Thread Rating:
  • 91 Vote(s) - 2.41 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy క్రిష్ :: కాలేజ్ బాయ్ (అయిపొయింది)
115. బయట ప్రపంచం






నిషా అక్కడే ఉండి అవమాన పడలేక బయటకు వచ్చేసింది. లోపల నుండి ఇంటర్వ్యూయర్ కూడా అదే వేగంగా వచ్చి నిషా చేయి విసురుగా పట్టుకొని "ఎక్కడికే వెళ్తున్నావ్... ఆఫర్ లెటర్ ఇస్తా అందుకోవె..." అంది.

నిషా నొప్పికి "ఆహ్" అని అరుస్తూ ఇంటర్వ్యూయర్ తో "వదులు" అని అడిగింది. ఇంటర్వ్యూయర్ చేతులు గట్టిగా పట్టుకోవడంతో నిషా చేతి గాజులు పగిలి గుచ్చుకున్నాయి. 

బాధగా అనిపించి "అమ్మా" అని అరిచింది. తన చేతిలోని సర్టిఫికెట్స్ కింద పడ్డాయి. అవి తీసుకుంటూ ఉంటే... కొన్నింటి పై ఇంటర్వ్యూయర్ కాలు పెట్టి తొక్కింది. 

అది చూస్తూ ఉంటే.... కళ్ళ వెంట నీళ్ళు తిరిగాయి.

ఆఫీస్ లో అందరూ వాళ్ళను చూస్తూనే ఉన్నారు. ఎవరూ ముందుకు రావడం లేదు.

ఇంటర్వ్యూయర్ ఇంకా శాడిజంలా మాట్లాడుతూ "ఇది పెద్ద కేసు.... కాలేజ్ లో ఉన్నప్పుడు చాలా కధలు పడింది.... మేం... తప్పు అని చెప్పాం అని..... మా మీద ర్యాగింగ్ కంప్లయింట్ యిచ్చింది. తర్వాత పెళ్లి చేసుకుంది. దీని కధలు తెలిసి వాడు జాగ్రత్త పడి విడాకులు ఇచ్చి పారి పోయాడు... ఇప్పుడు జాబ్ కావాలని వచ్చింది... నీ లాంటి బిచ్ ఇక్కడ పని చేస్తే.... ఇక్కడ అందరి కాపురాలు కూలిపోతాయ్..." అంది.

అందరూ తనని చూస్తూ మాట్లాడుకుంటూ ఉంటే ఇబ్బందిగా అనిపించి ఆ ఇంటర్వ్యూయర్ కాలి కింద ఉన్న సర్టిఫికేట్ తీసుకొని అక్కడ నుండి వీలు అయినంత తొందరగా బయటకు వెళ్లిపోవాలని అనుకుంది.

నిషా కళ్ళు తుడుచుకొని "నా.. నా.. నా సర్టిఫికేట్..." అంది.

ఇంటర్వ్యూయర్ "నీకూ ఎందుకె సర్టిఫికేట్స్... ఎదో చదివి పాస్ అయినట్టు.... లేక్చిలర్స్ దగ్గర పడుకొని తెచ్చుకున్న మార్క్స్ కదా" అని కాలు దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ చేతుల్లోకి తీసుకొని విసిరి నిషా మొహాన కొట్టింది.

నిషా వాటిని తీసుకొని సర్దుకుంటుంది.

మరో ఇంటర్వ్యూయర్ "దీన్నీ నేను వేరే వాడి బైక్ మీద చూశాను...." అంది.

ఇంటర్వ్యూయర్ "అవునా.... " అని నిషా వైపు చూసి "ఎవరే అది" అంది.

నిషా తల వంచుకొని సర్టిఫికెట్స్ సర్దుకుంటూ వాటికి అయిన కాలు బూటు మరకలు తుడుచుకుంటూ ఉంది.

ఇంటర్వ్యూయర్ ముందుకు వచ్చి నిషా కాలర్ పట్టుకొని "ఎవరే అది చెప్పవే..." అంది.

నిషా "ఆహ్...." అని అరిచి చొక్కా పట్టుకొని దీనంగా ఇంటర్వ్యూయర్ వైపు చూసింది.

ఇంటర్వ్యూయర్ గట్టిగా లాగితే చొక్కా చినిగిపోతే అందరి ముందు తన బ్రా కనిపిస్తుంది.

తన అక్క గాని, క్రిష్ గాని తన పక్కన ఉండి ఉంటే ఇలా ఉండేది కాదు. తన అసహాయతకు తనని తానె తిట్టుకుంది.

ఇంటర్వ్యూయర్ అనుకున్న పని చేసేసింది. కాలర్ గట్టిగా లాగడంతో రెండు గుండీలు చిరిగి బ్రా బయటకు కనిపించింది.

నిషా రెండు చేతులు హార్ట్ దగ్గర పెట్టుకొని బాధగా ఫీల్ అయింది. చుట్టూ అందరూ చూస్తున్నారు కాని ఎవరూ తనకు సహాయానికి రావడం లేదు.



కాజల్ "చూడు నిషా.... బయట ప్రపంచం అంత మంచిది కాదు... అందులోనూ.... విడాకులు తీసుకున్న ఆడది అంటే అందరికి చిన్న చూపే... నువ్వు జాబ్ చేయాల్సిన పని లేదు నేను చూసుకుంటా...." అంది.

నిషా "నన్ను ప్రయత్నించ నివ్వు అక్కా...."

కాజల్ "సరే నీ ఇష్టం.... నీకూ నచ్చక పోతే.... వెంటనే మానేసేయ్... నీకూ నేను ఎప్పటికి ఉంటా..."

నిషా "థాంక్స్...." అని అక్కని హాగ్ చేసుకుంది.

కాజల్ "నువ్వు బాధ పడితే నేను తట్టుకోలేను" 









[Image: istockphoto-1020501548-612x612.jpg]

[+] 12 users Like 3sivaram's post
Like Reply


Messages In This Thread
RE: కాల్ బాయ్ క్రిష్ - by 3sivaram - 13-07-2024, 06:47 PM



Users browsing this thread: 25 Guest(s)