Thread Rating:
  • 3 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అదృశ్య మందిరం - శంభల రాజ్యం – 14(సమాప్తం))
ఘోర కలి అరాచకాలు  - 1
బోర్డు డైరెక్టర్ లతో ఘోర కలి మీటింగ్
 
భూలోకంలో ఘోర కలి రంగాన్నీ వదిలిపెట్టలేదు. స్టీల్, ఐరన్, మినరల్ ప్రాసెసింగ్ ప్లాంట్స్ ఇలా అన్ని రంగాల్లో తనేంటో ప్రపంచానికి పరిచయం చెయ్యాలని సంకల్పించుకుని దిశగా అడుగులు వేస్తున్నాడు. తన సామ్రాజ్యాన్ని విస్తరించి    జీ.కె. కార్పొరేషన్ అండ్ ఇండస్ట్రీస్    పేరుతో ప్రపంచంలోని పలు చోట్ల కంపెనీలను స్థాపించి శ్రామికులను నియమించుకున్నాడు. తన ప్రతీ కంపెనీలో కొన్ని వేల మంది వర్కర్స్ తన ఆజ్ఞలను అనుసరించి పనిచేస్తూ ఉంటారు. ఘోర కలి దగ్గరున్న   నాగమణి   ఎంతో శక్తివంతమైనది కావటంతో దాన్ని ఆసరాగా చేసుకుని ఎన్నోఅరాచకాలు చెయ్యటం మొదలు పెట్టాడు.
 
ఒక రోజు  జీ.కె. కార్పొరేషన్ అండ్ ఇండస్ట్రీస్ బోర్డు డైరెక్టర్ మీటింగ్ ని ఘోర కలి సీక్రెట్ గా తన సామ్రాజ్యంలో ఏర్పాటు చేసాడు. రోజు ఘోర కలికి సెక్యూరిటీగా ఎంతో మంది ఉన్నారక్కడ. మీటింగ్ కి పది దేశాల నుండి వచ్చిన పదిహేను మంది బోర్డు డైరెక్టర్స్ ఒక చోట హాజరయ్యారు. వారు అక్కడికొచ్చి 2 గంటలవుతోంది. ఘోర కలి కోసమే ఎదురు చూస్తూ ఉన్నారు. అంతలో అక్కడికి ఘోర కలి తన సొంత రూపంతోనే వచ్చాడు. కళ్ళకు కాటుకతో, నలుపైన దుస్తులతో, తను ధరించిన దుస్తులపైన వికృతమైన గుర్తులతో చూడగానే ఒళ్ళు గగ్గుర్పొడిచేలా ఉన్నాడు.
 
"సభకు నమస్కారం. నేను డైరెక్ట్ గా పాయింట్ కొచ్చేస్తున్నాను. మీ పదిహేను మందీ ఇన్ని రోజులూ చాలా కష్టపడ్డారు. నేను చెప్పినట్టే మన కంపెనీలలో పని చేసే వర్కర్స్ తాగే టీ లో  'సమూఢ' అనే చీకటి రాజ్యంలో చెయ్యబడ్డ ద్రవ్యాన్ని కలిపి వారికిస్తూ వచ్చారు. వారిలో కనిపించిన మార్పేంటో మనం కళ్లారా మన ప్రొడక్షన్ యూనిట్ వాళ్ళు పంపిన రిపోర్ట్స్ లోనే చూసాం. అందుకు ముందుగా మనందరం సెలెబ్రేట్ చేసుకోవాలి. మీకు ఇక్కడ లెక్కలేనంత మద్యం దొరుకుతుంది రోజు. ఇష్టపూర్వకంగా ఎంత కావలి అనిపిస్తే అంత తాగండి. ఏది కావాలి అనిపిస్తే అది తినండి. మా వంటవాళ్లు అన్ని రకాల కూరలూ వండించారు. మగువలకు కొదవే లేదీ సామ్రాజ్యంలో. అమ్మాయి నచ్చితే అమ్మాయి మీ సొంతం అవుతుంది.
 
కానీ ఇవన్నీ మీరనుభవించే ముందు మీరు నాకోసం ఒక చిన్న పని చేసిపెట్టాలి. చేస్తారా?" అని వాళ్ళని అడిగాడు ఘోర కలి.
 
ఘోర కలి చేస్తారా అని ప్రత్యేకించి వాళ్ళని అడుగుతున్నాడంటే  అదేదో అల్లాటప్పా విషయం కాదని వాళ్లకి అర్థం అయిపోయింది.
 
అక్కడున్న పదిహేను మంది గుండెలూ వేగంగా పోటీపడి మరీ కొట్టుకుంటున్నాయి. ఒకరి కళ్ళు ఒకరు చూసుకుంటున్నారు. హ్యాండ్ కర్చీఫ్ తో నుదుటి పై చెమటని తుడుచుకుంటున్నారు. ప్రాణం పోయే ముందు ఎలా ఉంటుందో ఘోర కలి అడిగిన దానికి ఎదురుచెప్పటం అలా ఉంటుంది. ఇన్నాళ్లూ ఘోర కలితో చేతులు కలిపి తెగ సంబరపడిపోయారు. డబ్బు ఇచ్చే నషా అలాంటిది. ఎంత ప్రమాదంలో పడ్డామో తెలిసేసరికి పుణ్యకాలం కాస్తా గడిచిపోయి ఎదురుగా ఘోర కలి రూపంలో యముడు రెడీ గా ఉంటాడు.
 
"ఏంటి ఆలోచిస్తున్నారు?" అన్నాడు ఘోర కలి.
 
అక్కడంతా నిశ్శబ్దం.
 
"ఇంకా ఆలోచిస్తున్నారేంటి.......................?" అని సారి గట్టిగా బల్ల గుద్ది మరీ అడిగాడు ఘోర కలి.

"అలాగే.అలాగే. మీరేది అడిగితే అది చేస్తాం", అని పదిహేను మందీ లేచి నిల్చుని చేతులు కట్టుకుని ముక్తకంఠంతో మాటిచ్చారు.
 
"హహ్హాహ్హా.....భయం....భయం.....భయం భయమే నా పెట్టుబడి.....ఇప్పుడీ భయమే నా రాబడి", అంటూ భయంకరంగా నవ్వాడు.
 
"మీరందరూ మీ మీ రూపాల్ని శాశ్వతంగా మార్చేసుకోవాలి. అదే మీరు నాకోసం చేసే చిన్న పని", అని గట్టిగా నవ్వాడు ఘోర కలి.
 
"అంటే మా ఐడెంటిటీ మారిపోతుందా?" అని అడిగాడు వాళ్ళల్లో ఒకడు.
 
"మీ ఐడెంటిటీ ఏం మారిపోదు. మీ ఫామిలీ వాళ్లకు మీరేం దూరం అవ్వరు. ప్రపంచానికి మీ ఐడెంటిటీ అలానే ఉంటుంది. కానీ మీ రూపురేఖలే పూర్తిగా మారిపోతాయి.
హ్హాహ్హాహ్హా", అంటూ నవ్వాడు ఘోర కలి.
 

వాళ్లకేం అర్థం కాక ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు.
 
అది గమనించిన ఘోర కలి వారికి అర్థం అయ్యేలా ఇలా వివరించాడు.
 
"మీరందరూ నా లా మారిపోతారు. అంటే చూడటానికి మీరు అచ్చం నాలాగే కనబడతారు బయటి ప్రపంచానికి. దీని వల్ల నా ఐడెంటిటీని ట్రేస్ అవుట్ చెయ్యటం ఎవ్వరి వల్లా కాదు. అప్పుడు మిమ్మల్ని చూసి మీకెదురు తిరగటానికి అందరూ భయపడతారు.
 
నేను నా సామ్రాజ్యంలో ఇక్కడే కూర్చుని ప్రపంచం మొత్తాన్ని గుప్పిట్లో పెట్టుకోవచ్చు.
ఏది జరిగినా నిమిషాల్లో యూట్యూబ్, సోషల్ మీడియా ద్వారా నా సందేశాన్ని ప్రపంచంతో పంచుకుంటాను. ఇక్కడే ఉంటూ ప్రపంచంలో పలు చోట్ల జరిగే ఎన్నో సంఘటనలను నాకు నచ్చే విధంగా మలచుకుంటాను. ప్రపంచం మొత్తాన్ని భయపెడతాను.
 
మీరు ఉండే చోట జనాలు మిమ్మల్నే  ఘోర కలి  అనుకుని భ్రమపడుతూ భయపడుతూ బ్రతుకుతారు.
 
భయమే మన పెట్టుబడి.
 
భయంతోటే ప్రజలు మనకు బానిసలవుతారు.
 
భయంతోటే మనం వారికి దొరలు అవుతాం.
 
భయంతోటే ప్రపంచాన్ని గడగడలాడిస్తాం.
 
మీరు చెయ్య వలసిందల్లా నా లా మారిపోవటమే.
చేస్తారు కదూ?" అంటూ పదిహేను మందిని ఒక్కసారి సూటిగా చూస్తూ గంభీరంగా అడిగాడు.
 
వేరే గత్యంతరం లేక వాళ్ళందరూ ఒప్పుకున్నారు.

" ఘోర కలి ఎప్పుడూ మీ చుట్టూ రక్షగా ఉంటాడు", అంటూ ఘోర కలి అక్కడున్న ప్రతీ ఒక్కడి వద్దకు వెళ్లి ఆలింగనం చేసుకుని రాక్షస ప్రేమతో ప్రతీ ఒక్కడి బుగ్గపైన ముద్దు పెట్టాడు. ఘోర కలి శ్వాస బలంగా తగులుతోంది అక్కడున్న ప్రతీ ఒక్కడికి.
 
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 5 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: అదృశ్య మందిరం - శంభల నగరం – 10 - by k3vv3 - 21-05-2024, 11:22 AM



Users browsing this thread: