Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
కల్పతరువు Part - 15
#13
కల్పతరువు - పార్ట్ 6



సత్యలీల ఫోన్ చేసి లాయర్ శరణ్జీత్ ఇంటికి వెళ్ళి, అచల కథను వివరంగా విన్నవించింది. 



“ఏది ఏమైనా అచలకు విడాకులు ఇప్పించాలి సర్, ఖర్చు నేను భరిస్తాను. ” 



లాయర్ చాలాసేపు నచ్చచెప్పాడు. “ఇద్దరినీ కూర్చోబెట్టి కౌన్సిల్లింగ్ ఇస్తే వాళ్ళే సర్దుకుంటారు. అనవసరంగా కుటుంబాలను విడదీయడం అంత సబబుకాదు. " వృత్తి అనుభవాన్ని నెమరు వేశాడు. 



శ్రోత విన్పించు కోలేదు. 



“సర్, స్వేచ్ఛ ప్రతీ జీవి జన్మహక్కు. సంఘంలో ‘భర్త’ అని ఒక పురుషుడికి, ‘భార్య’ అని ఒక స్త్రీకి ‘వివాహం’ అనే అర్హత గల పీఠం ఇచ్చినప్పుడు; వారు వారివారి విధులను సక్రమంగా, క్రమశిక్షణతో ఒకరిపట్ల ఒకరికి ప్రేమ, విశ్వాసం కల్గి వుండాలి. ఇద్దరూ సమఉజ్జీవులుగా జీవనం సాగించాలి. 



అంతేగానీ యిద్దరి మధ్య హింస, బానిసత్వం, మోసం అనబడే బలహీనతలు వుంటే ఎవరికి వారే, వాళ్ళ అర్హతలకు రాజీనామా చేయాలి. కలిసి జీవించలేరు. ఎన్ని కౌన్సిల్లింగ్లు ఇచ్చినా ఆత్మాభిమానం చంపుకుంటూ సమాజం కోసమో, పిల్లల భవిష్యత్ కోసమో రాజీ పడి, ఎవ్వరికీ చెప్పలేక, బాధను దిగమింగుతూ చావలేక బ్రతకాలి. ” 



“ఆచాలదేవికి ఏ దారి చూపిస్తావు మరి?”



“సర్, ఆ విషయం కూడా నేను ఆలోచించాను, నేను హైదరాబాద్ తిరిగి వెళ్లిపోతాను, బంజారా హీల్స్ లోని నా స్థలం కొంత అమ్మేసి, మిగితా స్థలంలో ఒక బుటీక్ తెరుస్తాను. 



అచల వర్కింగ్ పార్టనర్, నేను ఫనాన్సియర్ అండ్ స్లీపింగ్ పార్టనర్. కొంచెం ఎస్టాబ్లిష్మెంట్ అయే వరుకు యిబ్బంది, తరువాత అదే సర్దుకుంటుంది. ”



“సరే, ముందుగా మీ అన్నగారితో చెబుదాము. ” 



లాయర్ మాటకు సరేనంది. 



***



త్యాగి సోమవారం అప్పు పైకము తీసుకున్నాడు, “త్యాగిగారు ఒక్క షరతు.. ”



“చెప్పండి మేడమ్ జీ “



“వచ్చే శని, ఆదివారం సెలవుల్లో టాక్సీ బుక్ చేసుకొని మీరు నాకు హిమాచల్ ప్రదేశాల్ని, ముఖ్యంగా మీ ప్రియురాలిని పరిచయం చేయాలి. ”



“అలాగే, కానీ ఎవరెవరు వస్తారు?”



“నేనూ, నా తరుపున మీ పాప; మీరూ, మీ తపున మీ యిష్టం! ఖర్చు నాది. మీరు గైడ్, సరేనా?”



అమ్మయ్య! అచల లేదు అనుకోని, “సరే, నేనూ, నా బాబు వస్తాం. హిమాచల్ అంతా చూడాలంటే వారమైనా సరిపోదు, కొన్ని అందమైయిన, ముఖ్య ప్రదేశాలకు వెళదాము. కానీ దయచేసి అచలకు మన ప్రోగ్రామ్ తెలియవద్దు. ”



“హిమాచల్ సంగతి చెప్పొచ్చును కదా, మీ ప్రియురాలి సంగతి చెప్పను. ” 



సెలవు తీసుకొని చాలా హుషారుగా త్యాగి వెళ్ళాడు. 



>>>>>>>>>> 



వినయ విధేయతల గల్గి కౌమార దశలో వున్న ప్రజ్ఞకు చేయూత నివ్వాలని నిశ్చయించాడు. వీలుచూసుకొని ఆనంద్కు విషయాన్ని వివరించి కొంత కాలం పాటు రహస్యంగా ప్రజ్ఞకు కూడా తెలియకుండా తోడు వెళ్లమన్నాడు, పరోక్షంగా తండ్రి పాత్ర పోషిస్తున్న కేశవరెడ్డి. 



అంగరక్షకుడి సేవ అనుకున్నంత సులువైన పని కాదు. అందునా అటు మేయర్ కుమారుడు, ఇటు నారాయణసేఠ్. దొందూ దొందే! 



రెడ్డిసేఠ్ చెప్పిన పని చేయక పోతే కడుపులో పేగులు నకనక మంటాయి. 



గొడవ చేసి లాభం లేదు. మన జాగ్రత్తలో మనముండాలి. 



ఆనంద్ టి. వి. యస్. బండి వేసుకొని డ్యూటి చేయసాగాడు. రహస్యం ఎన్నాళ్ళూ నిలువ లేదు. 



“ఆనంద్గారు, ప్రతీ రోజు మీరు నా వెనక పడుతుంటే బాగా లేదు” నచ్చని విషయాన్ని నిక్కచ్చిగా చెప్పింది. 



'అల్లరి చేసే ఆకతాయి మూకను నిలువునా ప్రశ్నించి ఎదురించ లేదు కానీ, నన్ను నిలదీస్తున్నది' పైకి అనే సత్తా లేక మనసు లోనే గొణుక్కున్నాడు. 



“వేరే వుద్దేశ్యం ఏమి లేదు మేడమ్ గారు.. ” అంటూ అసలు విషయం చెప్పేశాడు. 



“సేఠ్లకు భయపడి చేస్తున్నారా?”



“కాదు, సేఠ్ పురామాయించిన పని చేస్తున్నాను. ప్లీజ్ మీరు ఏమి తెలియనట్లుగానే ప్రవర్తించండి. ”



“ఎందుకు?”



“మీ డ్యూటి చేస్తునందుకు ఒక ఇంక్రిమెంట్ వచ్చింది, మా ఇంట్లో మనుషుల సంఖ్య, సంపాదన నిష్పత్తి సరి పాళ్ళల్లో లేదు. మేడమ్, ప్లీజ్. ” 



ప్రాధేయతను మన్నించింది. “నాది కూడా ఒక రెక్వేస్ట్. ” 



“చెప్పండి మేడమ్. ”



“నాకు టి. వి. యస్. వెహికల్ డ్రైవింగ్ నేర్పించాలి. పెద్దవాళ్ళు సమ్మతించరు, కానీ నేను నేర్చు కోవాలి. ఈ విషయం కూడా రహస్యంగానే వుంచుదాము. ”



“నేను డ్రైవింగ్ నేర్పించటము, మీరు నేర్చుకోవటం సమస్య కాదు. సేఠ్లకు తెలిస్తే ఇంతే సంగతులు. 



మీకు అందరి ప్రొత్సహం వుంది. నేను ఆశ్రయం కోరి వచ్చిన వాడిని, ఫలితం ఎలా వున్నా, నా పైన అపవాదు రావద్దు. ”



“చాలా జాగ్రత్త మనిషివి, అలాగే, నేను హామీ ఇస్తున్నాను. ”



కృషి వుంటే మనుషులు ఋషులౌతారు, మనఃస్పూర్తిగా ఏ పని సాధన చేసినా గెలుపు తథ్యం!



***



గృహకల్ప సూపర్ బజార్ ప్రక్కనే బట్టల దుకాణం ఓనర్ నష్టాల తాకిడికి తట్టుకోలేక రాత్రికి రాత్రే మూటా-ముల్లె సర్దుకునే సమయానికి, ఆనంద్ పసికట్టి, ఇద్దరి సేఠ్ల చెవిన వూదేశాడు. 



భాగస్వాములిద్దరూ సునాయాసంగా బట్టల షాపును తక్కువ రొక్కానికి సొంతం చేసుకున్నారు. ఆనంద్ సమయస్పూర్తికి ఎంతో మెచ్చుకున్నారు. పర్యవసానంగా జీతం ద్విగుణీకృతమైంది. 



ప్రజ్ఞ ఇంటర్ హుమానిటీస్ గ్రూపులో పూర్తి చేసి, డిగ్రీ జాయిన్ అయింది. 
====================================================================ఇంకా వుంది..
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply


Messages In This Thread
కల్పతరువు Part - 15 - by k3vv3 - 04-05-2024, 02:15 PM
RE: కల్పతరువు - by sri7869 - 04-05-2024, 10:20 PM
RE: కల్పతరువు - by k3vv3 - 10-05-2024, 02:25 PM
RE: కల్పతరువు Part-2 - by k3vv3 - 25-05-2024, 04:51 PM
RE: కల్పతరువు Part-2 - by k3vv3 - 25-05-2024, 05:29 PM
RE: కల్పతరువు Part - 5 - by k3vv3 - 21-06-2024, 01:50 PM



Users browsing this thread: 2 Guest(s)