Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
కల్పతరువు Part - 15
#21
కల్పతరువు - పార్ట్ 10






“థాంక్స్ అంకుల్జీ. " 
"ఆంటీజీ,


 అచల ఇప్పుడున్న ఇల్లు ఖాళీ చేసి, నాతో పాటే వుంటది. ఎందుకంటే, బట్టలు కుట్టినా వచ్చే రాబడి ఇంటి ఖర్చులకే సరిపోతున్నది. అందుకని ఒక నెల ముందే మీతో చెపుతున్నాము. ”



ఇరువురి ముఖాల్లో చిరునవ్వు ఎగిరి పోయింది, “అదెలా కుదురుతుంది, ఖాళీ చేస్తే సరే, కానీ మీ వద్ద వుంటే, మీరు రెండింతలు అద్దె కట్టాలి. ”



“రెండింతలు కిరాయి కాకుండా, ఒక వెయ్యి పెంచుతాము, ”



“లేదమ్మా, మేము నష్ట పోతాము. అంతగా భరించలేక పోతే కిరాయి తక్కువ వున్న ఇల్లు చూసుకొని అచల వెళ్ళి పోవచ్చును. ”



“ప్లీజ్ ఆంటీజీ, వేరే ఇల్లు అంటే అచలకే కాదు నాక్కూడా అభ్యంతర్యమే. ”



అచల సౌమ్యంగా అంది “ఆంటీజీ, మీరే అన్నారు కదా నేను మీ కూతురు లాంటి దానినని, నా బిజినెస్ లాభాల్లో రాగానే నేను పూర్తి అద్దె యిస్తాను. అంత వరకు సర్దుకోండి. ”



“అవును, నువ్వు మా కూతురు లాంటి దానివే, కాదన లేదు. పెళ్లి అయిన తరువాత పైసల విషయంలో మా కన్న కూతురైన కిరాయి కట్టాల్సిందే. ”



కొన్ని క్షణాలు అందరూ మౌనంగా వుండి పోయారు. ప్రతాప్ మెహతాగారు, “బేటీ, మాటలు పెంచి టైమ్ వేస్ట్ చేయకండి. మాకు రెండు కిరాయి లు కావాలి, లేకుంటే మీరు ఖాళీ చేయవచ్చు. ”



“అదే, అంకుల్జీ, నా పోర్షన్ ఖాళీ ఐన వెంటనే మీరు వేరే ఎవరికైనా రెంట్ కు ఇవ్వండి, నేను సత్యాగారి ఇంట్లో సర్దు కుంటాను. మీకు రెండు పోర్షన్ల రెంట్ వస్తుంది. ”



“అట్లా కుదరదు. సత్యలీల అగ్రీమెంట్లో తాను ఒక్కతే వుంటా అన్నది, ఇప్పుడు వేరే ఎవ్వరూ జత చేరినా డబల్ కిరాయి యివ్వాలి. ”



“యే మాటా నెల ముందే చెబితే మేము టులెట్ బోర్డు పెట్టుకుంటాము. ” ఆంటీ వంత పలికింది. 



ఏం మనుషులు? 



ఓనర్ పెన్షన్ డబ్బులు, కొడుకు నేవీ ఆఫీసర్, మంచి జీతం. ఆర్మీ కాంటీన్ ఇచ్చే సబ్సిడీ సరుకులు, ఇంటి ఖర్చులు తక్కువ. కొన్నాళ్లు అచేతన స్త్రీకి సాయ పడలేరా? 



కుంచిత స్వభావాన్ని మనసులోనే చీదరించుకుని. “ఓకే ఆంటీజీ మేము ఏ సంగతి చెబుతాము. ” అంటూ లేచి వెళ్లారు. 






>>>>>>>>>> 






డిగ్రీ చదువుతూనే సితార్, స్కూటీ డ్రైవింగ్ నేర్చుకుంది ప్రజ్ఞ. 



“ప్రజ్ఞా, నీకు పెళ్లి జరిపించాలిని అనుకుంటున్నాను. నీకు ఎలాటి అబ్బాయి కావాలో.. అంటే ఏం చదువు కోవాలి? ఏ ప్రాంతంలోని వాడైతే నీకు యిష్టం? పెద్ద కుటుంబమా, చిన్న కుటుంబమా.. వంటి ప్రశ్నలకు నీ సమాధానం కావాలి. ” తండ్రి పాత్ర నిర్వహిస్తున్న కేశవరెడ్డి అడిగాడు. 



“పెదనాన్నా, నాకు పెళ్లి గురించి ఎటువంటి కోరిక, అభిప్రాయము లేదు. ” క్లుప్తంగా జవాబు వచ్చింది. 



“కోరికా, అభిప్రాయమూ లేవు.. కాని మీ నాన్నకు నేను అన్నను. నాకు నీ పెళ్లి చేయాలిని, చూసి ఆనంద పడాలని నా కోరిక. నాకు నువ్వు తప్ప వేరే నా వాళ్ళు ఎవ్వరూ లేరు. 



నా ఇంట్లో పసిపాపలు పుట్టాలని, ఇల్లంతా పాకుతూ, ఆడుతూ కేరింతలు కొట్టాలని వుంది. తండ్రిగా నా కోరిక తీరలేదు. కనీసం తాతగా పసిపాపలు నా భుజాన ఎక్కితే, నువ్వు గోరు ముద్దలు తిని పించాలి..నా వీపు పైన గుర్రం స్వారి చేయాలి.. నా ఈ చిన్న కోరిక వూహల్లోనే కరిగి పోవలా తల్లీ?” భావోధ్యేగం ఆగలేదు. 



“పెదనాన్నా, నాకు-మీరు, మీకు-నేను వున్నాము, మన మధ్యలో వేరొకరు వస్తే మన జీవితాల్లో ఎలాంటి తుఫాను చెలరేగుతుందోనని భయం. ప్రశాంతంగా గడిచే జీవితాన్ని కెలకటం ఎందుకని నా ఆలోచన, అంతే కానీ మిమ్మల్ని యిబ్బంది పెట్టె మనసు కాదు. ”



“నీకు ఎలాటి భయాలు వద్దు. మనకు అన్ని విధాలా సరితూగే అబ్బాయిని వెతుకుతాను. మనిద్దరికి నచ్చిన సంబంధమే చూస్తాను. సరేనా?”



“నాకు నచ్చాల్సిన విషయం ముఖ్యం కాదు, మీకు నచ్చాలి; అంటే, ఒక అల్లుడు మాత్రమే కాదు, ఈ ఇంటి బాధ్యతను ఒక కొడుకు వలె ఆస్వాదించాలి. 



అట్టి అర్హతలు కల్గిన వ్యక్తి, మనలో కలిసి పోయే సహృదయత గల వారు దొరకటము కష్టమే. అందుకే నేను పెళ్లి గురించి ఎటువంటి అభిప్రాయం పెట్టుకోలేదు. ” 



“సరే, నువ్వు చెప్పావు కదా, నా ప్రయత్నం నేను చేస్తాను. ”



లోకం పోకడ తెల్సిన మనిషి కేశవరెడ్డి. మంచి యోగ్యతగల అబ్బాయి కోసం వెతకటము మొదలైనది. 



ఈ సాహస కార్యక్రమంలో కల్పన లేని లోటు తెల్సి వచ్చింది. కల్పన వుంటే ప్రజ్ఞకు సులభంగా పెళ్లి సంబంధం చూసేదేమో.. ఆరు నెలలైన అబ్బాయి కోసం వేట ఆగిపోలేదు. 



..



ప్రతీ రోజు ఒక మారు సితార్ వాయించే ప్రజ్ఞ, ఆ రోజు కొంచెం ఎక్కువ సేపు వాయిస్తూ వుంది. కళ్ళు మూసుకునే వున్నా చేతి వేళ్ళు స్వరాలను పలికిస్తున్నాయి. 



పరోక్షంగా కిటికీ చాటుగా ఆనంద్ ప్రజ్ఞ సంగీతాన్ని వింటున్నాడు. 



కేశవరెడ్డి ఇంట్లోని మొక్కలను గమనిస్తూ, ఇంటి చుట్టూ ఉదయం, సాయంత్రం వాకింగ్ చేసే ప్రక్రియలో ఆనంద్ బుజం తట్టాడు. 



“ఆనంద్.. సంగీతం వినాలంటే రూమ్లోకి వెళ్ళి విను, ఇలా దొంగ చాటున వినే దుస్థితి ఎందుకు?” ప్రశ్నించాడు కేశవరెడ్డి. 



“సారీ సేఠ్జీ, ప్రత్యక్షంగా వింటే ప్రజ్ఞా మేడమ్ మనసులోని భావనలు తెలియవు. ఇట్లా చాటుగా వింటే.. ”



“ప్రజ్ఞ భావనలతో నీకేం పని?” కొంచం కటువుగా అన్నాడు యజమాని. 



ఆనంద్ తలవంచుకుని “సేఠ్జీ.. సార్.., నేను ప్రజ్ఞగారిని ఇష్ట పడుతున్నాను, మీ ఇద్దరి మనసులో నా పట్ల ఎలాటి అభిప్రాయం వుందో తెలియదు. 



ప్రతీ ఆదివారం న్యూస్ పేపర్లో మీరు మాట్రిమోనల్స్ ఏకధాటిగా చూస్తుంటే.., నా అభిప్రాయం మీకు చెప్పాలని.. ” మనసులోని కోరికను బయటకు రానిచ్చాడు. 



కేశవరెడ్డి ఆశ్చర్యం నుండి తెరుకొని, “ఆనంద్, ఎప్పుడూ ఒక్కసారి కూడా నువ్వు బయట పడలేదు. కనీసం ప్రజ్ఞకు తెలుసా నీ మనసులోని మాట.. ”



“లేదు, తెలియదు. తిరస్కరణ ఎదుర్కోవడము కంటే మౌనం శ్రేయస్కరం అని నేను ఊరుకున్నాను. ”



“మీ ఇంట్లో వాళ్ళ సమ్మతి తీసుకో.. ”



“అమ్మానాన్నలు లేరు. ఇద్దరలక్కల పెళ్ళిళ్ళు జరిగాయి. నేను ఎక్కువ టైమ్ ఇక్కడే గడుపుతాను కదా సర్. ” 
 
“మంచిది, నేను ప్రజ్ఞను అడిగి, నీకు యే సంగతీ చెబుతాను. ”
====================================================================ఇంకా వుంది..
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
కల్పతరువు Part - 15 - by k3vv3 - 04-05-2024, 02:15 PM
RE: కల్పతరువు - by sri7869 - 04-05-2024, 10:20 PM
RE: కల్పతరువు - by k3vv3 - 10-05-2024, 02:25 PM
RE: కల్పతరువు Part-2 - by k3vv3 - 25-05-2024, 04:51 PM
RE: కల్పతరువు Part-2 - by k3vv3 - 25-05-2024, 05:29 PM
RE: కల్పతరువు Part - 10 - by k3vv3 - 03-08-2024, 06:38 PM



Users browsing this thread: 3 Guest(s)