Thread Rating:
  • 2 Vote(s) - 3.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నాన్నారు-తండ్రుల అంతర్జాతీయ దినం సందర్భంగా
#4
 లైబ్రరీ సదుపాయాల ద్వారా అర్హత అనిపించిన జాబ్స్ అన్నింటికీ ఇద్దరూ దరఖాస్తులు పంపుకున్నారు.
 లక్కో.. అపర్ట్యూనిటో.. ఇద్దరికి వారాల తేడాల్లో జాబులు లభ్యమయ్యాయి. ఇద్దరూ వేరు వేరు ప్రయివేట్ సెక్టార్స్ లో చేరారు.



 అది మొదలు అంచెలంచెలగా స్టామినతో ఎదిగారు.
 పొదుపులతో పొందికయ్యారు.
 కొద్దేళ్లకే.. జాబులు విడిచి.. అప్పటికి కూడదీసుకున్న తమ తమ పొదుపు మొత్తాల్లోంచి చెరో కొంతపాటిని వెచ్చించి.. ఇద్దరూ ఇంటిన ఆన్లైన్ సర్వీసింగ్ తో కూడిన మెస్ ని ఏర్పర్చుకున్నారు. ఇద్దరికి ఉద్యోగం ఇచ్చారు.



 నాన్నారు చొరవతోనే.. తొలినాళ్ల లగాయితు.. ఇద్దరి సంపాదనల్లోంచి చెరో సగం వాటాల్లా ఖర్చులకు తీసి పెట్టుకొని.. మిగిలిన ఎవరి మొత్తాలను వాళ్లు పొదుపు ఖాతాల్లో అమ్మ.. నాన్నారు ఇండ్విడ్యువెల్ గా జమ చేసుకుంటున్నారు. 



 టోల్ గేట్ కానరావడంతో ఆలోచనల్లోంచి బయటికి వచ్చేసాను. కారు ను సడన్ గా స్లో చేస్తూ దానిని అక్కడ ఆపాను.



  కుదుపులకు లక్ష్మి నిద్ర లేచింది.
 "టీ షాప్ దగ్గర ఆపండి. నేను రిప్రెషవుతాను. ఇక నేను కారు డ్రయివ్ చేస్తాను." చెప్పింది లక్ష్మి.
  తర్వాత.. నేను కారు ను దార్లో కనిపించిన టీ షాప్ ముందు ఆపాను.



 లక్ష్మి వాటర్ బాటిల్ లోని నీళ్ళతో ముఖం కడుక్కుంది. 
 ఇద్దరం టీ తాగాం.
 లక్ష్మి డ్రయివింగ్ సీటు ను చేరింది.
 నేను పక్క సీటున కూర్చున్నాను.



 "లంచ్ తర్వాత.. అరగంటైనా పడుకోవాలి. లేదంటే గజిబిజి ఐపోతాను." చెప్పింది లక్ష్మి.



 " నో." అన్నాను. ఐనా లక్ష్మి అదెందుకు చెప్పిందో.



 కారు సాఫీగా పోతోంది.
 "వెదర్ బాగుంది." చెప్పింది లక్ష్మి.



 "." అన్నాను.



 "ఏంటీ.. ప్రతి దానికి పొడి పొడి ఆన్షర్స్. బడలికగా ఉంటే.. వెనుక్కు పోయి కొద్ది సేపు పడుకోండి." చెప్పింది లక్ష్మి.



 "లేదు లేదు. నాకు పగలు నిద్ర పట్టదుగా." చెప్పాను.



 " నో. ఐనా సరే.. వెళ్లి నడుము వాల్చండి. రిఫ్రెష్మెంట్ అందుతోంది." కారు ను స్లో చేస్తోంది లక్ష్మి.



 అంతలోనే.. "సరే. కారాపు." అనేసాను.



 లక్ష్మి కారు పక్కగా ఆపింది.
 నేను వెళ్లి వెనుక సీట్లలో నడుము వాల్చాను.
 కారు కదిలి.. పోతోంది.
 కళ్లు మూసుకున్నాను.
  తడవున.. నాన్నారు ఆలోచనల వైపుకు మొగ్గేసాను.



 ఇద్దరి సమ్మతితో మొదలెట్టిన వాళ్ల బిజినెస్ సరళి.. కొద్ది యేడాదుల తర్వాత.. యేడాది యేడాది వరుసన.. పదుల ఉద్యోగుల నిర్వాహణలతో ఎదుగుతూ.. ఇప్పుడు ఫైవ్ స్టార్ హోటల్ ని నిర్వహిస్తున్నారు.. అమ్మతో కూడి నాన్నారు.



 ఒకరికొకరుగా.. అన్యోన్యంగా.. ఆలంబనగా.. ఆదర్శంగా.. సరళమైన కొనసాగింపు లతో నిటారుగా నిలుస్తున్న.. అమ్మ, నాన్నారుల స్థితి.. ఇలా.. ఇప్పుడు.. కుదుపుగా కలవరం రేపడం ఏమిటి..
 ఉక్కిరిబిక్కిరిలో పడ్డాను. గమ్మున కూర్చున్నాను.
 "ఏంటా గగుర్పాటు." అంటోంది లక్ష్మి. కారు ను స్లో చేస్తోంది. 



 నేను అటు చూసే సరికి.. రెర్వ్యూ మిర్రర్ నుండి లక్ష్మి నన్ను చూస్తోంది.
 కారు ఆపేసింది.
 నేను ఫ్రంట్ సీట్ లోకి మారిపోయాను.
 కారు ముందుకు కదిలింది.
 కొంత దూరం వెళ్లేక.. "ఏం జరిగి ఉంటుందో." అన్నాను.



 ". మీరు ఇంకా అత్తమ్మ, మామయ్యల తలంపులో ఉన్నారా." అంది లక్ష్మి.
 నేనేం అనలేదు.



 "ఏమీ కాదు. మీరు నిశ్చింతుడు కండి. ప్లీజ్." చెప్పింది లక్ష్మి.



 నిముషం పిమ్మట.. మాట్లాడగలిగాను. 
 "భలే మెచ్యూరిటీ.. భళా కన్వెన్సింగ్.. నాన్నారులో నేను చూసాను. అట్టిది ఇప్పుడు ఇట్టిది ఏంటి. ఇద్దరి మధ్య పొరపొచ్చాలు ఎలా ఎగిసాయి." తల పట్టుకున్నాను.



 "ఏమండీ.. కూల్. ప్లీజ్." వెంటనే అంది లక్ష్మి.



  వెంబడే..
 "యు డోన్ట్ నీడ్ టు వర్రీ. డోన్ట్ వర్రీ మి. ప్లీజ్." అంది. తన ఎడమ అర చేతితో నా అర చేతుల్ని నా తల మీంచి తీసింది. తిరిగి తన చేతిని స్టీరింగ్ వైపుకు మార్చుకుంది.



 నేను కదిలి సరిగ్గా కూర్చున్నాను. లక్ష్మినే చూస్తున్నాను.
 లక్ష్మి రోడ్ ను చూస్తోంది.
 కారు సాఫీగా పోతోంది.
 దార్లో కారాపింది లక్ష్మి.
 "దిగండి. స్నాక్స్.. టీ తీసుకుందాం. సాయంకాలం ముగుస్తోంది." చెప్పింది.



 నేను కారు దిగాను.
 ఇద్దరం కేంటిన్ లో ఎదురెదురుగా కూర్చున్నాం.



 ఇచ్చిన ఆర్డర్ రావడంకై వేచి ఉన్నాం.
 "ట్వల్వ్ లోపు ఇంటికి చేరగలమా." అడిగింది లక్ష్మి.



 "మే గో. బట్ స్లోగా వెళ్దాం." అన్నాను.



  వెంబడే..
 "నేను డ్రయివ్ చేస్తా ఇక." చెప్పాను.



 "లైక్ యు.. లైక్ దట్.." నవ్వుతోంది లక్ష్మి.



 అప్పుడే ఇచ్చిన ఆర్డర్ తేబడింది.
 అర గంట లోపునే తిరిగి కారును చేరాం.
 "నువ్వు పడుకుంటావా." అడిగాను లక్ష్మిని.



 "లేదు. కూర్చుంటా." చెప్పింది లక్ష్మి. ఫ్రంట్ సీటులోకి ఎక్కింది.



 నేను డ్రయివింగ్ సీటన చేరి.. కారు స్టార్ట్ చేసాను.
 అప్పుడే అమ్మ నుండి ఫోన్ కాల్ వస్తోంది.
 నేను కారు ను పక్క కు తీసి ఆపేసాను.
 "అమ్మ కాల్." లక్ష్మితో చెప్పుతూనే.. కాల్ కు కనెక్ట్ అయ్యాను.
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: నాన్నారు-తండ్రుల అంతర్జాతీయ దినం సందర్భంగా - by k3vv3 - 16-06-2024, 11:22 PM



Users browsing this thread: