Thread Rating:
  • 3 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అదృశ్య మందిరం - శంభల రాజ్యం – 10
శంభల నగరం – 7
విమలః ప్రాకారం - 2

దర్శించుకోవలసినవి ఇంకా ఎన్నో మిగిలే ఉన్నాయి. ముందుకు వెళుతూ ఉండగా వారికి మొట్ట మొదట కనిపించినది   జ్ఞాన కుంభము
 
జ్ఞాన కుంభములో ఉండే జలం స్వర్వాహినీ నదిలోనిదే అయినప్పటికీ జ్ఞాన కుంభాన్ని విమలః ప్రాకారంలోని జ్ఞాన దేవతలందరికీ తెల్లవారుఝామునే నివేదన చెయ్యటం చేత ఒక పవిత్రత సంతరించుకుని తీర్థం అయిపోతుంది.

జ్ఞాన కుంభములోని తీర్థాన్ని మూడు పర్యాయాలుగా ఒక క్రమంలో తీసుకోవాలి. అందులోఒక పరమార్థం దాగుంది.

మొదటి సారి తీర్థం తీసుకున్నప్పుడు  బుద్ధికి జ్ఞానాన్ని ప్రసాదిస్తూ పవిత్రతను ఇచ్చే  హయగ్రీవుణ్ణి తలుచుకుంటూ తీసుకోవాలి.
 
రెండో సారి తీర్థం తీసుకునేటప్పుడు  మనసును జ్ఞానం వైపుకు మళ్లిస్తూ పవిత్రతను చేకూర్చే  షణ్ముఖుణ్ణి  స్మరించుకుంటూ తీసుకోవాలి.
 
మూడో సారి తీర్థం తీసుకుంటున్నప్పుడు నిర్మలమైన
బ్రహ్మజ్ఞానాన్ని ఏ నాటికైనా ప్రసాదించమని కోరుతూ  సరస్వతీ స్తుతిస్తూ తీసుకోవాలి.
 
జ్ఞాన కుంభము దగ్గర ఒక ముముక్షువు ఉంటాడు. అక్కడికి వచ్చిన వారందరికీ ఆయనే తీర్థాన్ని అందిస్తాడు.
 
హయగ్రీవుణ్ణి, షణ్ముఖుణ్ణి, జ్ఞాన సరస్వతీ దేవినీ దర్శించుకోకుండా అక్కడ తీర్థాన్ని స్వీకరించకూడదు.
 
జ్ఞాన కుంభము దాటిన తరువాత వాళ్లకు అక్కడొక మందిరం కనిపించింది.
 
దురిత నివారితః
అని వ్రాయబడి ఉన్నది. అదేమిటో తెలుసుకుందామని ముఖద్వారం దగ్గరికెళ్ళారు అభిజిత్, అంకిత, సంజయ్ లు. సిద్ధపురుషుడు, ఇద్దరు సైనికులు మాత్రం దూరం నుంచే వీళ్ళను గమనిస్తున్నారు.
 
ముఖద్వారం దగ్గరే ఒక ముముక్షువు ఉన్నాడు. వారిని సాదరంగా లోనికి ఆహ్వానించాడు.
 
"మీకు నేనే విధముగా సాయపడగలను?" అని అడిగాడు ఆయన.
 
"మాకు మందిరం గురించి విపులంగా చెప్తారా?" అని అడిగాడు సంజయ్.
 
“దురిత నివారితః” అని పైన వ్రాయబడి ఉంది కదా. అనగా చోటు మీ పాపములను పూర్తిగా తొలగించి వేస్తుందని దానర్థం ", అని బదులిచ్చాడు ముముక్షువు.
 
"పాపములు అనగా ఏవి స్వామి?" అడిగాడు అభిజిత్.
 
"విమలః ప్రాకారంలో పాపం అంటే అజ్ఞానం అనే అర్థం. అజ్ఞానం చేతనే ఎన్నో తప్పిదాలు జరుగుతాయి", అన్నాడా ముముక్షువు.
 
"అంటే ఇక్కడ అజ్ఞానాన్ని పూర్తిగా తీసేస్తారా స్వామి?" అని అమాయకంగా అడిగింది అంకిత.
 
"అజ్ఞానాన్ని తీసివెయ్యటం అంటూ ఏమీ ఉండదు. ఎప్పటికప్పుడు జ్ఞానసముపార్జనతోనే మనం అజ్ఞానాన్ని దూరం చేసుకుంటూ ఉంటాం", అన్నాడు ముముక్షువు.
 
"అంటే ఇక్కడ గ్రంథాలు, పురాణాలు, ఉపనిషత్తులు ఉంటాయా స్వామి?" అని అడిగాడు సంజయ్.
 
"అవేవీ ఇక్కడుండవు. ఇక్కడి నుండి కొంత దూరంలో ఉన్న జ్ఞాన శిఖ  అనబడే ఒక గ్రంథాలయములో మీకు అవన్నీ దొరుకుతాయి. అక్కడ దొరకనిది అంటూ ఏదీ లేదు. మీరేది తెలుసుకోవాలని ఆరాటపడినా అక్కడ అంశానికి సంబంధించిన సమగ్రమైన విషయ సంపదంతా మీకు దొరుకుతుంది", అన్నాడా ముముక్షువు.
 
"మరి మందిరం విశిష్టత ఏమిటి స్వామి?" అని అడిగాడు అభిజిత్.
 
"ఇక్కడ మీరు ఎన్నో విషయాలను మరిచిపోవచ్చు. అలా మరిచిపోవటానికి ఇక్కడ మీకు మూడు ద్వారాలు ఉన్నవి", అని కాసేపు ఆగి మందిరం మొత్తాన్ని చూపిస్తూ
" మందిరంలో మొత్తం మూడు వాకిళ్లు ఉన్నాయి. అనగా మొత్తం మూడు అరలు అన్నమాట", అన్నాడా ముముక్షువు.
 
అర అంటే ఏమిటి?
 
అన్నట్టు సందేహంగా చూస్తున్నాడు అభిజిత్. దాన్ని అర్థం చేసుకున్న ముముక్షువు వెంటనే ఇలా అన్నాడు.
 
"ఇక్కడ ఉండే వాటిని గదులు అనకూడదు. గడపలు ఉండవు కాబట్టి ఇవి గదులు కావు. అందుకే అరలు అన్నాను. గడపను దేహళి అంటారు. ఒక గృహము నందు వేర్వేరు గదులు ఉంటాయి. ప్రతీ గదికీ ఒక గడప ఉంటుంది. గడపను తొక్కరాదు. గడప మీద కూర్చోకూడదు. గడపకు పసుపు, కుంకుమ పెట్టాలి. గడప లక్ష్మీ దేవి స్వరూపం కనుకనే మందిరంలో ఉన్న మూడు ద్వారాలకూ వాటిని అమర్చలేదు. అజ్ఞాన అంధకారాన్ని మొత్తం తీసేసుకునే మూడు అరలు ఇవి. మందిరంలోకి అడుగుపెట్టే ముందు మాత్రం మీరొక గడపను చూసి ఉంటారు. అక్కడ దైవ ప్రతిష్ఠ జరిగింది. అందుకే మొదటి వాకిలికి మాత్రమే గడప ఉంటుంది", అని చెప్పటం ముగించాడు.
 
మూడు వాకిళ్ళనూ వారికి చూపిస్తూ ముముక్షువు ఇలా అన్నాడు.
 
"మొదటి వాకిలి ద్వారా వెళితే మీలో ఉన్న మానసికమైన మలినాలు అన్నీ దూరం అవుతాయి. అనగా మీలో ఉన్న మోహం, ప్రాపంచిక విషయాల పట్ల మీకుండే భ్రమలు, అజ్ఞానం వల్ల కలిగే కోపాలు...ఇలా అన్నీ తొలగిపోతాయి.
 
రెండవ వాకిలి ద్వారా వెళితే మీలో ఉన్న  బుద్ధి జాడ్యాలు అన్నీ తొలగిపోతాయి.అటు పిమ్మట మీకు సజ్జనుల సాంగత్యము దొరుకుతుంది. బుద్ధిలో పుట్టే జాడ్యాలన్నిటికీ కారణం దుర్జనుల సాంగత్యమే అన్నది నిర్వివాదాంశం.
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 4 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: అదృశ్య మందిరం - by k3vv3 - 08-04-2024, 12:22 PM



Users browsing this thread: 7 Guest(s)