Thread Rating:
  • 3 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అదృశ్య మందిరం - శంభల రాజ్యం – 14(సమాప్తం))
శంభల నగరం – 8
అభయః ప్రాకారం
 
సమరవిజయ రాముని కోసం శంభల నగరానికి విచ్చేసిన శ్రీకృష్ణుడు శంభలలో నడయాడిన ప్రాంతమే   అభయః ప్రాకారం. ఆయన ఎంతో దీక్షతో సదాశివుని జపం చేసి, మౌనాన్ని ధరించి లలితా దేవి ధ్యానంలోనే గడిపారు. అలాంటి అభయః ప్రాకారంలో సాక్షాత్తు శ్రీకృష్ణుడి చేతుల మీదుగా ఒక చెట్టును ప్రతిష్ఠించటం జరిగింది. అదే కల్పవృక్షము.
 
కల్పవృక్షం క్షీర సాగర మథనంలో పుట్టింది. దేవతలకు రాజైన ఇంద్రుడి చెంతకు చేరింది. మనం కోరిన కోరికలను తీర్చే చెట్టు ఇది. శ్రీకృష్ణుడు అమ్మవారిని ధ్యానం చేసి అలాంటి అరుదైన కల్పవృక్షాన్ని కోరగా లలితాదేవి వరంగా ప్రసాదించినది.
 
కల్పవృక్షాన్ని ఇక్కడ స్థాపన చేసిన తరువాత సమరవిజయ రామునితో శ్రీకృష్ణుడు విధంగా చెప్పాడు.
 
కల్పవృక్షానికి ఒక విశిష్టత ఉన్నది. భవిష్యత్తులో భూలోకవాసులు శంభలకు విచ్చేస్తారు. ఒకానొక సమయంలో భూలోకంలోని వారికి అగమ్యగోచరమైన స్థితి ఏర్పడుతుంది. పాతకులు అల్లకల్లోలాన్ని సృష్టిస్తూ ఉంటారు. ప్రపంచం మొత్తం ముష్కరులతో నిండిపోయి ఉంటుంది. అలాంటి విపత్కర పరిస్థితులలో కొంతమంది మానవులు శంభలకు శరణార్థి పొందటం కోసం వస్తారు. వాళ్ళు సామాన్య మానవులే అయినప్పటికీ వారి పూర్వీకులు చేసిన పుణ్య కర్మల వల్ల వారికి సిద్ధపురుషుల సాంగత్యం దొరుకుతుంది. అలా వారికి శంభలలో అడుగుపెట్టే యోగ్యత దక్కుతుంది.
ప్రపంచాన్ని పాపం నుండి, పాపుల నుండి విముక్తి చేసే శక్తిని పొందాలంటే కల్పవృక్షానికున్న కుసుమాలతో శక్తి పీఠమునందున్న అమ్మవారిని వారు పూజించాలి. శ్రద్ధతో పూజించినప్పుడు మాత్రం దివ్యశక్తులే వారిని వరిస్తాయి. అవి సరిగ్గా లోకానికి ఉపయోగపడతాయి.”
 
రోజు నుండి అభయః ప్రాకారంలోని  కల్పవృక్షాన్ని ఎంతో పవిత్రంగా ఆరాధించటం జరుగుతున్నది. శంభల రాజ్యంలోని రాజైన అనిరుద్ధుల వారికి అమ్మవారిని కుసుమాలతో పూజించటం అంటే ఎంతో ఇష్టం. ఒక సంకల్పం, ఒక లక్ష్యం, ఒక కోరిక లేకుండా అమ్మవారిని పూజించటం శాస్త్ర విరుద్ధమైన చర్య అవుతుంది. పైగా అమ్మవారిని కోరుకునే కోరిక లోకకల్యాణం కోసమే అయ్యి ఉండాలి. వ్యక్తిగతమైన వాంఛలు నెరవేరటం కోసం అమ్మవారిని కల్పవృక్షం కుసుమాలతో సేవిస్తే అది లోకానికే అరిష్టం. ధర్మసూక్ష్మం తెలుసు కాబట్టే అనిరుద్ధుల వారు తన మనస్సులోనే సహస్ర నామ పఠనం చేస్తూ దేవిని భక్తితో కొలుస్తారు.
 
అభయః ప్రాకారంలో ఎన్నో అద్భుతాలుంటాయి. శ్రీకృష్ణుడు ఎంతో కఠిన దీక్షతో ధ్యానంలో గడిపిన స్థలమిది. అందువల్ల ఆయన ధ్యానించిన చోటు శాశ్వతంగా ఒక  శక్తి వలయంలా  మారిపోయింది. వలయం చుట్టూ ఉండే అగ్ని నిరంతరం ఒక జ్యోతిలా ఎర్రటి కాంతితో వెలుగుతూ ఉంటుంది. వలయం మధ్యలో సూర్యుని కిరణాలన్నీ ఒక్క చోట చేరినట్టుగా ఉండే కాంతి పుంజం మనకు కనబడుతుంది. కాంతి పుంజం రంగు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. అరుణ వర్ణం, నీలమేఘ వర్ణం, హరితవర్ణం.,ఇత్యాది వర్ణములను కాంతిపుంజంలో మనం దర్శించుకోవచ్చు. మనలో వున్న దైవీభావాలను ద్విగుణితం చేసే అరుదైన దర్శనమిది.
 
 
కల్పవృక్షాన్నిశక్తి వలయాన్నిదర్శించుకున్నారు అభిజిత్, అంకిత, సంజయ్ లు. సిద్ధపురుషుడు శక్తి వలయం దగ్గరే తగిన చోటు చూసుకుని అక్కడే ఆసీనుడై ధ్యానం చేసుకుంటున్నాడు. వారితో వచ్చిన ఇద్దరు సైనికులు సిద్ధపురుషునికి దగ్గరలోనే ఒక రాతి బండ మీద కూర్చుని ఉన్నారు.
 
అభిజిత్, అంకిత, సంజయ్ లు ప్రదేశాన్నంతా పరిశీలనగా చూస్తున్నారు.
ఇంతలో అక్కడికొక కపిల గోవు వచ్చింది. కపిల గోవు మెడకి గంటలు కట్టి ఉండటంతో అది నడుస్తూ ముందుకెళ్తున్న కొద్దీ గంటల శబ్దం చెవులకు మధురంగా వినిపిస్తోంది. కపిల గోవునే అనుసరిస్తూ వారు ముందుకు కదిలారు. అక్కడొక గోశాల కనబడింది. సున్నితత్వానికి ప్రతీకలా, సాత్విక గుణాలకు పెన్నిధిలా, సచ్ఛీలతకు సదనములా అనిపించినదా గోశాల.
 
అభిజిత్, అంకిత, సంజయ్ లు భారత దేశంలో ఎన్నో సార్లు గోవులను చూసారు కానీ ఇక్కడున్న గోవులను మాత్రం ఇంతక్రితం ఎప్పుడూ వారు చూడలేదు. గోలోకంలోని గోవులలా అనిపించాయి వాళ్లకి. గోవులను సంరక్షించే ఉద్ధారకుడు వారికి అక్కడ కనిపించాడు. విచిత్రం ఏంటంటే ఆయనొక ముముక్షువు. భూలోకంలో ఉన్నప్పుడు ఆయన ఎన్నో గోవులకు ఇలాగే సేవ చేసుకునేవాడు. గోసేవలో తరించిపోయేవాడు ఆయన.
 
అభిజిత్, అంకిత, సంజయ్ లను చూడగానే ఉద్ధారకుడు వారిని సమీపించి గోశాల గురించి ఇలా వివరించటం మొదలు పెట్టాడు.
శ్రీకృష్ణుడు శంభల నగరంలో చాలా రోజులు ధ్యానంలో గడిపారు. సమరవిజయరాముడు చేసుకున్న అదృష్టం వల్ల శ్రీకృష్ణుడిని సేవించుకునే భాగ్యం శంభలకు కలిగింది. ఆయన గోవులు లేకుండా ఉండలేడు. శంభలకు కపిల గోవులను ఆయనే వరంగా ప్రసాదించాడు. రోజు నుండి శంభలలోని శివుని ఆలయంలో మహాదేవునికి  క్షీరాభిషేకం చెయ్యటమనే ప్రక్రియ మొదలయ్యింది. ఇక్కడి గోవు పాలనే శివుని అభిషేకానికి వినియోగిస్తారు. గోవులను సూర్యుని కిరణాలుగా, సూర్యమండలంలోని యజ్ఞపురుషుడిని గోవిందుడిగా భావిస్తూ ఇక్కడ సూర్యారాధన చేస్తారు.
 
 గోబ్రాహ్మణేభ్యహ శుభం భవతు అని వేదాలలో పఠిస్తారు. గోవులకు బ్రాహ్మణుల కంటే ముందు స్థానాన్ని ఇచ్చి వారికి శుభం కలుగుగాక అని మన ప్రార్థనలో మనం దేవుణ్ణి కోరుకుంటాం అన్నమాట. ఎంత గొప్ప భావన అది.
 
ఇక్కడ మీరు చూసేవి కపిల గోవులే అయినప్పటికీ ఇవన్నీ 
కామధేనువు నుండి వచ్చినవి. ఇక్కడున్న ప్రతీ కపిల గోవూ గోమాతగా ఉన్న దేవతే అనర్థం. వీటికి చావూ పుట్టుకలతో సంబంధం లేదు. శంభలలోని అభయః ప్రాకారంలో శ్రీకృష్ణుడిని సేవించుకుంటూ ఉంటాయి. దయచేసి మీరు కపిల గోవులను దేవతలలానే చూడండి. గోశాలలో ఉన్న కపిల గోవుకు మీరు సేవ చేసుకున్నా సరే దేవతలకు అభిషేకం చేసినంత ఫలం మీకు దక్కుతుంది.”
 
ఉద్ధారకుడి సూచనలు అనుసరిస్తూ అభిజిత్, అంకిత, సంజయ్ లు గోశాలలోని కపిల గోవులకు సేవ చేసుకున్నారు.
 
అక్కడి నుండి కాస్త ముందుకెళ్ళగానే వాళ్లకి వేణు నాదం వినిపించింది. వేణుగానం చేస్తున్న ఒక ముముక్షువు కనిపించాడు వాళ్ళకి. సమ్మోహన పరిచేలా ఉందా వేణుగానం.
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 5 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: అదృశ్య మందిరం - by k3vv3 - 20-04-2024, 02:15 PM



Users browsing this thread: