Thread Rating:
  • 3 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అదృశ్య మందిరం - శంభల రాజ్యం – 10
శంభల నగరం – 6
విమలః ప్రాకారం - 1
సూర్యః ప్రాకారం నుండి  విమలః ప్రాకారం వైపుగా వారి అడుగులు పడ్డాయి. సైనికులిద్దరూ వారికి దారి చూపిస్తూ ఉండగా సంజయ్ సైనికులను ఇలా అడిగాడు.
 
"  విమలః ప్రాకారం గురించి మాకు కాస్త చెప్తారా?"
నడుస్తూ ముందుకెళ్తున్న వాళ్ళల్లో ఒకడిలా చెప్పాడు.
 
" విమలః ప్రాకారంలో  మీకు ఎందరో దేవతామూర్తులు కనిపిస్తారు. వాళ్ళందరూ జ్ఞాన ప్రదాతలు. వాళ్ళ గురించి మీరు అక్కడికి వెళ్ళాక సిద్ధపురుషుణ్ణి అడిగి తెలుసుకుంటేనే సబబుగా ఉంటుంది. నాకు తెలిసింది నేను చెప్తాను.  
విమలః ప్రాకారంలో మీకు ముముక్షువులు కనబడతారు. ముముక్షువులు అందరూ భూలోకం వారే. పైగా వీళ్లల్లో కళాకారులు, శాస్త్రవేత్తలు, విద్యావంతులు, క్రీడాకారులు, వైద్యులు...ఇలా ఎందరో కనిపిస్తారు. వాళ్ళల్లో మీరు చాలా మందిని గుర్తుపట్టగలుగుతారు. కానీ వాళ్ళు మిమ్మల్ని గుర్తుపట్టలేరు. అయినప్పటికీ మీరు మాట్లాడే భాష మాత్రం మాట్లాడగలరు
 
విమలః ప్రాకారంలో పొద్దున్నే సంగీతం, గానం వినిపిస్తుంది. ఎందరో ప్రసిద్ధ వాయిద్య కారులు పోటీపడి మరీ తమ సంగీత ప్రావీణ్యాన్ని చూపిస్తారు. ఎందరో కవులు కూడా తమ సాహిత్యాన్ని మనకు వారి కంఠం ద్వారా వినిపిస్తారు.
అసలైన విశేషం ఇది కాదు.  కొంత మంది అరుదైన ప్రతిభ, శక్తి సామర్ధ్యాలు, సాధన కలిగిన కళాకారులకు మాత్రం ఒక అద్భుతమైన సువర్ణావకాశం దక్కుతుంది. అలాంటి వారు ఒకరో ఇద్దరో ఉంటారు. వీరు తమ కళను, సాహిత్య ప్రతిభను ఎవరి ఎదుట ప్రదర్శిస్తారో తెలుసా?", అని తన నడక ఆపేసి సంజయ్, అభిజిత్, అంకితల దిక్కు చూస్తూ అడిగాడు సైనికుడు.
 
ఎవరి ఎదుట ప్రదర్శిస్తారు ? అని అడుగుతున్నట్టు అనిపించేలా సైనికుడి వైపే ఆశ్చర్యంగా చూసారు వాళ్ళు.
 
" బాలా త్రిపుర సుందరీ దేవి ఎదుట", అని చెప్పి తన నడకను తిరిగి ప్రారంభించాడు సైనికుడు.
 
"ముముక్షువు అంటే ఎవరు స్వామి?" అడిగాడు అభిజిత్
 
"సాధనలో పరాకాష్ఠను చూసిన వారు....చివరిగా మోక్షం కోసమే ఎదురు చూసేవారెవరైనా సరే ముముక్షువుల కోవలోకే వస్తారు", అని సమాధానమిచ్చాడా సిద్ధపురుషుడు.
 
"మనం ఈనాడు  బాలా త్రిపుర సుందరీ దేవి దర్శనం చేసుకోగలిగితే శంభల నగరంలో మనకు శివుని అనుమతి దొరికినట్టే అనుకోవచ్చు", అన్నాడా సిద్ధపురుషుడు.
 
"అదెలాగ స్వామీ?" అడిగాడు అభిజిత్.
 
బాలా త్రిపుర సుందరీ దేవి అంటే ఎవరనుకున్నావ్? లలితా అమ్మవారి హృదయం నుండి వచ్చిన 9 ఏళ్ళ చిరు ప్రాయమున్న బాలిక. ముగ్ధమనోహర సౌందర్యమున్న శక్తి రూపిణి. దశ మహావిద్యలలో మూడవదైన శ్రీవిద్యకు మూలమే బాలా త్రిపుర సుందరీ దేవి. ఈవిడ చూపులు మన మీద పడినా చాలు. శక్తితో మనం ఎంతో సాధించవచ్చు. శంభల రాజ్యంలో మీరు నేర్చుకోవాల్సిన ఎన్నో విద్యలు అతి సులువుగా మీకు ప్రాప్తిస్తాయి", అన్నాడు సిద్ధపురుషుడు.
 
"స్వామీ ప్రాకారానికి  విమలః ప్రాకారం అన్న పేరెందుకు వచ్చిందో చెప్తారా?" అడిగాడు సంజయ్.
 
" విమల అనగా ఎలాంటి మలినం లేనిదని అర్థం. అలా మాలిన్యము లేకుండా ఉండేది జ్ఞానమే. ప్రాకారంలో మనకు జ్ఞానం దొరకటం మాత్రమే కాదు, మనలోని అజ్ఞానం కూడా దూరం అయ్యే మార్గం దొరుకుతుంది. అజ్ఞానం అన్నది అంధకారమే. అంధకారం వున్నప్పుడే మనలో చెడు ప్రవృత్తులు ప్రవేశిస్తాయి. అజ్ఞానాన్ని జ్ఞానం ద్వారానే ఛేదించాలి. అందుకే ఇక్కడ ఎంతో మంది జ్ఞాన దేవతలు ఉంటారు. విమలః ప్రాకారం లో వాక్దేవతల గురించి మనకు తెలుస్తుంది. హయగ్రీవుని ఆరాధన మనకు కనిపిస్తుంది. జ్ఞాన సరస్వతీ దేవి ఆరాధన కనిపిస్తుంది. శివపార్వతుల కుమారుడైన షణ్ముఖుని ఆరాధన కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే విమలః ప్రాకారమే శంభల లోని జ్ఞాన నిధి అని చెప్పవచ్చును. పయోనిధి అని కూడా చెప్పవచ్చు", అన్నాడా సిద్ధపురుషుడు.
 
"స్వామీ, పయోనిధి అంటే?" అంటూ అడగాలా వద్దా అన్నట్టు చూసాడు అభిజిత్
 
"అనంతమైన సముద్రమని అర్థం. దాశరథి కరుణాపయోనిధీ అన్న దాశరథి శతక పద్యాలు మనందరం విన్నాం కదా", అన్నాడు సిద్ధపురుషుడు.
 
అంతలోనే  విమలః ప్రాకారం చేరుకున్నారు వారు. వీరిని స్వాగతిస్తూ అక్కడికి కొందరు వచ్చారు. వారు శంభల నగర వాసులు.
 
"మీరు భూలోక వాసులని మాకర్థం అయింది. కొన్ని ఘడియల్లో ఇక్కడ  ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ ప్రదర్శన ఇవ్వబోతున్నారు. మీరు ఇచట ఆసీనులు అవ్వండి", అంటూ వారికి తమ చోటును చూపిస్తూ,"మీరు బిస్మిల్లా ఖాన్ గారి ప్రదర్శనలు భూలోకంలో ఎన్నో సార్లు చూసి ఉంటారు. కానీ రోజు శంభలలో మీరు చూడబోయేది మాత్రం
భూతో భవిష్యతి అన్న రీతిగా ఉండబోతోంది. ఎందుకంటే బిస్మిల్లా ఖాన్ గారి షెహనాయి వినటానికి 
బాలా త్రిపుర సుందరీ దేవి స్వయంగా విచ్చేస్తోంది.
 
శ్రీవిద్యోపాసన ఉంటే గాని మనకు కనబడని శక్తి రూపిణి కేవలం ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ గారి కళను కళ్లారా మనతో కలిసి చూడాలనే తపనతో ఆవిడే స్వయంగా శంభలలోని విమలః ప్రాకారానికి తరలి వస్తోంది. ఆయన కళ వల్ల మనకు ఆవిడ స్వయం ప్రకటితం అయ్యి కనబడుతోంది. ఇది చాలా అరుదుగా జరుగుతుంది. బిస్మిల్లా ఖాన్ లాంటి అనర్ఘరత్నాలకే అర్హత దక్కుతుంది. ఆయన సాధన అలాంటిది మరి. వారణాసిలోని బాలాజీ మందిరంలో అతి లేత ప్రాయంలో ఆయన సాధన మొదలుపెట్టారు. అక్కడి బాలాజీ శక్తిని ఆయన మాత్రమే గుర్తించగలిగారు. గుడికి ఎంతో మంది భక్తులు వస్తుంటారు. పోతూ ఉంటారు. ఆయన మాత్రం అక్కడే ఉండి కొన్ని గంటల పాటు షెహనాయి సాధన చేసేవారు. గుడి బయటే ఉండి అక్కడి రాతిని తన చేతితో స్పృశించి దైవీ అనుభూతికి లోనయ్యారు. ఆయన షెహనాయి విన్న పూజారి రోజుకు ఆయనకు లోటు లేకుండా తినటానికి తన దగ్గరున్నది ఇచ్చేవారట. అలాంటి బిస్మిల్లా ఖాన్ గారు పుట్టిన భారత దేశం నుండి వస్తున్న మీకు మా ధన్యవాదములు", అనేసి అక్కడి నుండి వెళ్లిపోయారు వాళ్ళు.
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 4 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: అదృశ్య మందిరం - by k3vv3 - 31-03-2024, 02:42 PM



Users browsing this thread: 8 Guest(s)