07-06-2024, 02:49 PM
చీకటి నుంచి వెలుగుకు
రచన: C..S.G . కృష్ణమాచార్యులు
మధ్యాహ్నం రెండు గంటల వేళ, వేసవి యెండల తాపానికి తల్లడిల్లుతున్న ప్రజానీకానికి, వూరట కలిగించేలా కారు మబ్బులు, ఆకాశాన్ని కమ్ముకున్నాయి. నిప్పులు చెరుగుతున్న సూర్యుడిని మేఘాలు, చుట్టు ముట్టి, చెరబట్టడంతో, చీకట్లు వ్యాపించడం మొదలైంది. బలంగా వీస్తున్న గాలుల తాకిడికి, రోడ్డుకి అటు, ఇటు వున్న చెట్ల కొమ్మలు వూగుతూ, ఆకులు రాలుస్తున్నాయి.
రహదారులపైన వున్న దుమ్ము పైకి లేవడంతో, ప్రజలు కంగారుగా తలలు వంచి, నడక వేగం పెంచారు. వాన పడేలోగా యిల్లు చేరాలనుకున్న వారి ఆశలు అడియాసలు చేస్తూ, కుండపోతగా వాన పడడం మొదలైంది. రోడ్డు మీద వున్న వారంతా, అక్కడ వున్న షాపుల్లోకి, సిటీ బస్ షెల్టరులోకి పరుగులు తీశారు.
అప్పుడే కారులో అటుగా వస్తున్న రవీంద్ర, బస్ షెల్టరు క్రిందికి చేరిన జనాలకు కొంచెం యెడంగా, పొందికగా నిలుచున్న ఆమెను చూసి, కారునామెకు ఎదురుగా, రోడ్డు ప్రక్కన నిలిపి, " అమ్మా! రండి. ఇంటికి వెడదాం!" అని పిలిచాడు.
ఆమె ఒక నిమిషం తటపటాయించింది. డ్రైవర్ సీట్ నుంచి, ఎడమవైపుకు వాలి, రవీంద్ర ముందు డోర్ తీసి, "రండి" అని మరలా పిలిచాడు.
దాంతో, ఆమె ఒక్క నిమిషం కూడా ఆలశ్యం చేయకుండా కారెక్కింది. ధారగా కురుస్తున్న వానవల్ల, దారి కనబడడం కష్టంగా వుంది. అందువల్ల అతడు, కారుని మెల్లగా పోనిస్తూ, " మీకు అవసరమైన పనేమీ లేదుగా?" అని అడిగాడు.
అందుకామె, " ఏమీ లేదు, జాగ్రత్తగా వెళ్ళండి" అంది.
"అండి అనకండి. మీ కన్నా చిన్న వాడిని. రవీ అని పిలవండి. నా పేరు రవీంద్ర. గవర్నమెంటు ఆర్ట్స్ కాలేజీలో లెక్చరరుగా పని చేస్తున్నాను. మీ ఇంటి కెదురుగా కుడి వైపు నున్న యింట్లో వుంటున్నాను. "
"చూసాను. నువ్వు వచ్చి ఒక యేడాదయింది కదా ? నువ్వు మంచివాడివని నీ ఇంట్లో పనిచేసే అవ్వ చెప్పింది. నీకు మీ కాలేజిలో కెమిస్ట్రీ లెక్చరర్ కల్యాణీ తెలుసా?"
"బాగా తెలుసు. నాకు సీనియర్. నేను కూడా కెమిస్ట్రీ డిపార్టుమెంటులోనే పనిచేస్తున్నాను. ఆమె నన్నొక తమ్ముడిలా చూసుకుంటారు. "
" ఆమె నా ఫ్రెండ్. ఒక సారి మాటల సందర్భంలో నీ ప్రస్తావన వచ్చింది. నువ్వు మా వీధిలోనే వున్నావని, యోగ్యుడైన బ్రహ్మచారివని చెప్పింది. అంతే కాదు, మంచి పెళ్ళి సంబంధాలుంటే చెప్పమంది"
ఆమె మాటలకు రవీంద్ర సిగ్గు పడి, టాపిక్ మార్చే ప్రయత్నం చేసాడు, .
"అక్కకి నా పెళ్ళి గురించే కలవరింత. మీరు కాలేజ్ టీచరు గదా!"
" అవును. మన వీధికి, రెండు సందుల ఆవల వున్న బాలికల హైకాలేజీలో పనిచేస్తున్నాను"
వాన ధాటి పెరగడంతో రవీంద్ర మాటలు ఆపి, డ్రైవింగ్ మీద దృష్టి పెట్టాడు. పది నిమిషాల తర్వాత, ఆమె ఇంటి ముందు కారునాపాడు. ఆమె రవీంద్రకు ధన్యవాదాలు తెలిపి, లోనికి వచ్చి కాఫీ త్రాగమని ఆహ్వానించింది. ఆ పిలుపుకోసం యెదురు చూస్తున్నవాడిలా, రవీంద్ర " అలాగే నమ్మా", అని కారు ఒక ప్రక్కగా పెట్టి, ఇంట్లోకి వెళ్ళాడు.
@@@
హాలు విశాలంగా, శుభ్రంగా వుంది. మధ్యతరగతి గృహాల్లో వుండే సోఫా, టీవీ, పూల వాసే, వున్నాయి. అవిగాక, ఒక అలమర నిండా పుస్తకాలున్నాయి. ఒక ప్రక్క గోడకి, రెండు ఫోటోలు తగిలించి వున్నాయి. పూల దండలతో అలంకరింపబడిన ఆ ఫోటోలలో ఒక యువకుడు, ఒక మధ్యవయస్కుడు వున్నారు. రవీంద్రకు ఆమె ఒంటరి జీవితానికి కారణం అర్ధమైంది. ఇంతలో ఆమె ఒక ట్రేలో రెండు కాఫీలు, బిస్కట్లు తీసుకువచ్చింది.
"నా పేరు తేజస్విని. రెండేళ్ళ క్రితం నా భర్త సుందర్రావు, నా కొడుకు రమేష్, ఒకే సారి మరణించారు. " ఆ మాటలు చెప్పేటప్పుడు ఆమె భావోద్వేగానికి గురైంది. ఒక్క నిమిషం తర్వాత, ఆమె తెప్పరిల్లి, " కాఫీ తీసుకో. ఎంత వద్దనుకున్నాగుండె బరువెక్కి కన్నీళ్ళు వర్షిస్తుంది. ప్రేమ పంచిన జీవిత భాగస్వామి ఒకరైతే, ప్రేగు తెంచుకుని పుట్టిన బిడ్డ మరొకరు."
"సారీ అమ్మా! ఇంత విషాదాన్ని మోస్తూ, ఇలా ఒంటరిగా జీవించవలసి రావడం నిజంగా దురదృష్టమే"
"గత జన్మలో ఏ పాపం చెసానో, నా నుదుట దేవుడిలా వ్రాసాడు" అంటూ ఆమె ఒక కాఫీ కప్పు రవీంద్ర కందించి, తనొకటి తీసుకుంది.
ఒక అయిదు నిమిషాల పాటు నిశ్శబ్దం రాజ్యమేలింది. కాఫీ తాగిన తర్వాత, కొంచెం సందేహిస్తూనే, రవీంద్ర ఆమె నడిగాడు.
"వారిద్దరూ యెలా చనిపోయారు? యాక్సిడెంటా? మీ కభ్యంతరం లేకుంటే చెప్పండి. "
"చెప్పడానికి అవమాన భారమే అభ్యంతరం. అయినా నీకు చెప్పాలనిపిస్తోంది. బహుశా నీవు నా కొడుకు వయసు వాడివి కావడం వల్లననుకుంటా. ఈ విషాదానికి కారణం నా కన్న కొడుకు రమేష్.
నేను, నాతో పాటు ఇంకో జీవి వాడి దుశ్చర్యకు అనాధలమయ్యాము. ఆ సంగతి జ్ఞప్తికి వచ్చినప్పుడు, అవమానభారంతో తలదించుకొంటాను. ఒక టీచరునైవుండి కూడా, నా కొడుకుని సరిగ్గా పెంచ లేకపోయానని కుమిలిపోతాను. ".
ఆమె చెప్పటం మాని, గట్టిగా వూపిరి తీసుకుంది. ఆమె కనులలో నీటి పొరలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రవీంద్రలో ఆమె గతం తెలుసుకోవాలనే ఉత్సుకత పెరిగింది. ఆమె మెల్లగా లోగొంతులో చెప్పడం మొదలుపెట్టింది.

ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ