02-05-2024, 02:21 PM
'ది రేపిస్ట్ - ది డాక్టర్'
రచన: పిట్ట గోపి
స్వప్న.. ఈ పేరు వింటేనే ఎంతో అందం, ఐశ్వర్యంతో, కుందనపు బొమ్మలా ఉంటుందని ఎవరికైనా అర్థమయిపోతుంది. ఆమె తల్లిదండ్రులకు ఏకైక సంతానం. స్వప్న తండ్రి రాఘవేంద్ర. అతడి తల్లిదండ్రులు, తన ఇద్దరు తమ్ముళ్లు, వారి భార్యలు, పిల్లలు.. అంతా ఒకే ఇంట్లో ఎంతో అన్యోన్యంగా ఉంటారు.
స్వప్న ఎన్నో ఆశలతో, మరెన్నో ఆశయాలతో MBBS చేసి ప్రస్తుతం తమ జిల్లాకే పెద్ద ఆసుపత్రి అయిన ప్రభుత్వ ఆసుపత్రిలో సీనియర్ డాక్టర్లతో కలిసి ఎన్నో ప్రాణాలు కాపాడింది. మరెన్నో సర్జరీలు విజయవంతంగా చేయటంలో సఫలమైంది. తనతోటి వారికంటే స్వప్న వైద్యరంగంలో కొన్ని అడుగులు ఎప్పుడు ముందే ఉంటుంది. తన పనితనంలో అంతటి ధైర్యం, ఇష్టం, నమ్మకం ఉన్నాయి స్వప్నకు.
ఈ క్రమంలో కుటుంబ సభ్యులతోనే కాదు, స్నేహితులతో కూడా గడిపే తీరిక లేదు ఆమెకు. అంతెందుకు, విశ్రాంతి అనేది ప్రస్తుతానికి స్వప్నకు లేదు. ఒక్కోసారి సీనియర్ డాక్టర్లే పనిమీద విధులకు గైర్హాజరు అవుతుంటారు. ఇంకోసారి విధులకు వచ్చిన అటుపోతూ ఇటుపోతూ రోగులపై కాస్త నిర్లక్ష్యంగా ఉంటారు. ఆ సమయంలో జూనియర్ వైద్యురాలైన స్వప్నకు వైద్యం చేసే అవకాశం వస్తుంది. నిజంగా తాను విశ్రాంతి తీసుకోకపోవటానికి కారణం కూడా అదే.
సీనియర్ వైద్యులు వైద్యం చేస్తుంటే ఎంతసేపూ చూడటమేనా.. ! ఏదైనా చేస్తేనే వస్తుంది కదా.. ఆ అవకాశం తనకు రావాలంటే డాక్టర్లు అందుబాటులో లేని సమయం కావాలి. అది కావాలంటే తాను నిరంతరం ఆసుపత్రిలో ఉండాలి.
ఈ క్రమంలో ఒక్కోసారి స్వప్న ఏ రాత్రికో, ఏ అర్ధరాత్రికో ఇంటికి వెళ్తుంది.
నిజంగా పేదవారికి, అది కూడా తాను విశ్రాంతి తీసుకోకుండా,, నిరంతరం అందుబాటులో ఉండి,, వైద్యం చేయటం అంటే మాటలు కాదు కదా.. అలా చేయాలంటే ఆ పని పై ఎంతో ఇష్టం ఉండాలి. అందుకే ఇంట్లో కుటుంబ సభ్యులు స్వప్నకి ఎదురుచెప్పలేదు. పైగా తానేమి తప్పు చేయటంలేదు. పదిమందికి సేవ చేస్తుంది.
విధినిర్వహణలో ప్రాణం పెట్టి పనిచేసేవారు, రాబోయే ప్రమాదాలను లెక్కచేయరు కదా.. !
ఎప్పటిలానే రాత్రి సమయంలో తాను విధులు ముగించుకుని ఇంటికి బయలుదేరింది.
ఒంటరి ఆడది కనిపిస్తే ఒకప్పటి మనుషుల్లా ప్రవర్తించే మనుషులు నేటికాలంలో దాదాపు లేరు కదా..
పాపం స్వప్న దురదృష్టం కొద్దీ ఆరోజు అర్ధరాత్రి తాను వెళ్ళబోయే దారిలో ఓ ఇద్దరు వ్యక్తులు రోడ్డుపైనే కూర్చొని మాట్లాడుకుంటూ మద్యం సేవిస్తున్నారు.
స్వప్న తన వెహికల్ పై, ఫస్ట్ ఎయిడ్ కిట్ పట్టుకుని ఇంటికి వెళ్తుంది.
ఆమెను చూడగానే ఆ వ్యక్తులు తమ బైక్ తో స్వప్నని వెంబడించి, బైక్ అడ్డుపెట్టి, స్వప్నని బలవంతంగా తమ బైక్ ఎక్కించుకుని, నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతానికి తీసుకెళ్ళారు.
"అన్నయ్యా.. అన్నయ్యా.. నన్ను ఏమీ చేయకండి ప్లీజ్! నేను నా తల్లిదండ్రులకు ఒకతే కూతుర్ని. మీకు ఏ అపకారం చేయలేదు. నాకోసం నా తల్లిదండ్రులు ఎదురుచూస్తూ ఉంటారు. ప్లీజ్ వదిలేయండి" అని ప్రాధేయపడింది.
మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తులు వినిపించుకుంటేగా.. స్వప్నని ఆ చెంప,, ఈ చెంప చెళ్లుమనిపించారు. ఆ దెబ్బలకి స్వప్న నోటి నుండి రక్తం కారుతుంది. అయినా పట్టించుకోకుండా స్వప్నని కిందకు తోశాడు ఒకడు. పారిపోవటానికి ప్రయత్నం చేస్తే పట్టుకున్నాడు మరొకడు.
అలా ఆ ఇద్దరు స్వప్న పై అత్యాచారం చేసి బతికుండగానే స్వప్న జీవితాన్ని నాశనం చేశారు ఆ దుర్మార్గులు.
తర్వాత స్వప్నని అక్కడ వదిలేసి, "ఎవరికైనా చెప్తే చంపేస్తాం" అని బెదిరించి తమ బైక్ మీద వెళ్ళిపోయారు. ఆ దుర్మార్గుల నుండి తప్పించుకోవడానికి ఎంతో దూరం పరిగెత్తింది. ఎంతో క్షోభ అనుభవించింది. అయినా ఆపద సమయంలో తనలో తానే ధైర్యం నింపుకుని లేచి నిలబడి అక్కడక్కడా చిరిగిన తన దుస్తులను, గాయాలను చూసుకుని, పొంగి వస్తున్న కన్నీటిధారను ఆపుకోలేక, చాలాసేపు వెక్క్కివెక్కి ఏడ్చింది స్వప్న. తనివితీరా ఏడ్చాక ఇంటికి బయలుదేరుతుండగా ఎమర్జెన్సి ఫోన్ రావటంతో ఇంటికి చేరకుండా ఆసుపత్రికి వెళ్ళింది స్వప్న.
ఇద్దరు పేషంట్లకు ప్రాణాపాయం తప్పించింది.
ఆ పేషంట్ లు తమకు ట్రీట్మెంట్ ఇస్తున్న డాక్టర్ దుస్తులు అక్కడక్కడా చిరిగి ఉండటం చూసి తమలో తాము భయపడసాగారు. కానీ స్వప్న మాత్రం వైద్యం చేస్తున్నంతసేపు తన కంటి నుండి వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ ట్రీట్మెంట్ చేసింది.
తర్వాత పేషెంట్స్ భయాన్ని గమనించి, తన మాస్క్ తొలగించి కన్నీరు తుడుచుకుని,
"అన్నయ్యలారా భయపడకండి. ప్రాణానికి ఏమీ ప్రమాదం లేదు " అంది.
వాళ్ళు స్వప్నని చూసి షాక్ అయి, కాళ్ళు పట్టుకోవటానికి ప్రయత్నించారు. స్వప్న దూరంగా వెళ్ళి
"వద్దో.. వద్దు.. తప్పు చేసి కాళ్ళు పట్టుకుంటే ఆ పాపం పోతుందా అన్నలు " కళ్ళ నుండి ధారాళంగా కారుతున్న కన్నీటితోనే అడుగుతుంది స్వప్న.
"ఆడది లేనిదే ఈ సృష్టికి జీవం లేదు. ఆడది ఒక తల్లిగా, చెల్లిగా, భార్యగా ఎన్నో అపురూపమైన అవతారాలు ఎత్తి సృష్టిని నడిపిస్తుంది. తన ఇంట్లో ఆడవాళ్ళని ప్రేమగా చూసి బయట ఆడపడుచులను హీనంగా, దురాలోచనతో చూసేవాడు ఎప్పుడు మనిషి కాలేడు.
చదువుకున్నవాడే ఇలా ఆడదానిపై అఘాయిత్యాలు చేస్తుంటే.. ఒకప్పుడు చదువులేనోళ్ళే ఎక్కువ ఉండేవారు. అప్పుడు ఏమైపోవాలి ఈ ఆడజాతి.. ?
చదువులేనోడు ఆడదానికి విలువ ఇస్తే.. ! చదువుకుని, అన్ని తెలుసనుకునే నేటి మనుషులు ఆడదాన్ని ఇంత హీనంగా చూడటం ఏంటీ.. ?
నాది చాలా పెద్ద కుటుంబం. అయినా నాకు ఒక్క అన్నయ్య కూడా లేడు. నాకు కనిపించే ప్రతి మగాడిని నేను అన్నయ్యలా ఊహించుకుని వారే నా దైవంగా భావిస్తూ.. రాత్రనక పగలనక ఇలా ఎందరో పేదలను నేను నేర్చుకున్న వైద్యంతో బతికిస్తూ, నా కుటుంబంతో గడిపే క్షణాల కోసం ఎదురు చూడకుండా, పేదల కళ్ళల్లో సంతోషం చూసుకుని బతుకుతున్నాను. ఏనాడూ ఎవరికి అపకారం తలపెట్టలేదు.
మీరంతా ఎప్పుడు మారుతారో ఏంటో.. !
నా జీవితాన్ని నాశనం చేసినా.. మిమ్మల్ని నేను బతికించానంటే.. నా విధి పట్ల నేను ఎంత నిజాయితీగా ఉన్నానో మీకు తెలుసు. మీలాంటి దుర్మార్గులు ఉంటారని.. వారి నుండి తప్పించుకోవాలంటే రాత్రి సమయంలో వైద్యం అందించకూడదని నేను నిర్ణయించుకుంటే, ఈరోజు నేను మీరు చేసిన దుర్మర్గపు చర్యకు బలైయ్యేదాన్నే కాదు. నా రాక కోసం నా తల్లిదండ్రులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తారు. ఎందుకంటే నేను ఒక ఒంటరి ఆడపిల్లని.
ఒక ఆడపిల్ల ఇంటికి చేరుకోకపోతే తల్లి ఎంత తల్లడిల్లుతుందో.. నీ తల్లినే అడగండిరా కాలే కడుపు గూర్చి ఏం చెబుతుందో.. !
ఐ యామ్ ఏ డాక్టర్.. అండ్ యూ ఆర్ రేపిస్ట్స్.. యూ ఆర్ రేపిస్ట్స్. "అంటూ కంటనీరు తుడుచుకుని
"చూడండి.. ఏ సమయంలోనైనా ఒక ఆడపిల్ల క్షేమంగా తనకు తానుగా ఏ రోజు నుండైతే గమ్యాన్ని చేరుకుంటుందో.. ఆరోజు నుండి మాత్రమే మీ ఇంట్లో ఆడపడుచులు కూడా క్షేమంగా ఉన్నట్లు. అలా జరగని యెడల స్త్రీ కన్నీరు పెట్టే ఏ ప్రదేశం అయినా వల్లకాడుతో సమానం.. "
తనను అత్యాచారం చేసి తన చేతులతోనే ట్రీట్మెంట్ తీసుకున్న పేషేంట్స్ తో అంటూ కన్నీరు పెట్టింది స్వప్న.
జీవితంలో క్షమించరాని, మాయలేని మచ్చగా ఉండే తప్పు చేశామని తలదించుకుని మౌనంగా ఉండిపోయారు వాళ్ళు.
సమాప్తం.

ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ