Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
రాజుల సంబంధం
#1
రాజుల సంబంధం

[Image: image-2024-08-05-131305146.png]


రచన: సిహెచ్. సీఎస్. రావు



సర్వోత్తమరావు గ్రామ సర్పంచి. పరమ స్వార్థపరుడు. వీరి ఇల్లాలు రాజేశ్వరి ఎంతో సాత్వికురాలు. రావుగారి దగ్గరికి ఎవరు వచ్చి ఏది కోరినా నాకేమిస్తావ్? అని నిర్భయంగా అడుగుతాడు. భర్త తత్త్వాన్ని గిట్టని రాజేశ్వరి భక్తితో.... శ్రీరామచంద్రమూర్తిని సీతామాతలను ప్రతిదినం దీక్షగా పూజించి నివేదనలను అర్పించి... "మాతాపితలారా! మావారు స్వార్థబుద్ధిని దహించండి. సత్ బుద్ధిని ప్రసాదించండి ఎంతో భక్తితో వేడుకొనేది.



సర్వోత్తమరావు దృష్టిలో పైసాయే పరమాత్మ అనే గాఢ విశ్వాసం. అర్థాంగి చేసే పూజలు, పునస్కారాలు అతనికి నచ్చవు. వారి ఇంటికి ఇల్లరికపు అల్లుడు. అతను అనుభవించే ఆస్థిపాస్తులు అన్నీ రాజేశ్వరి తల్లిదండ్రులు ఆమెకు ఇచ్చినవే. కారణంగా సర్వోత్తమరావు భార్య చేసే కార్యకలాపాలను ఆక్షేపించలేకపోయాడు.



యదార్థానికి యింటి యజమాని నిర్గుణవంతుడుగా, స్వార్థపరుడుగా వుంటాడో, ఇంటి ఇల్లాలు మహాసాద్విగా సద్గుణ సంపన్నురాలుగా వుంటుంది. ఆమెలోని మంచితనం... ఇంటి యజమానికి కవచం శ్రీరామరక్ష అవుతుంది. 



దంపతులకు ఒక కుమారుడు. పేరు రాజకుమార్. కొడుకంటే తల్లితండ్రికి ఎంతో ఇష్టం. లా పూర్తిచేసి ప్రాక్టీస్ ప్రారంభించాడు. డబ్బు విషయంలో రాజకుమార్ది తండ్రి పోలికే. 
వీరి దూరపు బంధువు సత్యమూర్తి రాజు. ఒకనాడు ప్రఖ్యాత రంగస్థల నటుడు.... తెలుగు పండిట్.... వారి అర్థాంగి వనజ. ఆమె కాలేజీ రోజుల్లో ఆనాటి ఆమె తెలుగు పండిట్ గోపాలరావు గారి ఆధ్వర్యంలో నాటకాలు ప్రదర్శించిందే. కాళిదాసు రాయభారం, కృష్ణ తులాభారం నాటకాల్లో, కాళిదాసుగా, శ్రీకృష్ణుడుగా అద్వితీయంగా పాడి అద్భుతంగా నటించిన మేటి నటీమణి.



సత్యమూర్తిగారు దుర్వోధనుడు, కంసుడు, కీచకుడు, రావణుని పాత్రలను సరిలేరు నీకెవ్వరు అనే స్థాయిలో నటించేవాడు. ప్రస్తుతం దంపతుల మధ్య వయస్సు అరవై ఐదు, యాభై. వారికి భారతి అనే కుమార్తె, భాస్కర్ అనే కుమారుడు వున్నారు. భారతి స్టేట్ ఫస్టులో బి.కాం పాసయ్యింది. భాస్కర్ ఇంటర్ సెకండ్ ఇయర్. చాలా మంచి కుటుంబం. పిల్లలిరువురూ తల్లిదండ్రులను ఎంతగానో గౌరవిస్తారు. అభిమానిస్తారు. పెద్దలమాటను అక్కాతమ్ముడు జవదాటరు. భాస్కర్కి తన అక్క భారతి అంటే పంచప్రాణాలు.



ఒకే వూరువారైనందున సర్వోత్తమరావు, సత్యమూర్తులకు బాగా పరిచయం. ఒకరిని గురించి మరొకరు బాగా ఎరిగినవారు. సత్యమూర్తిరాజు వయస్సు అరవై ఐదు. సర్వోత్తమరావు వయస్సు యాభై ఐదు. రాజేశ్వరికి భారతి అంటే ఎంతో ప్రేమ, అభిమానం. బి.కాం పరీక్ష స్టేట్ ఫస్టున పాసైన భారతి ఫొటోను పేపర్లో చూచింది రాజేశ్వరి. ఆమెను తన కోడలిగా చేసుకొంటే బాగుంటుంది అనే ఆలోచన మనస్సున ఏర్పడింది. కొడుకును పిలిచింది రాజేశ్వరి. 



"ఏమ్మా!..." అడిగాడు రాజకుమార్.



"రాజా! నేను ఒకటి అడుగుతాను. నిజం చెప్పాలి సుమా!...." అంది.



"అడుగమ్మా...."



"నీ వివాహాన్ని చూడాలని వుందిరా!" చిరునవ్వుతో చెప్పింది రాజేశ్వరి.



"అమ్మా!..... నాన్నతో మాట్లాడావా!....."



"ముందు మనమిద్దరం ఒక నిర్ణయానికి వస్తే వారిని నేను ఒప్పిస్తాను రా" అనునయంగా చెప్పింది రాజేశ్వరి.



"అవును... నీవు నాకు పిల్లని చూచావా?"



".... చూచాను. ఇప్పుడే కాదు అమ్మాయిని చిన్న వయస్సు నుంచి చూస్తూనే వున్నాను. చాలా చాలా మంచిది."



"అలాగా!....."



"ఇంతకూ ఎవరమ్మా అమ్మాయి!"



పేపర్లోని భారతి ఫొటోను చూపించి " భారతిరా!" ఆనందంగా నవ్వుతూ చెప్పింది రాజేశ్వరి.



"... పిల్లా!...."



"అవును... ఏరా! అంత తేలిగ్గా, నిర్లక్ష్యంగా అనేశావ్?"



"అమ్మా!... నీకు నచ్చింది సరే.... నాన్నకు నచ్చిందా?"



"ముందు నీ ఉద్దేశ్యాన్ని చెప్పరా."



"అమ్మా! నాన్న ఓకే అంటే నాకు సమ్మతమే."చిరునవ్వుతో చెప్పాడు రాజ్కుమార్. 



అప్పుడే హాల్లోకి ప్రవేశించిన సర్వోత్తమరావు కొడుకు మాటలను విన్నాడు.
"ఆఁ.... విషయం ఏందిరా రాజా! నా ఇష్టమే.... నీ ఇష్టం అన్నావ్?" అడిగాడు సర్వోత్తమరావు.



నవ్వుతూ భర్తను సమీపించి పేపర్లో భారతి ఫోటోను రావుగారికి చూపించింది రాజేశ్వరి.
"నాకాబోయే కోడలు." అంది.



"ఆఁ...."



"అవునండి. నాకు పిల్ల తన చిన్న వయస్సు నుంచీ తెలుసు మీకూ తెలుసుగా!..."



"....... తెలుసు అయితే....!" ఆశ్చర్యంగా చూచాడు భార్య ముఖంలోనికి సర్వోత్తమరావు.



"మీరు అమ్మాయి తల్లిదండ్రులతో మాట్లాడాలి. ఈమెను మన ఇంటి కోడలిగా చెయ్యాలి"
సర్వోత్తమరావు కొన్ని క్షణాలు ఆలోచించాడు. 



"ఏరా! రాజా!.... నీకు నచ్చిందా!" అడిగాడు. 



"మీ ఇష్టమే నా ఇష్టం నాన్నా!" రాజకుమార్ స్కూటర్ పై కోర్టుకు వెళ్ళాడు.

...
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
రాజుల సంబంధం - by k3vv3 - 05-08-2024, 01:14 PM
RE: రాజుల సంబంధం - by k3vv3 - 05-08-2024, 02:34 PM
RE: రాజుల సంబంధం - by k3vv3 - 05-08-2024, 02:35 PM
RE: రాజుల సంబంధం - by Uday - 07-08-2024, 07:27 PM



Users browsing this thread: 2 Guest(s)