Thread Rating:
  • 11 Vote(s) - 2.82 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ (Completed)
#11
(11)

"ప్రియ ఎందుకు స్వీటీ వద్దంటున్నావ్??"

"అమ్మ నాన్న ఇంట్లోవాళ్ళు తప్ప ఆలా నన్నెవ్వరు అలా పిలవలేదు..... "

"ప్రియ గారు, నా పేరు సంజయ్ అండి, నేను మీకు కాబోయే హస్బెండ్ అండి.......ఇంకొక వారంలో మన ఎంగేజ్మెంట్ అండి..... "

ప్రియ నవ్వి "సంజు, ఆలా అని కాదు"

"మరి ఎలాగా"

"కావాలంటే పెళ్లి అయ్యాక స్వీటీ అని నన్ను పిలుచుకో"

"ఎంగేజ్మెంట్ అంటే సగం పెళ్లి అయినట్లే......ఇంకొక వారం లో మన ఎంగేజ్మెంట్...."

"సంజు కావాలంటే ఎంగేజ్మెంట్ అయ్యాక స్వీటీ అని పిలుచుకో......" అని చెప్పింది.

"ఒకే......."

ఒక నిమిషం ఇద్దరం సైలెంట్ గా ఉన్నాం

ప్రియ కు ఫోన్ వచ్చిందని కొంచెం పక్కకు వెళ్ళింది. ఫోన్ ఒక రెండు నిమిషాలు మాట్లాడి మల్ల వచ్చి కూర్చుంది.

"ప్రియ, నువ్వు సాంగ్స్ బానే వింటావా ??"

"వింటాను......."

"ఎలాంటి సాంగ్స్ ఇష్టం నీకు??"

"ఆలా ఏమి లేదు. బాగుంటే ఏ సాంగ్స్ ఐన వింటాను, పాడతాను"

"నువ్వు సాంగ్స్ పాడతావ్ కదా?? మరచిపోయాను నేను అసలు......."

"ఓన్లీ ఓల్డ్ సాంగ్స్ లేదా లేటెస్ట్ కూడా పడతావా ??"

"పాత పాటలు ఎవరు పాడతారు?? చిన్నపుడు పాడేదాన్ని.... ఇప్పుడు లాస్ట్ 10-15 ఇయర్స్ సాంగ్స్ పాడతాను"

"నీ ఫేవరెట్ సింగర్ ఎవరు ??"

"శ్రేయ ఘోషల్"

"అనుకున్న"

"అంటే అందరూ సింగెర్స్ ఇష్టమే, కానీ ఈ కాలంలో ఉన్నవాళ్లలో......తను ఇష్టం"

"hmmmm....."

"నువ్వు కంపెటిషన్స్ లో బాగా పాల్గొనివుంటావ్ గా??"

"హా అవును. చిన్నపుడు నా గొంతు విని పెద్ద సింగర్ అవుతానని అందరూ అనుకున్నారు"

"ఏమైంది తర్వాత??"

"10th వరకు బాగానే ఉండేది. ఇంటర్ నుంచి నీకు తెలుసుగా మన పరిస్థితి"

"hmmmmm "

"అలాగే ఆ టైం లో సంగీతం మాస్టారు చనిపోయారు...ప్రాక్టీస్ ఆగిపోయింది....."

" అదేలే"

"నీ గొంతు చాలా బాగుంటది...."

"థాంక్స్"

"అలాగే నువ్వు చాలా అందగా ఉన్నావ్"

"hmmm..."

"చాలా క్యూట్ గా కూడా ఉన్నావ్"

"ఇక చాలు నీ పొగడ్తలు"

ఇద్దరం నవ్వుకున్నాం. కానీ ఎందుకో ప్రియలో ఒక డిస్ కంఫర్ట్ చూసాను. ఫోన్ వచ్చిన తర్వాత నుంచి.

"ప్రియ..... నిన్నొకటి అడగొచ్చా ??"

"ఏంటి ??"

"ఫోన్ మాట్లాడినప్పటి నుంచి చూస్తున్నాను నిన్ను, అంత ఫ్రీ గా ఉన్నట్లు అనిపించడంలేదు నువ్వు...."

"సంజు......"

"ఏమైంది ??"

"నీకు ఒక విషయం చెప్పాలి"

"ఏంటి ??"

"..... ఇందాక అమ్మ ఫోన్ చేసింది...... "

"ఓకే"

"నేను తనకి ఎప్పుడు అన్ని ఓపెన్ గా చెప్పేస్తాను...... "

"ఒకే.... నేను మా అమ్మతో అంతే"

"కానీ మనం ఇలా కలసినట్లు తనకి చెప్పలేదు......నేను బిజీ గా ఉన్నానని తనకు మళ్లా ఫోన్ చేస్తాను అని చెప్పాను....... నేను ఆఫీస్ లో ఉన్నానా అని అడిగింది...... టెన్షన్లో.....నేను ఇంట్లోనే ఉన్నాను అని అబద్దం చెప్పను.... నేనుప్పుడూ తనతో ఆలా అబద్ధం ఆడలేదు"

నాకు తన విషయం అర్థమైంది. తను గిల్టీ గా ఫీల్ అవుతుంది.

"....నేను నిజం చెప్తే ఏమనుకుంటదో అని అబద్దం ఆడాను...... ఇప్పుడేమో నేనేదో తప్పుచేస్తున్న ఫీలింగ్ నాలో ఉంది...."

ఒక రెండు నిమిషాలు నిశబ్దం. నేను ఆలోచించడం స్టార్ట్ చేశాను. ఈ సిట్యుయేషన్ ఎలా సాల్వ్ చెయ్యాలి అని. ఎందుకంటే ప్రియ తో ఫస్ట్ టైం ఇలా బయటకు వచ్చాను. ఇలాంటి సిట్యుయేషన్ చెడటం నాకు అస్సలు ఇష్టం లేదు.

"ఒకే ప్రియ........ ఇప్పుడు మీ అమ్మకు ఒకే అంటే నీకు ఒకే కదా ??"

ప్రియ మోహంలో కంఫర్ట్ వచ్చింది "అవును"

నేను నా ఫోన్ తీసుకొని "అంకుల్ నెంబర్ చెప్పు....."

"సంజయ్ ఏంచేస్తున్నావ్?? నాన్నకి ఫోన్ చేస్తావా ??"

"అవును....."

"సంజు వద్దు.....నాన్న స్ట్రిక్ట్....."

"నేను చెప్తాగా...."

"సంజు....."

"నెంబర్ చెప్పు ప్లీజ్"

"సరే నోట్ చేసుకో..... "

నేను నెంబర్ డయల్ చేసాను. ఫోన్ రింగ్ అవుతుంది.

"హలో అంకుల్, నేను సంజయ్ మాట్లాడుతున్నాను హైదరాబాద్ నుంచి"

"అల్లుడు గారు చెప్పండి....."

"ఎం లేదు అంకుల్, ప్రియ ను నేను బయటకు తీసుకొని వెళ్లాలనుకుంటున్నాను..... మీ పర్మిషన్ కావాలి..... అందుకే ఫోన్ చేశాను మీకు"

"బయటక ??"

"అవును అంకుల్. ఒక రెస్టారంట్ కి డిన్నర్ కోసం వెళ్లాలని. 9:30 లోపల తనను ఇంట్లో డ్రాప్ చేస్తాను"

"బాబు పెళ్లికి ముందు ఇలాంటివి......"

"జస్ట్ డిన్నర్ అంకుల్. ప్లీజ్...... వచ్చే వారం ఎంగేజ్మెంట్ కదా కుదరదు..... అందుకే.... అంటే ఇప్పుడు ఆఫీస్ వర్క్ లేదు... ఇప్పుడు టైం ఉంది.... మళ్ల నాకు టైం దొరకదు అంకుల్, బాగా బిజీ అయిపోతాను....."

"సరే బాబు కానీ తొందరగా ముగించుకొని ఇంటికి వచ్చేయండి..... అసలే రోజులు బాగోలేవు"

"థాంక్స్ అంకుల్......తనను రాత్రి ఇంట్లో డ్రాప్ చేసాక మీకు ఫోన్ చేసి చెప్తాను..... "

"అలాగే బాబు"

ఫోన్ పెట్టేసి "ఇప్పుడు ఒకే నా ??"

"సంజు..... ఏంటది ఆలా ఫోన్ చేసి మాట్లాడేస్తారా అంత ఓపెన్ గా ?? నాన్న ఒప్పుకోవటం ఆశ్చర్యం గా ఉంది"

"తప్పేముంది, అంత ఓపెన్ గా చెప్పాను కదా.....ఎవరైనా ఎందుకు ఒప్పుకోరు ??"

ప్రియ కు ఎం మాట్లాడాలో అర్ధంకాలేదు అనుకుంటాను.

"ఇప్పుడు కొంచెం బెటర్ గా ఉందా నీకు ??"

"hmmmm కొంచెం"

"కొంచెం కాదే.... చాలానే .... ఇప్పుడు నీ మోహంలో మంచి కళ వచ్చింది"

ప్రియ నవ్వి "థాంక్స్ సంజు....."

"ఇట్స్ ఒకే"

"అవును ఎందుకలా అబద్ధం చెప్పావ్ ఆంటీకి??"

"ఏమో సంజు తెలీదు. టెన్షన్లో ఆలా చెప్పేసాను"

"టెన్షన్ ఎందుకు ??"

"ఉండదా మరి ?? ఇలా నీతో రావటం"

"అవును తప్పేముంది దాంట్లో"

"తప్పనికాదు......ఇంకా పెళ్లి అవ్వక ముందు.....ఇలా బయటకు రావటం"

"ప్రియ మనం ఏమి తప్పుచేయట్లేదు ఓకేనా, జస్ట్ ఆలా బయటకు వచ్చాము.....అంతే....అంకుల్ కి కూడా చెప్పాను... ఆయన కూడా ఒప్పుకున్నారు కదా"

"అవును"

"అంకుల్ ఎలా ఒప్పుకున్నారో ఇప్పటికి నీకు అర్థం కావట్లేదు కదా ??" అని నవ్వుతూ అడిగాను.

"అవును"

"దాంట్లో ఎం మేజిక్ లేదు...... ఉన్న విషయం ఓపెన్ గా చెప్పి రిక్వెస్ట్ నీ ముందే చేశాను గా"

"hmmmmm"

"నీకు నమ్మబుద్ది కావట్లేదు కదా ??"

"అవును సంజు"

కొన్ని సెకండ్స్ తర్వాత:

"థాంక్స్ సంజు"

"ఇట్స్ ఒకే స్వీటీ"

తన మోహంలో ఒక దాచుకోలేని నవ్వును చూసాను.

ప్రియ తో "నెక్స్ట్ వీకెండ్ ఎమన్నా సినిమాకు వెళ్దామా ??"

"సంజు....."

"ఎవరి పర్మిషన్ ఐన కావాలంటే.... చెప్పు ఇప్పుడే తీసుకుందాం"

ప్రియ నన్ను కొంచెం కోపంగా, కొంచెం నవ్వుతో చూస్తుంది.

నేను "ఏంటి??"

"సరే..... నువ్వే చెప్పు ఏ సినిమా కి వెళ్దామో"

నేను "స్వీటీ, నెక్స్ట్ వీక్ ఒక పెద్ద తుఫాన్ గ్యారంటీ...."

ప్రియ నవ్వింది "నువ్వేదో ఒకటి చెప్పి నాన్నను కూడా ఒప్పిస్తావ్ ఎలాగో......అందుకే"

"అంకుల్ సంగతి పక్కన పెట్టు, నేను చూసుకుంటాను. నీకు ఒకే నా కాదా ??"

తను సైలెంట్ గా ఉంది.

"స్వీటీ, మనకి ఎంగేజ్మెంట్ కూడా అవుతుంది కాబట్టి.... అలా సరదాగా ఒక సినిమాకి వెళ్ళటంలో తప్పేముంది.... మార్నింగ్ షో కి వెళ్దాము ఓకేనా "

"hmmmmm....."

ఇక ఫుడ్ అంత తేనెసం. వెయిటర్ ఎమన్నా కావల అని అడిగాడు

"ఐస్ క్రీం తిందామా ??"

"ఓకే"

"నాకు బటర్ స్కాచ్"

"నీకు ??"

"చాక్లెట్"

ఇంతలో ఇంకొక అతను వచ్చి టేబుల్ మీద ప్లేట్స్ అన్నీ తీసుకొని వెళ్ళిపోయాడు.

"స్వీటీ, నేను నిన్ను ఒకటి అడుగుతాను....."

"ఏంటి సంజు"

"కాదనకూడదు మరి"

"ఏంటి ??"

"నిన్ను స్వీటీ అని పిలుస్తాను..."

"ఆల్రెడీ స్వీటీ అనే పిలుస్తున్నావ్ గా "

ఇద్దరం నవ్వుకున్నాం.

టు బి కంటిన్యూడ్......
Images/gifs are from internet & any objection, will remove them.
[+] 2 users Like pastispresent's post
Like Reply


Messages In This Thread
RE: అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ - by pastispresent - 05-11-2018, 05:18 AM



Users browsing this thread: 7 Guest(s)