలిసే ఉంటుంది.
అందరికి ఇబ్బందే కదా , ఫ్రీ హోస్ట్ నుంచి paid హోస్ట్ కు మార్చాలి. మరి అక్కడ డబ్బులు కట్టాలి.
మన సైట్ కదా ఈ సారికి కడదాం లే అని చేతినుంచి కర్చు పెట్టుకొని కొత్త హోస్ట్ కి మార్చాము.
అంతా సవ్యంగా జరిగింది 22 శుక్రవారం ఉదయం వరకు. మిత్రుడు సరత్ కాల్ చేసి చెప్పాడు భయ్యా సైట్ ఓపెన్ కాలేదు అని. ఆఫీస్ పనులు పక్కన పెట్టి ఏమైందా అని చుస్తే మనం డబ్బులు ఇచ్చి హోస్ట్ చేసిన వాళ్ళు ఏవో వాళ్ళ రూల్స్ బ్రేక్ చేశాము అని మన ఎకౌంటు సస్పెండ్ చేసారు.
ఇప్పుడు ఇంకో హోస్ట్ ను వెతికి వాళ్ళకు డబ్బులు కట్టి పాత డాటా ను అందులో కాపీ చేసి సైట్ ను ఇప్పుడున్న స్థితికి తెచ్చే సరికి శుక్రవారం సాయంత్రం అయ్యింది.
ఇదంతా చెప్పకుండా సింపుల్ గా నా పని నేను చేసుకుంటూ పోవచ్చు , కానీ కొందరు మిత్రుల విసుగు తారా స్థాయికి చేరుకుంటుంది. అందు కోసం కొంచెం విపులంగా వివరిద్దాం అని ఓ చిన్న ప్రయత్నం.
ఓ పాఠకుడిగా నాకు తెలుసు , నచ్చిన కథ అప్‌డేట్ ఈయక పొతే మనకు ఎంత ఇర్రిటేషన్ గా ఉంటుందో. మీ విసుగును , ఇర్రిటేషన్ నేను అర్థం చేసుకో గలను. కానీ మీరు కూడా కథ రాసే వారి పరిస్తితి ని అర్థం చేసుకొండి.
టైం దొరకినప్పుడు తప్పకుండా కథ రాయడానికే మొదటి ప్రయత్నిస్తాను. ఆ తరువాతే వేరే పనులు ఏమైనా.
సైట్ లో అప్పుడప్పుడూ SQL error అని వస్తుంది , దాని సంగతి చూడాలి ఇప్పుడు.
మన సైట్ కి వచ్చే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ పోతుంది. ఇలాగే పెరిగితే ఇప్పుడు హోస్ట్ చేసిన ప్లేస్ చాలదు, ఇంకా పెద్ద సర్వర్ కి వెళ్ళాలి అంటే బోలెడు డబ్బులు కట్టాలి.
ఇవన్నీ చూడడానికే నా టైం సరిపోతుంది. ఇప్పుడు అర్థం అయ్యింది అనుకుంటాను కథను ఎందుకు లేట్ గా ఇస్తున్నానో.
వీలు దొరికినప్పుడల్లా చిన్నదైనా అప్‌డేట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను.
మీ
శివ