04-04-2024, 04:54 PM
గేటెడ్ కమ్యూనిటీ - పార్ట్ 1
రచన: తాత మోహనకృష్ణ
అదొక పెద్ద గేటెడ్ కమ్యూనిటీ. లోపల పెద్ద అంతస్తుల అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అప్పట్లో, వచ్చిన కొత్త కంపెనీ ప్రారంభ ఆఫర్ పేరిట చాలా తక్కువకే ఫ్లాట్స్ ఇచ్చింది. సొంత ఇంటి కల ఉన్న మిడిల్ క్లాసు ఫ్యామిలీస్ అందరూ.. ఎగబడి మరీ కొన్నారు. అక్కడ ఫ్లాట్స్ సిటీ కి దూరంగా ఉన్నా.. ఆఫర్స్ అనగానే, చాలా మంది.. ఏమీ ఆలోచించకుండా ఫ్లాట్స్ కొనడానికి రెడీ అయిపోయారు. సిటీ కి దూరం అయితే ఏముంది.. ? ఒక కార్ కొనుక్కుంటే సరిపోతుందని అనుకునే వాళ్ళు చాలా మంది. ఖర్చు లో ఖర్చు.. అని ఒక కార్ తీసుకుంటే సరి అని.. ఇంకొంత మంది. ఫ్లాట్ తక్కువ లో వస్తుంది కాబట్టి.. కార్ తీసుకోవచ్చని కొందరు. ఎలాగైతే నేమి.. ఫ్లాట్స్ అన్నీ హాట్ కేక్ లాగ అమ్ముడుపోయాయి.
ఇక్కడ ఉన్న ఫ్యామిలీస్ ఒక్కకరిదీ ఒక్కోరకం మనస్తత్వం. గేటెడ్ కమ్యూనిటీ అంటే, ఒక సేఫ్టీ, సెక్యూరిటీ.. ఉంటాయని అందరి నమ్మకం. అన్నీ సరిగ్గా ఉంటే.. అది అక్షరాల నిజమే.. దేనికీ భయపడనవసరం లేదు.
సరళ ఐదవ ఫ్లోర్ లో.. తన ఫ్లాట్ నుంచి గబగబా బయటకు వస్తోంది. పక్కనే.. తన ఐదు ఏళ్ళ కొడుకు ఉన్నాడు. డోర్ లాక్ చెయ్యడానికి తాళాలు కోసం వెతుకుతుంది సరళ..
"ఏరా సన్నీ.. ! డోర్ తాళాలు ఎక్కడ పెట్టావు? నిన్న రాత్రి వాటితో ఆడావు కాదరా!"
"లేదమ్మా! నేను తీయలేదు.. "
"ఓహ్! డోర్ కే వదిలేసాము.. నిన్నటినుంచి.. "
"తొందరగా పద.. కాలేజ్ బస్సు వచ్చేస్తుంది.. బస్సు మిస్ అయితే, మళ్ళీ కష్టం సన్నీ!" అంది తల్లి సరళ
"షూ వేసుకో.. లిఫ్ట్ దగ్గరకు వెళ్లి ఉండు. నేను వస్తాను.. "
"అలాగే అమ్మ!"
సరళ సన్నీ బ్యాగ్ భుజాన వేసుకుని, డోర్ లాక్ చేసి.. లిఫ్ట్ దగ్గరకు పరుగులు తీసింది. లిఫ్ట్ చూస్తే, ఎక్కడో ఆగిపోయింది. టెన్షన్ పడుతోంది సరళ. చివరకి లిఫ్ట్ వచ్చింది. హమ్మయ్య.. ! అనుకుంది సరళ. ఇద్దరూ వెళ్లి బస్సు టైం కు చేరుకున్నారు. ట్రాఫిక్ జామ్ వలన బస్సు లేట్ అయ్యింది.. అందుకే మనం చేరుకున్నామనుకుంది సరళ. సన్నీ ని కాలేజ్ బస్సు ఎక్కించి.. మెల్లగా నడుచుకుంటూ లోపలికి వస్తోంది సరళ.
****
సరళ కు సంతోష్ తో పెళ్ళయి ఆరు ఏళ్ళు అయ్యింది. సంతోష్ ది సాఫ్ట్వేర్ ఉద్యోగం. ఎప్పుడూ కాల్స్ తో బిజీ గానే ఉంటాడు. షిఫ్ట్స్ లో పనిచేస్తాడు.. అందుకే ఎప్పుడూ సరళ.. సన్నీ ని కాలేజ్ బస్సు ఎక్కిస్తుంది..
సరళ ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీ లో ఫ్లాట్ లోకి షిఫ్ట్ అయి, మూడు నెలలు అయ్యింది. అందుకే, అక్కడ అందరూ కొత్త ముఖాలే. సరళ భర్త ఎప్పుడు బిజీ కావడం చేత భార్య ను పట్టించునే అంత తీరిక లేదు.
"ఏమండీ! ఇంట్లో పనులకు పనిమనిషి ని పెట్టుకుందామండి. !" అడిగింది సరళ
"ఎందుకే! ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీ లో చాలా ఎక్కువ డబ్బులు అడుగుతారు. అయినా.. నువ్వు ఇంట్లోనే ఉంటావు కదా!.. మెల్లగా పనులు చేసుకోవచ్చుగా.. " అన్నాడు భర్త..
"కాదండీ!.. పనులు ఎక్కువ కదా! అందుకే.. "
"చెప్పింది చెయ్యి సరళ!"
"మన అబ్బాయి.. గురించి ఏం ఆలోచించారు? వాడికి ఉన్నసమస్య గురించి.. ?"
"కొంత వయసు వస్తే.. అదే సర్దుకుంటుందని డాక్టర్ చెప్పారుగా.. అందుకే నీకు ఉద్యోగం కూడా వద్దన్నానుగా.. !"
"నేను ఫార్మసీ చదివాను. మీకు తెలుసుగా.. పెళ్ళికి ముందు నేను మెడికల్ షాప్ చూసుకునే దానిని.. ఇప్పుడు పిల్లలు పుట్టాకా.. మానేసాను.. నాకు మళ్ళీ ఉద్యోగం చెయ్యాలని ఉంది.. "
"తర్వాత చూద్దాం లే సరళ.. !"
"మన చిన్నవాడి గురించి ఏం ఆలోచించారు మరి?"
"మీ అమ్మ దగ్గర ఊరిలో ఉన్నాడు గా.. కొన్ని రోజులు పోయాక తీసుకొద్దాము లే !"
"అప్పుడు నేను ఖచ్చితంగా పనిమనిషిని పెట్టుకుంటాను.. ఇద్దరి పిల్లల్ని చూసుకోవడం నా వల్ల కాదు.. "
"చూద్దాం లే సరళ!"

ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ