Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
భవిష్యత్తు చోరీ – కథ
#3
 
నీకు అన్నీ చెప్పటానికి నువ్వు నన్ను పోషించటంలేదు, నువ్వు సంపాదిస్తే నేను అలాగే నీ మెస్సెజులు చదువుకుంటూ కూర్చుంటాను. అయినా నీది కామం, ప్రేమ కాదు. ఇది వరికిటి రోజుల్లో రాజులు యుద్ధాలకు వెళితే రాణులు యుగాలయినా నిరీక్షించే వారు. మెసేజులు లేవు అప్పట్లోఅని దురుసుగా మాట్లాడి ఆమె నోరు మూయించాడు.
అతడికి తెల్సు అతను కావాలనే ఆమె మీద కామం అనే ముద్రా వేస్తున్నాడని, కానీ మళ్ళీ భవిష్యత్తులో ఆమె అతడికి అడ్డుపడ కూడదని అలా మాట్లాడాడు.
ఏడుస్తూ వెళ్లిపోతున్న ఆమెను చూస్తూ కోపంగానేను అంత తెలివి కల వాడిని కాదు, అందరి భవిష్యత్తుని చోరీ చేస్తున్నా, చెప్పలేను కదాఅని గొణుక్కున్నాడు.
మెర్సీక్రిస్ తన ప్రేమను కామo అని ఉఛ్ఛరించినందుకు కుమిలి కుమిలి ఏడుస్తూ కురున్నది. ఇన్నేళ్ల నా ప్రేమను అవమానించావు, ఘడి ఘడికి తాకాల అంటావా? అని గుర్తు చేసకోని మరీ ఎడ్చింది. “నీకు బుద్ధులు ముందే ఉన్నాయా లేక నాకు, ఇప్పుడు తెలిసాయ”? అని వాపోయింది.
* * * * *
యశో కు తను ఎన్ని కంపనీలు మారినా సరి అయిన గుర్తింపు రాక, జీతాలు చాలక ఇక్కట్లు పడుతున్నాడు.
ఒక వేళ క్రిష్ సాయం చేస్తాడేమో అని అతడి ఇంటికి బయలుదేరాడు. యశో, క్రిష్ ఇంటికి చేరే సమయానికే, క్రిష్ టైమ్ మషిన్లో నుంచి  దిగుతూ కనబడ్డాడు, యశోకీ.
విచిత్ర వాహనం లా ఉన్న ఒక పెద్ద యంత్రాన్ని అతడు అర చేతిలో పట్టేన్త బంతి లా మార్చి తన ఇంట్లోకి వెళ్ళటం చూసిన యశో కి, ఆశర్యంగా తోచి క్రిష్ కి  తెలీకుండా అతడినే అనుసరించాడు.
ఒక వ్యక్తి భవిష్యత్తుకి వెళ్ళి రికార్డ్ చేసిన జీవితాన్ని సిస్టమ్ లో పెట్టి , ఆమె  బంధాలు, ప్రేమ, కస్టాలు అన్నీ ఎడిట్ చేసి కేవలం ఆమె  ప్రయోగాలు, వాటి తాలూకు ఆలోచనలను ఒక ఫైలు లో  ట్రాన్స్ఫరు చేస్తున్నాడు క్రిష్.
దిమ్మ తిరిగి పోయి నోట మాట రాక అక్కడే నీలుక్కు పోయాడు యశో. ఈలోగా సూపర్ మార్కెట్ బ్యాగు తీసుకొని క్రిష్ బయటకు వెళ్ళటం తో, నిదానంగా  సేవ్ అయిన ఫైలును తెరిచి చూశాడు.
ఒక 18 యేళ్ళ అమ్మాయి, ఫ్త్లెయింగ్ హోమ్ కనిపెట్టింది, 3000 సంవత్సరంలో.
రోజుల్లో సమయ పాలన అతి ప్రాముఖ్యతను సంతరించుకుటుంది. పెరిగిన జనాభా వల్ల కొనటానికి స్థలం దొరకదు. ఎవరు శాశ్వత చోటు ను ఆక్రమించుకోలేరు. శాశ్వత ఉద్యోగాలు లేవు. అందుకే ఎవరు ఎక్కడికి కావాలంటే అక్కడకు వెళ్లిపోవచ్చు. తద్వారా ఇల్లు మార్పిడి ఖర్చు చాలా పెరిగి పోయింది. అందుకు ఒక అమ్మాయి ఆకాశం గుండా  ఇంటి తో సహ  ప్రయాణం చేసి సురక్షితంగా తమ గమ్యాలను చేరుకునే లాగా ప్లయింగ్ హోమ్ కనిపెట్టింది.
ఇది చదివిన యశో అక్కడ ఉన్న అన్నీ పెన్ డ్రైవ్ లను చూశాడు. అందులో తన డిసైన్స్ కూడా ఉన్నాయి. అప్పుడు అర్థం అయింది అతడి విజయ రహస్యపు దొడ్డీ దారి.
కోపం తో రగిలిపోయి అక్కడ బంతిలా ఉన్న టైమ్ మషిన్ ను, క్రిష్ స్నానపు టబ్ లో వేసితునా తునకలు చేసీ వెళ్ళిపోయాడు యశో.
* * * * *
పగిలి పోయిన టైమ్ మషిన్ ముక్కల్లో తన భవిష్యత్తుని చూసుకొని క్రిష్ విల విల లాడి పోయాడు. దీనిని నమ్మి అందరి దగ్గర అడ్వాన్సులు కూడా తీసుకున్నాడు. ఇప్పుడు వాటిని ఎలా ఆచరణలో పెట్టాలో తెలీక తన వెంట పడే క్లైంట్ల ఫోన్లను కూడా రిసీవ్ చేసుకోవటం మానేశాడు అతడు.
ఉన్న బాకీలు తీర్చలేక ఒక్కో ఆస్తిని అమ్మ వలసి వచ్చింది. తిరిగి మామూలు పరిస్డితికి చేరుకున్నాడు. మెర్సీకి కాల్స్ చేశాడు. కానీ ఆమె కూడా ఎత్తక పోతే ఇంటికి నేరుగా వెళ్ళాడు, కానీ ఆమె అక్కడ కూడా లేకపోవటంతో వెను తిరిగాడు.తన సొంతంగా ప్రయోగాలు చేసి ఓడిపోయాడు.
అదే సమయంలో యశో సొంతంగా ఆటో మొబియల్స్ కార్ డిజైనింగ్ యూనిట్ ఒకటి స్థాపించి ముందడుగు వేశాడు. యాధృచ్చికంగా మెర్సీ అతడి కంపనీలో చేరటం, క్రిష్ గురించి తెలియటం జరిగింది యశోకీ. ” వీడు ఎవరినీ బాధ పెట్టకుండా ఉండడు  కదా”  అనుకోని నిట్టూర్చాడు యశో.
మెర్సీ కూడా ఇంజనీరు అవ్వటం తో ఆమెకు కూడా కార్ల డిజైనింగ్లో తర్ఫీదు ఇచ్చాడు. మరో రెండు సంవత్సరాలకు వారి కంపనీ ఉన్నత స్థాయికి చేరుకున్నది.
* * * * *
పూర్తిగా అన్నీ పోగొట్టుకొని చివరికి మెర్సీ కోసం ఆమె ఇంటికి వెళ్ళాడు మరో సారి క్రిష్.
ఆమె ఏర్ పోర్ట్  కి వెళ్ళిందని తెలిసి రోడ్ల మీద నడిచే సామాన్యురాలు విమానం ఎక్కుతోందా అని అసూయతో ఏర్ పోర్ట్ కు చేరుకున్నాడు. అక్కడ మెర్సీ విమానంలో అడుగు పెడుతోంది. ఆమె చేయి యశో చేతిలో ఉంది. బంధువులు “Happy married life ” అని వీడ్కోలు ఇస్తున్నారు.
అతనికి ఒక్క క్షణం జీవితం ఆగి పోయినట్లుగా అనిపించింది. ఒక్క క్షణం కాలం స్థాభించి పోయినట్లుగా, జనాలు అంతా స్తబ్ధుగా ఉన్నట్లు అనిపించింది.
ఇది ఎలా సాధ్యం మెర్సీ”  అని, “ఒరేయ్ యశోధర్ నేను నీ భవిష్యత్తుని  చోరీ చేస్తే, నువ్వు నా వర్తమానాన్ని చోరీ చేస్తావా? రాస్కెల్అంటూ క్రిష్ నేల మీద కూలి పోయాడు.
***
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: భవిష్యత్తు చోరీ – కథ - by k3vv3 - 21-05-2024, 02:57 PM



Users browsing this thread: 1 Guest(s)