Thread Rating:
  • 3 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అదృశ్య మందిరం - శంభల రాజ్యం – 10
సిద్ధపురుషుడి కళ్ళు చెమర్చాయి.
 
" మహానుభావుడిది ఎంతటి గొప్ప అదృష్టం. కళలకు, జ్ఞానానికి నిలయమైన బాలా త్రిపుర సుందరీ దేవి ఎదుట తన కళను ప్రదర్శించటమా! ఇతను సామాన్య మానవుడు కాదు. సంజయ్ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ గురించి నీకు తెలిసింది చెప్తావా? ఆయన గురించి నాకు ఇంకా ఇంకా తెలుసుకోవాలని ఉంది", అని అడిగాడు సిద్ధపురుషుడు.
 
సంజయ్ కి బిస్మిల్లా ఖాన్ గారి గురించి పెద్దగా తెలియదు.
 
"మీకు అభ్యంతరం లేకపోతే నేను చెప్తాను స్వామీ", అన్నాడు అభిజిత్.
 
"ఎవరైతే ఏముంది? మాహానుభావుడి గురించి తెలుసుకోవటమే నాకు ముఖ్యం. చెప్పు, అభిజిత్", అన్నాడు సిద్ధపురుషుడు.
 
 
"బిస్మిల్లా ఖాన్ గారికి  భారత రత్న అనే గొప్ప గౌరవాన్ని ఇచ్చింది భారత కేంద్ర ప్రభుత్వం. ఎంతో మందికి భారత రత్న వచ్చి ఉండవచ్చు. కానీ బిస్మిల్లా ఖాన్ గారికి  భారత రత్న రావటం ఆయనకు గౌరవం కాదు. ఆయనని వరించటం భారత రత్నకు దక్కిన గౌరవం అని భావించారు. అంతటి గొప్ప వ్యక్తి ఆయన. ఆయన మాటల్లోనే చెప్పాలంటే ' సుర్ ఏక్ హయ్....భగవాన్ ఏక్ హయ్.....దునియా మే కళా జిస్ కే పాస్ హోతీ హయ్ వో అకేలా హయ్....క్యోన్కి వో ఏక్ హీ హయ్....అన్మోల్ రతన్ ఏక్ హీ హోతే హయ్....దో కభీ నహి హో సక్తే' అన్నారు. అంటే ప్రపంచంలో దేవుడు అనే శక్తి ఒక్కటే. సుస్వరాలను అవలీలగా పలికించగలిగే స్వరం ఒక్కటే. కళ ఎవరి దగ్గర అయితే ఉంటుందో వారు ఒంటరిగానే ఉంటారు. వారిలా కళను ప్రదర్శించే మరొకరు మనకు ఎప్పటికీ కనబడరు. ఎందుకంటే వెలకట్టలేని మణి ప్రపంచంలో ఒక్కటే ఉంటుంది. రెండు ఎప్పటికీ ఉండవు అన్నారు. అనటం మాత్రమే కాదు ఆయన తన జీవితాంతం అదే సిద్ధాంతంతో బ్రతికారు. ఆయనని దగ్గర నుంచి గమనించిన వారు చెప్పేది ఏంటంటే ఆయనకి వారణాసి అంటే చాలా భక్తి అని. ఒకసారి పాశ్చాత్య దేశాలలో ఎక్కడో షెహనాయి ప్రదర్శన ఇవ్వటానికి వెళ్లాల్సి వచ్చిందంట. ఆయనకి తన మాతృదేశాన్ని వదిలి వెళ్ళటం ఎంత మాత్రం ఇష్టం లేదట. వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది. కాశీ విశ్వనాథుణ్ణి తలుచుకుని అక్కడికి వెళ్ళారంట. అక్కడ ప్రదర్శన ఇచ్చి తిరిగి కాశీకి రాగానే షెహనాయిని గంగలో ముంచి కడిగారంట. ఎందుకు అని అడిగితే  నా షెహనాయి అపవిత్రం అయిపోయింది....అందుకే గంగాజలంతో తిరిగి పావనం చేస్తున్నాను అని సమాధానం ఇచ్చారంట. ఆయనకు కుల మత భేదాలు తెలియవు. తాత్విక చింతనతో బతికిన గొప్ప కళాకారుడు ఆయన. ఆయన నవ్వితే పసిపాప నవ్వినట్టుగా ఉంటుంది.
ఆయన బాధపడితే మన హృదయం ద్రవించిపోతుంది. ఆయన కంఠంలోనే షెహనాయి ఉందేమో అనిపిస్తుంది ఆయన గానం విన్నవారికి. అంత గొప్ప స్వరజ్ఞానం ఉంది. ఒకసారి రాగభైరవి లో అల్లాహ్ గురించి పాడి మతపరంగా తన విద్యను తప్పుబట్టాలని చూసిన ఒక మౌలానా నోరు మూయించారు. కళకు, దేవుడికి కుల, మత, వర్ణ భేదాలేంటి అంటూ ఆయన నవ్వేసేవారు. ఆయనే షెహనాయి. షెహనాయినే ఆయన. మనుషుల్లో దేవుడిలా బతికాడాయన. దేవుడికి దగ్గరగా బతికాడాయన. రోజు దేవుడి ముందే షెహనాయిని ప్రదర్శిస్తున్నాడాయన.
 
ఇది ఆయనకే సాధ్యం", అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు అభిజిత్.
 
సంజయ్, అంకితలు ఇద్దరూ ఆశ్చర్యపోతూ అభిజిత్ వంకే చూస్తున్నారు.
 
"బిస్మిల్లా ఖాన్ ఒక వ్యక్తిగా ఎలాంటి వారో నాకు పరిచయం చేసావు, అభిజిత్. నీలో చాలా లోతుంది. పైకి ఏమీ తెలియనట్టు ఉంటావు కానీ, నీకు చాలా తెలుసు. నీలో ఉన్న విద్యార్థిని ఇలానే ఉంచుకో. నీకు తిరుగుండదు", అన్నాడా సిద్ధపురుషుడు.
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 5 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: అదృశ్య మందిరం - by k3vv3 - 31-03-2024, 02:44 PM



Users browsing this thread: 6 Guest(s)