Thread Rating:
  • 3 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అదృశ్య మందిరం - శంభల రాజ్యం – 10
నా స్థానంలో ఉంటే నువ్వేం చేస్తావురా? ఒక అమ్మలా ఆలోచించి చెప్పు", అని బాధపడుతూ అంది కపాలిని దేవి.
 
"బిడ్డ ఏది కోరినా అమ్మ అది తీర్చాలి. అది అమ్మ బాధ్యత. మంచైనా చెడైనా దాని పాపపుణ్యాలతో అమ్మకు సంబంధం లేదు. ఇదే సృష్టి ధర్మం", అని నిర్మొహమాటంగా చెప్పేసాడు ఘోర కలి.
 
"బిడ్డ కోరాడు కదా అని చెప్పి ప్రపంచం నాశనం అయిపోతుంటే చూస్తూ ఊరుకోవాలా?" అని అడిగింది కపాలిని దేవి.
 
"ఊరుకోవాలి", అన్నాడు ఘోర కలి.
 
"ఏమిటి దానర్థం?" అని కోపంగా చూస్తూ అడిగింది కపాలిని దేవి.
 
"ఇదంతా నీ సృష్టే తల్లీ! నువ్వు అందరికీ అమ్మవు. నేను అడిగింది నీకు నచ్చలేదు కాబట్టి అదివ్వను అంటున్నావ్. అంటే నీకు నచ్చినవే బిడ్డలు అడగాలా? వారి ఇష్టాయిష్టాలు వారికుండవా? చెప్పు తల్లీ ", అని బాధపడుతూ అడిగాడు ఘోర కలి.
 
"ఇష్టపడిన ప్రతిదీ ఇస్తూ పోతే అది వినాశనానికి దారి తీస్తుంది. కాదంటావా?" అని అడిగింది కపాలిని దేవి.
 
"నీ సృష్టి పట్ల నీకే అంతటి మోహం ఉంటే ఇక అల్ప జీవులం మాకెంత మోహం ఉంటుంది తల్లీ", అని తన సందేహాన్ని బయటపెట్టాడు ఘోర కలి.
 
"నాది మోహం కాదురా", అంటూనే,"సరే నీకు నచ్చినట్టే చెయ్యి. కానీ ఒక షరతు", అంది కపాలిని దేవి.
 
"అదేంటో విన్నవించు తల్లీ", అంటూ రెండు కళ్ళూ పెద్దవి చేసి అమ్మ వైపు ఆశగా చూస్తున్నాడు ఘోర కలి.
 
"ప్రతి రోజూ సాయంసంధ్యా సమయంలో 10 ఘడియలు నిరంతరాయంగా నా నామావళి జపిస్తేనే నీకీ ప్రపంచం పైన ఆధిపత్యం నిరవధికంగా కొనసాగుతూ ఉంటుంది. అలా జరగని మరుసటి రోజే నీ చరమాంకం. ఇదే నా ఆన" అనేసి అంతర్ధానం అయ్యింది.
 
అక్కడి నుండి పది యోజనాల దూరంలో ఉన్న గుహలో కపాలిని దేవి అమ్మవారి నామావళి రాతిగోడలపై వెలుగుతూ కనిపిస్తుంది. ప్రతీ నామం చివర నమః అని మాత్రం ఉండదు. కపాలిని దేవి వినూత్నమైన పేర్లు మాత్రమే కనిపిస్తాయి. వాటినే అక్షర దోషం లేకుండా జపించాలి. ఒక్క సారి నోరారా ప్రతి నామాన్ని పఠిస్తే స్మృతిలో అవే గుర్తుండిపోతాయని అక్కడ రాసి ఉన్నది.
 
అక్కడే యంత్రం ఉన్నది. అందుకు కావలసిన తంత్రాన్ని అందించేందుకు ఒక వృద్ధ యోగి ఘోర కలిని, సురాని చూస్తూ అక్కడే ఉన్న చెట్టు కింద ధ్యానంలో ఉన్నాడు.
 
ఘోర కలి కపాలిని దేవి నామావళి మొత్తం పఠించాడు. ప్రతీ నామం ఇప్పుడు తేనె  కంటే మధురంగా అనిపిస్తోంది. గుహ నుండి బయటకు రాగానే మొహములో తేజస్సు రెట్టింపు అయ్యింది. వృద్ధ యోగి కూడా కన్నార్పకుండా ఘోర కలినే చూస్తూ ఉన్నాడు.
 
తంత్రం ఘోర కలి మననం చేస్తూ ఉంటాడు. యంత్రాన్ని మాత్రం సురా ఇక్కడి నుండి తీసుకెళ్లి ఎదురుచూస్తోన్న వైద్య బృందం వద్దకు తీసుకెళతాడు.
 
ఘోర కలి తంత్రం, సురా యంత్రం, వైద్య బృందం శాస్త్రం మూడూ ఒకేసారి పని చేసి పది దేశాల నుండి వచ్చిన పదిహేను మంది బోర్డు డైరెక్టర్ లనూ ఘోర కలి రూపంలోకి మార్చేస్తాయి. ఘోర కలిని ప్రపంచానికి రారాజును చేస్తాయి. ఇప్పుడు ఘోర కలి  కామరూపధారి కూడా అవుతాడు. అంటే తను కోరుకున్న రూపంలోకి మారగలిగే విద్యను కూడా కలిగినవాడని అర్థం.
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 6 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: అదృశ్య మందిరం - శంభల రాజ్యం – 2 - by k3vv3 - 09-07-2024, 04:08 PM



Users browsing this thread: 6 Guest(s)