27-07-2024, 12:50 PM
శంభల రాజ్యం – 3
జటిల
రుద్రసముద్భవ ఆధ్వర్యంలో అభిజిత్, అంకిత, సంజయ్ లు శంభల రాజ్యంలోని ప్రాకారాలన్నీ తిరిగి యుద్ధ విద్యా నైపుణ్యాన్ని, వ్యూహాలను, అస్త్ర విద్యలను నేర్చుకునేందుకు పయనమయ్యారు. సిద్ధపురుషుడు మాత్రం శంభల రాజ్యంలో ఇచ్చిన అతిథి గృహంలోనే ఉండిపోయాడు. ధ్యానంలో నిమగ్నమయ్యాడు.
ఆ ప్రయాణంలో మొదటిగా వారికి స్వాగతం పలికింది ' జటిల'.
" జటిల శంభల రాజ్యంలోని మహా మహా యోధులకు కూడా అంతుచిక్కని ప్రాకారం. ఇక్కడ ఏ క్షణానైనా సింహాలతో తలపడవలసి రావొచ్చు. సింహానికి స్నేహితుడివి అయ్యావంటే మాత్రం అవే దగ్గరుండి మరీ ఎన్నో కఠినమైన విద్యలను నేర్పిస్తాయి. శంభల రాజ్యంలోని ప్రతీ యోధుడూ జటిల పేరు చెబితే చాలు వణికిపోవటానికి కారణం ఇదే. ఇక్కడి సింహాలు భూలోకంలో కనిపించే క్రూర సింహాలు కావు. ఎంతో రాజసం కలిగినవి. ఒక యోధుడిని ఇట్టే కనిపెట్టేస్తాయవి. ఎన్ని విద్యలొచ్చినా సరే జటిలలోని సింహాలు అంగీకారం తెలిపితేనే ఆ వ్యక్తి పరిపూర్ణమైన యోధుడి కింద లెక్క", అంటూ చెప్పటం ముగించాడు రుద్రసముద్భవ.
"ఏంటి? సింహాలతో ఫైట్ చెయ్యాలా?" అంటూ నీళ్లు నమిలాడు అభిజిత్.
"మరి అనిరుద్ధుడి సంస్థానంలో ప్రాణాలకు తెలిగించి అయినా సరే ఘోర కలితో పోరాడతాను అని శపథం చేసొచ్చావు కదా", అని గుర్తుచేశాడు సంజయ్.
"మన చేతిలో ఏం లేదు, అభిజిత్. ఫైట్ చెయ్యాల్సిందే", అంటూ భయం నటిస్తూ అంది అంకిత.
"తప్పదా?" భయంగా అడిగాడు అభిజిత్.
"అసలు ఇక్కడ ప్రొసీజర్ ఏంటి సర్? ఆ యోధుడిని సింహాలు ఏ బేసిస్ మీద సెలెక్ట్ చేసుకుంటాయి ?" అని రుద్రసముద్భవను అడిగాడు అభిజిత్.
"యోధుడిని అవే ఎంచుకుంటాయి. అందుకోసం అవి పెట్టుకునే ప్రమాణాలేంటో మాకు కూడా తెలియదు. జటిలలోని అతిపెద్ద రహస్యం అది. ఇక్కడ మొత్తం 8 సింహాలుంటాయి. ఇంతవరకు నేను 5 సింహాలను ఒకేసారి చూసాను. నీ అదృష్టం బావుంటే 8 సింహాలనూ చూస్తావేమో", అంటూ నవ్వుతూ చెప్పాడు రుద్రసముద్భవ.
అభిజిత్ షాక్ తిన్నాడు.
జటిల చూడటానికి ప్రాకారంలా ఉండదు. ఎండు గడ్డి మొలిచిన నేలపై దూరం నుండి సూర్యుని కాంతితో ఎదురుగా ఎనిమిది పర్వత శ్రేణులతో మధ్యలో మూసి వున్న ఒక సింహ ద్వారంతో కళ్ళకు గంభీరంగా ఉంటుంది.
"ఆ మధ్యలో ఉన్న పెద్ద డోర్ మూసేసి ఉందేంటి?" అని అభిజిత్ రుద్రసముద్భవను అడిగాడు.
"జటిలలో జయించిన పిమ్మట ఆ ద్వారం తెరుచుకుంటుంది", అన్నాడు రుద్రసముద్భవ.
"లేనిచో?" అని భయపడుతూ అడిగాడు అభిజిత్.
"శంభలలో లేనిచో, కానిచో అను పదాలకు చోటు లేదు అభిజిత్. జటిలలో నీ ఆగమనమే నీ విజయానికి సంకేతం", అనేశాడు రుద్రసముద్భవ.
"ఇలాంటి సమయంలో సిద్ధపురుషుడు పక్కనే ఉండుంటే ఎంత బావుణ్ణు", అని మనసులో అభిజిత్ అనుకున్నాడో లేదో ప్రత్యక్షం అయ్యాడు ఆయన.
"స్వామీ!" అని ఆశ్చర్యపోతూ, "ఇప్పుడు నేనేం చెయ్యాలి?" అని అడిగాడు.
"జటిల నీ సాహసానికి, నీ లోని పరాక్రమానికి అంతిమ పరీక్ష. కొన్ని ఘడియల తరువాత ఇక్కడ 5 సార్లు గంటలు మోగుతాయి. 5 వ గంట మోగిన మరుక్షణమే సింహాలు కదిలి వస్తాయి. నువ్వు నిజమైన యోధుడివైతే 8 సింహాలొస్తాయి. అవి నిన్ను ఆటపట్టిస్తాయి. వాటితో పాటు తీసుకెళతాయి. అవి వచ్చే వరకే నీలోని సంశయాలు, భయాలు. ఒక్కసారి వాటిని చూసాక నీ ధైర్యం వెయ్యి రెట్లు పెరుగుతుంది. నీ మనోబలం నీకు తెలుస్తుంది. అక్కడ కనిపించే ఎనిమిది పర్వత శ్రేణులలో నీకు ఆ సింహాలు పరాక్రమాన్ని పరిచయం చేస్తాయి. ఎంతో కఠినమైన శిక్షణ లభిస్తుంది. అది పూర్తి చేసిన పిమ్మట ఎదురుగా కనబడే సింహద్వారం తెరుచుకుంటుంది. ఆ తలుపులు తెరుచుకున్నాయంటే నువ్వు జటిలను దాటినట్టే. విజయోస్తు", అని చెప్పి సిద్ధపురుషుడు అదృశ్యమైపోయాడు.
సూర్యుని మేలిమి కాంతి ఎక్కువయింది. ఎండు గడ్డి మీద బంగారు కిరణాలు పడుతూ ఆకాశం బంగారు వర్ణంలో ఉండగా ఎదురుగా ఉన్న పర్వతాల నుండి గంటలు మోగుతున్నాయి.
మొదటి గంట మోగింది.
సింహం గర్జన వినబడింది. సింహం పరుగు కళ్ళకు కట్టినట్టుగా అంత దూరం నుండే కనిపిస్తోంది. ఆ పరుగులో ఉన్న శక్తికి మనలోని దుర్గుణాలు ఎగిరిపోతాయి. ఆ గర్జన చెవిన పడంగానే మనలోని సంశయాలు తొలగిపోతాయి. ధైర్యం హుంకరిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. సింహం అంత దూరం నుండే అభిజిత్ ని మాత్రమే చూస్తూ వస్తోంది. అభిజిత్ కూడా సింహాన్నే చూస్తున్నాడు. కళ్ళల్లో ఎక్కడా క్రూరత్వం లేదు. రాజసం అణువణువునా నిండిన దైవీ శక్తి గల పార్వతీ దేవి వాహనంలా అనిపించింది. సింహం అభిజిత్ ని సమీపించగానే సంజయ్, అంకిత కాస్త టెన్షన్ పడ్డారు. రుద్రసముద్భవ సైగ చేసి వాళ్ళను వారించాడు. అభిజిత్ సింహాన్నే చూస్తున్నాడు. సింహం అభిజిత్ కళ్ళల్లోకి తీక్షణంగా చూస్తోంది.
అభిజిత్ చుట్టూ తిరుగుతూ సింహం చూస్తోంది. అభిజిత్ ఏ మాత్రం బెదరలేదు. సింహం కాసేపు ఆగి ఒక్క ఉదుటున అభిజిత్ పైకి ఎగిరింది. అభిజిత్ వెంటనే తనకు బాగా తెలిసినవాడిలా సింహపు గోర్లు తనకు తగలకుండా సింహం మెడను పట్టుకుని తన తలను సింహం నుదుటికి తాకిస్తూ జూలు పట్టుకున్నాడు. వెంటనే ఆ సింహం పట్టు విడిపించుకుని ముందుకెళ్లి గట్టిగా హుంకరించింది.
అవన్నీ అభిజిత్ ని చుట్టుముట్టగా మొదటి సింహం మాత్రం ముందుకు పరిగెడుతూ అభిజిత్ కు దారి తెలిసేలా పర్వత శ్రేణుల వైపుగా వెళుతోంది. అభిజిత్ దాన్నే అనుసరిస్తూ వెళుతున్నాడు. అభిజిత్ ను అనుసరిస్తూ ఈ ఏడు సింహాలు వెళుతున్నాయి. అభిజిత్ పర్వత శ్రేణులను చేరుకోగానే రెండో గంట ఆగిపోయింది.
దూరంగా కనబడుతున్న సంజయ్, అంకిత లకు చేత్తో సైగ చేసాడు. వాళ్ళు కూడా తిరిగి చేతులు ఊపుతూ సైగ చేశారు.

ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ