Thread Rating:
  • 3 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అదృశ్య మందిరం - శంభల రాజ్యం – 10
"ఇచట మీరు విశ్రాంతి తీసుకోవలసిందిగా అనిరుద్ధుల వారి విన్నపంరేపు సభనందు మిమ్మల్ని అందరికీ పరిచయం చేసిన పిమ్మట వారు మీతో ఏకాంతంగా చర్చిస్తారుకూలంకషంగా అన్ని విషయాలు అప్పుడు మీకే తెలుస్తాయిఅంతవరకు అలసటకు గురైన మీ మనసుకు ప్రశాంతతనివ్వండి", అని  వేగు అక్కడి నుండి నిష్క్రమించాడు.
 
మంత్రి ఫాలనేత్రుడుసేనాధిపతి రుద్రసముద్భవలు వారి నుండి సెలవు తీసుకుని అక్కడి నుండి వెళ్లిపోయారు.
 
అతిథి గృహం నుండి బయటకు చూస్తే ఎంతో విశాలమైన శంభల రాజ్యం కళ్ళకు దేదీప్యమానంగా కనిపించిందిశంభల రాజ్యాన్ని చూస్తూ సిద్ధపురుషుడు అభిజిత్అంకితసంజయ్ లతో ఇలా చెప్పాడు.
 
 
“శంభల నగరంలో ప్రాకారాలున్నట్టే శంభల రాజ్యంలో కూడా ప్రాకారాలున్నాయికానీ అవి సందర్శించటానికి శంభల రాజ్యాధిపతి అయిన అనిరుద్ధుల వారి ఆజ్ఞ కావాలియుద్ధ సేనాధిపతికి సముచితంగా అనిపించాలిశంభల రాజ్యంలోనివి యుద్ధ ప్రాకారాలుఅంటే ఇక్కడ యుద్ధంలో ప్రయోగించే అనేకానేక వ్యూహాలుఅస్త్రాలుఆయుధాలుసైన్యం ఇలా ఒక వేరే ప్రపంచమే ఉంటుందిక్కడఇక్కడ నేర్పేది యుద్ధ విద్యఇక్కడి వారు బ్రతికేది రక్షించటానికేరక్షించేది బ్రతికించటానికేయుద్ధ నీతి తెలుసురీతి తెలుసువాటిని అతిక్రమిస్తే సంహారం ఇంకా బాగా తెలుసు.
 
ఇక్కడి ప్రతి కన్నూ మిమ్మల్ని  ఒక కంట గమనిస్తూనే ఉంటుందిఇక్కడ ఆలోచనలే శత్రువులువ్యక్తులు కాదుచెడుకిమంచికి వ్యత్యాసం వచ్చేది మన ఆలోచనలోనేఅది చెడ్డ పనైనామంచి పనైనా పడే కష్టం ఒక్కటేఅంతరంగంలో స్వచ్ఛత కోల్పోయినప్పుడు ఎంత గొప్ప పనైనా వృథాగా మిగిలిపోతుందిఅందుకే ఇక్కడ మీకిచ్చే శిక్షణకు మీరు అన్ని విధాలా అర్హులా కాదా అని మంత్రిసేనాధిపతి మిమ్మల్ని పరీక్షించారుభూలోక వాసులను ఘోర కలి నుండి కాపాడటం చిన్న విషయం కాదుఎన్నో యుద్ధ విద్యలలో ప్రవేశం ఉండాలిఎంతో వ్యూహ రచన కావాలిఅవన్నీ మీకందివ్వటానికి మీకొక గొప్ప ఆశయం కావాలిమీలో పవిత్రత నిండి ఉండాలి.
 
 
మరీ ముఖ్యంగాఅవి కడదాకా మీలో అలాగే ఉండాలిఅని చిన్నగా నవ్వుతూ సిద్ధపురుషుడు  అభిజిత్ కళ్ళలోకి చూసాడు.
 
తను ఎవరికైతే చెప్పాలనుకున్నాడో వారికి విషయం బోధపడేలా ఉంటుంది ఆయన చిరునవ్వుఅదొక అస్త్రం అంతే నవ్వు ఒక బాణం లాంటిదిచాలా అరుదుగా సంధించే  చిరునవ్వు మనకు గుచ్చుకుందాఅంతేజ్ఞానం వెల్లివిరుస్తుందికార్యాచరణ కళ్లముందుంటుందిసిద్ధపురుషుడి ద్వారా పెల్లుబికే దైవీ శక్తి అది.
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 6 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: అదృశ్య మందిరం - శంభల నగరం – 10 - by k3vv3 - 05-06-2024, 05:32 PM



Users browsing this thread: 7 Guest(s)