26-06-2024, 01:57 PM
శంభల రాజ్యం – 2
అనిరుద్ధుడి ఆగమనం – ఆదేశం
శంభల రాజ్యాధిపతి అనిరుద్ధుడు. ఆయన మహా విష్ణు భక్తుడు. భూలోకవాసులలో విష్ణువును అత్యంత భక్తితో కొనియాడిన అన్నమయ్య, త్యాగరాజు వంటి వాగ్గేయకారుల సంకీర్తనలు నిత్యం వింటూ కన్నీటి పర్యంతం అవుతూ ఉంటాడు. ఆయన భూలోకవాసులను ఇంతవరకు కలిసింది లేదు. మొదటి సారి సిద్ధపురుషుడి మీదున్న నమ్మకంతో అభిజిత్, అంకిత, సంజయ్ లను కలుస్తున్నాడు. సిద్ధపురుషుడు శ్వేతద్వీప వైకుంఠ వాసి. సిద్ధపురుషుడి గురించి ముల్లోకాలలో తెలియని వారు లేరు. అంత గొప్ప విష్ణు భక్తుడు. సమర్థ రాఘవుడు అనే పేరుతో చివరి జన్మలో నామధేయాన్ని సార్థకం చేసుకున్న తెలివైన మంత్రివర్యుడు. అతని మాటకంత విలువుంది.
అనిరుద్ధుడి దినచర్య రోజూ పొద్దున్నేఎన్నో సేవలతో విష్ణు మూర్తికి పూజలు చెయ్యటంతో మొదలవుతుంది. అటు పిమ్మట సర్వలోక రక్షకుడైన ఈశ్వరుణ్ణి వేడుకుంటాడు. కావ్యాలెన్నో చదువుతాడు. యుద్ధవిద్యలెన్నిటినో పర్యవేక్షిస్తాడు. శంభల రాజ్యం చాలా తెలివైనవారిని సైతం మాయకు గురి చేసే లోకం. ఇక్కడి మగువలకు ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది. అందులో ఒక మర్మం దాగుంది. యుద్ధం జయించాలంటే ప్రతి క్షణం గెలుపు మీదనే దృష్టి నిలపాలి. ఆ దృష్టిని తమవైపుకు తిప్పుకునే శక్తి పుష్కలంగా కలవారు శంభల రాజ్యం లోని సౌందర్యవతులు. వీరికున్నఅపురూప లావణ్యంతో చూపులను బంధించి వేస్తారు. వీరు నిత్య యవ్వనంతో అలరారే స్త్రీ శక్తి కలవారు. యుద్ధవీరుల గురించి వీరి ద్వారా సేనాధిపతికి ఎప్పటికప్పుడు సమాచారం వెళ్తుంది. వీరికి సంబంధించిన రహస్యం ఒకటుంది. అనిరుద్ధుడికీ, మంత్రికి, సేనాధిపతికి తప్ప శంభల రాజ్యంలో మరెవరికీ తెలియదది.
అనిరుద్ధుడి ఆజ్ఞను అనుసరించి సిద్ధపురుషుడు అభిజిత్, అంకిత, సంజయ్ లతో శంభల రాజ్యంలోని ఆస్థానంలో ఆయన రాకకై ఎదురుచూస్తూ ఉన్నారు. సరిగ్గా అదే సమయంలో అక్కడ దుందుభి మ్రోగింది. జయజయ ధ్వానంలా వినిపించే ఆ భేరి అనిరుద్ధుడి రాకను సూచిస్తుంది. అందుకు చిహ్నంగా సభలోని ప్రతి ఒక్కరూ లేచి నిల్చున్నారు. అందరి కళ్ళూ ఆయన పైనే ఉన్నాయి. రాజే రాజ్యానికి రవి అనిపించేలా ద్వారాలు తెరుచుకోగానే కిరణాలు చుట్టూ పరివారంలా ఉండగా మధ్యలో నక్షత్రంలా వెలిగిపోతూ వస్తున్నాడు అనిరుద్ధుడు. ఆయన చిరునవ్వు చూస్తే చాలు మనం గెలిచేసినట్టే అన్నట్టు ఉంటుంది. ఆయన నవ్వు మన హృదయ సామ్రాజ్యాన్ని ఎప్పుడు ఆక్రమించిందో తెలిసేలోపే మన మోముపై చిరునవ్వు వెల్లివిరుస్తుంది. అది ఆయన ఘనత.
ఎంతో తెలిసినా ఏమీ తెలియనట్టు ఉంటాడనిపిస్తుంది. ఎంత తెలిసినా ఇంకేదో తెలుసుకుంటూనే ఉంటాడనిపిస్తుంది. ఎన్నో యుద్ధాలను చూసిన చిరుతపులి కళ్ళలా ఆయన కళ్ళు మెరిసిపోతూ ఉంటాయి. ఎంతో మందిని మట్టికరిపించిన చేతులలా అనిపిస్తాయి. ఆయన ఠీవి చూస్తే ఎక్కడా లేశమాత్రమైనా అహం కనబడదు. పైగా ఆభరణంలా అనిపిస్తుంది. ఆయన రాజసం చూస్తే అది ఆయన మకుటంలా మెరిసిపోతూ ఉంటుంది. ఆయన ఎప్పుడెప్పుడు మాట్లాడతాడా అనే మన గుండెచప్పుడు మనకే ఆ ఆస్థానంలో ప్రతిధ్వనిస్తూ వినబడుతూ ఉంటుంది. అంతటి మౌనం నెలవై ఉంటుందక్కడ. అది ఆయన మహిమ. నీలివర్ణంలో ఉన్న పట్టు వస్త్రముతో, మెడలో వైకుంఠ హారము ధరించి వస్తుంటే ఆ శోభతోనే సభ విరాజిల్లుతోందా అన్నట్టుంది.
సింహాసనం పై ఆసీనుడైన అనిరుద్ధుడు తన హావభావాలతో, చేతి సైగతో అక్కడున్న మంత్రికి ఏదో చెబితే మంత్రి మర్యాదపూర్వకంగా సిద్ధపురుషుణ్ణి మాట్లాడవలసిందిగా కోరాడు.
సిద్ధపురుషుడు, "ప్రణామములు అనిరుద్ధా, మీరు ఈ రోజున ధృవ నక్షత్రం వలే విష్ణుకాంతితో ధగధగా మెరిసిపోతున్నారు."
మధ్యలోనే సిద్ధపురుషుణ్ణి అడ్డుకున్న అనిరుద్ధుడు, " అందుకు ఒక కారణం ఉన్నది. నేను పూజలో నిమగ్నమై ఉండగా మీ గురించి స్వామివారు అడిగారు. మీరు తేజస్సుతో వెలిగిపోతున్నారని వారికి చెప్పాను. ఆయన నవ్వు నాకు వినిపించింది. రోజూ ఆయనను దర్శించే మీరు ఇంకెంత అదృష్టవంతులో అనిపించింది."
సిద్ధపురుషుడు ఆనందపడిపోతూ,"ఆయన నా గురించి మిమ్మల్ని అడిగారా !"
శ్వేతద్వీప వైకుంఠాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ, "వారు తండ్రివలే వాత్సల్యం చూపిస్తారు. ఆ ప్రేమ రుచి చూసినవాడికి వదిలిపెట్టి వెళ్ళబుద్ధి కాదు. వారి ఆజ్ఞను అనుసరించే ఇంత దూరం వచ్చాను. వారిని నేనెప్పుడూ మరిచిపోలేదు."
అనిరుద్ధుడు అందుకుని," మరిచిపోలేరు. వారి దర్శనభాగ్యం నాకు కలుగుతుందో లేదో తెలియదు కానీ వారిని చూసిన మిమ్మల్ని నేరుగా ఇలా కలుసుకోవటం నన్నెంతో భక్తిపారవశ్యానికి గురి చేస్తోంది" అంటూ ఆయన సింహాసనం పై నుండి లేచి సిద్ధపురుషుడి వద్దకు నడుస్తూ వచ్చి ఆయనకు శిరస్సు వంచి అభివందనం చేసి తిరిగి తన పీఠాన్ని అధిష్టించారు.
సిద్ధపురుషుడు, "భూలోకంలో ఘోరకలి ఆధిపత్యం చేపడతాడు. ఘోరకలిని అడ్డుకోవాలంటే శంభల రాజ్యం లోని యుద్ధవిద్యలలో వీరు రాటుదేలాలి", అంటూ అభిజిత్, అంకిత, సంజయ్ లను పరిచయం చేసాడు.
"శంభల రాజ్యంలోని వీరులు కొందరు మాకు కావాలి. వారు లేనిదే ఘోర కలిని ఎదిరించలేము. మీ సైన్యం, మీ వ్యూహ రచన, మీ ఆయుధాలు, మీ అస్త్రాలు...ఇలా మీరు ఇవ్వగలిగినది ఏదైనా అది మాకు భాగ్యమే" , అని సిద్ధపురుషుడు ముగించాడు.
"మరి పరాక్రమము?" అన్నాడు అనిరుద్ధుడు.
అభిజిత్ మాట్లాడకుండా ఉండలేకపోయాడు.
"సర్...మీకు మా భూలోకవాసుల గురించి తెలీదు అనుకుంటా. మాకుండేదే పరాక్రమము. చిన్నప్పటి నుండి మేము రాసినన్ని పరీక్షలు ఏ లోకంలోనూ రాసుండరు. ప్రాణానికి తెగించి ఘోర కలితో నేను పోరాడతాను. మీకు కుదిరితే హెల్ప్ చెయ్యండి. లేకపోతే లేదు."

ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ