Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
రాజుల సంబంధం
#2
ఆలుమగలు రాజకుమార్ గృహ ప్రాంగణాన్ని దాటి వీధిలో ప్రవేశించేంత వరకూ అతన్నే చూచారు.



"ఏమండీ!...." గోమూగా పిలిచింది రాజేశ్వరి.



"......... అర్థం అయ్యింది. ప్రయత్నిస్తాను." తన గదికి వెళ్ళిపోయాడు సర్వోత్తమరావు. తన మిత్రుడు మిరియాల మాలకొండయ్యకు ఫోన్ చేసి వెంటనే రమ్మన్నాడు.
మాటలను విన్న రాజేశ్వరి వదనంలో పండువెన్నెల విరిసింది.
  *
"అయ్యా!.... నట సార్వభౌమా! సత్యమూర్తిరాజు గారూ!... ప్రణామాలు" చేతులు జోడించాడు మిరియాల మాలకొండయ్య. ఇతనూ హాస్యనటుడు.



"యం.యం మాలకొండయ్యగారూ! ఏమిటి ఆకస్మిక రాక?" 



మిరియాల మాలకొండయ్యకు బాగా తెలుసు. సత్యమూర్తిరాజు రాజభాషనే మాట్లాడతాడని.
అందువల్లనే రీతి సంబోధనను చేశాడు.



"అయ్యా!.... సందేశము?"



"ఏమిటయ్యది?"



"మన అమ్మాయి వివాహా విషయం...."



"ఎం. ఎం. మాలకొండయ్య గారూ!...."



"అయ్యా!...."



" విషయమును గురించి మేము మీతో ఎన్నడూ చర్చించలేదే!" ఆశ్చర్యాన్ని ప్రదర్శించాడు సత్యమూర్తిరాజు.



"నేను మీతో ప్రస్తావించ వచ్చితిని మహాశయా!"



"....! ప్రస్తావించుడు..."



"సర్వోత్తమరావుగారు తమరికి దూరపు బంధువే కదయ్యా!...."



"అగును...." 



"వారి కుమారులుంగారికి, తమరి కుమార్తెకు వివాహ విషయముగా ముచ్చటించ నన్ను వారు పంపినారు..."



"వారూ అనగా....."



"సర్వోత్తములుంగారు!" చిరునవ్వుతో చెప్పాడు యం. యం.కొండయ్య. ఆశగా దీక్షగా సత్యమూర్తి రాజు ముఖంలోకి చూచాడు. 



"ఆఁ..... బాగు బాగు. సంధాతగా వచ్చినావా?" 



"అవును మహాశయా!"



"అబ్బాయి నామధేయమేమి?"



"రాజకుమార్ ఆర్యా"



"ఓహో! మంచిపేరు..." క్షణమాగి "ప్రస్తుత వృత్తి?" అడిగాడు సత్యమూర్తి రాజు.



"న్యాయవాది"



"ధర్మరక్షణ చేయువాడన్నమాట"



"యదార్థము అయ్యదే!"



"వారి తండ్రి..." ఆగిపోయాడు సత్యమూర్తి.



"తమరికి విధితమే కదా స్వామీ"



"బాగు... బాగు... కన్యను చూచుటలకు ఎప్పుడు వేంచేయుదురు?"



"తమరు సెలవిచ్చినప్పుడు" ప్రశ్నార్థకంగా సత్యమూర్తిరాజు ముఖంలోకి చూచాడు యం.యం. కొండయ్య.



"యం.యం కొండయ్య దూతగారూ..."



"స్వామీ!..."



" దినము బహుళ ఏకాదళి"



"అవును ఆర్యా! రేపు ద్వాదశి"



"మరుదినము త్రయోదశి..... మార్గశిరమాసం... జ్యేష్టానక్షత్రం"



"అవును.... ఆర్యా!"



" దినమున ఉదయం తొమ్మిది నలభై తరువాత వారిని మా యింటికి మా కన్యను చూడ రావలసినదిగా విన్నవించుడు."



"సంతసము స్వామీ శలవు" చేతులు జోడించి యం.యం. కొండయ్య ఆనందంగా బయలుదేరాడు.
సత్యమూర్తి, యం.యం. కొండయ్య వచ్చి తనకు చెప్పి విషయాన్ని అర్థాంగి వనజ, కుమార్తె భారతి, కుమారుడు భాస్కర్లతో చర్చించాడు.



పర్యవసానం... భారతికి రాజకుమార్ నచ్చలేదు. నిర్భయంగా చెప్పింది.
రోజు రాజకుమార్ పెండ్లి చూపులు....
సర్వోత్తమరావు, రాజేశ్వరి, రాజకుమార్, యం.యం. కొండయ్యలు సత్యమూర్తిరాజు గారి ఇంటికి వధువును చూడవచ్చారు.



"స్వాగతం!.... సుస్వాగతం!...." సర్వోత్తమరావుగారి కుటుంబానికి చిరునవ్వుతో చెప్పాడు సత్యమూర్తిరాజు.



"సత్యమూర్తిరాజా! థాంక్యూ." నవ్వుతూ చెప్పాడు సర్వోత్తమరావు.



"ఆసనముల గ్రహించుడు." అన్నాడు సత్యమూర్తిరాజు. 



"నమస్సుమాంజలి." వచ్చిన వారినందరినీ చూచి సత్యమూర్తిరాజు అర్థాంగి వనజ చేతులు జోడించింది.



వారి సంబోధనను విన్న రాజకుమార్, వారి తల్లి రాజేశ్వరి ఆశ్చర్యపోయారు. ఒకరి ముఖాలొకరు చూచుకొన్నారు.
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
రాజుల సంబంధం - by k3vv3 - 05-08-2024, 01:14 PM
RE: రాజుల సంబంధం - by k3vv3 - 05-08-2024, 02:34 PM
RE: రాజుల సంబంధం - by k3vv3 - 05-08-2024, 02:35 PM
RE: రాజుల సంబంధం - by Uday - 07-08-2024, 07:27 PM



Users browsing this thread: 1 Guest(s)