Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నాన్నమ్మ
#2
నా పేరు సుబ్బారావు, నేను వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ లో ఇంజనీర్ ని, మా అమ్మాయి, మీ అబ్బాయి ఒకటే ఆఫీసులో వర్క్ చేస్తున్నారుట, ఇద్దరూ యిష్టపడ్డారు, మరి మీరు మిగిలిన విషయాలు మాట్లాడితే మాకు ఓకే అనుకుంటే ఓకే అనుకుందాం అన్నాడు నవ్వుతు పెళ్లికూతురు తండ్రి.
 
ముందు టిఫిన్ కానివ్వండి, మిగతా విషయాలు పెద్దగా ఏమీలేవు అన్నాడు రాజశేఖరం. హోటల్ నుంచి తెప్పించినట్టున్నారు, నేను హోటల్ ఫుడ్డు తినను, మిగిలిన వాళ్ళకి ఇవ్వండి అంటూ బయటకు వెళ్లి ఇద్దరు డ్రైవర్స్ ని టిఫిన్ తినడానికి రమ్మని పిలిచాడు సుబ్బారావు.

ఆయన తో పాటే బయటకు వచ్చిన రాజశేఖరం, మీకు డ్రైవింగ్ రాదా అన్నాడు. నాకు డ్రైవ్ చేసే అవసరం ఏముంది అండీ, గవర్నమెంట్ కారుతోపాటు డ్రైవర్ ని యిచ్చింది అన్నాడు కొద్దిగా గర్వాంగా సుబ్బారావు.


మరి రేపు రిటైర్ అయితే ఈ కారు వుండదు, డ్రైవర్ ఉండడు కదా, అప్పుడు ఆటోనే గతి, అందుకే నేను సర్వీస్ లో వుండగానే అదిగో ఆ మామిడిచెట్టు కింద వున్న ఇన్నోవా కొనుక్కుని డ్రైవింగ్ నేర్చుకున్నాను అన్నాడు రాజశేఖరం.


దెబ్బ కొట్టడం ఈయనకి వచ్చు అనుకుని సుబ్బారావు లోపలికి వచ్చి కూర్చొని, కట్నకానుకులు ఏమి లేవని తెలుసుకుని, తాంబులాలు పుచ్చుకుని త్వరలో ముహూర్తం పెట్టి తెలియచేస్తాను అని వెళ్లిపోయారు సుబ్బారావు, అతని సమూహం.

 
పెళ్లికూతురు కాపురం చేస్తుందా సవ్యంగా అన్నాడు రాత్రి భార్య తో రాజశేఖరం. మనం అడ్డంతగలకుండా వుంటే వాళ్లే సవ్యంగా వుంటారు. ఒకరికి ఒకరు కావాలి అని చేసుకుంటున్నారుగా అంది రమ.
 
పెళ్లి జరగడం, ఏడాది దాటిన తరువాత కొడుకు కి కొడుకు పుట్టడం జరిగిపోయింది. కోడలు ఎక్కువ మాట్లాడకుండా అత్తగారికి చేతనైనంత సహాయం చేస్తూ ఉంటుంది. వాళ్ళు ఆఫీస్ కి వెళ్లినతరువాత మనవడిని చూసుకునే పని రాజశేఖరంది, రమ ది. యిట్టే అయిదు సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకరోజు కృష్ణకాంత్ తనకి, రమ్య కి ఢిల్లీ ట్రాన్స్ఫర్ అయ్యింది అని, కొద్దిరోజులలో అక్కడకి వెళ్ళాలి అని చెప్పాడు.

తల్లిదండ్రులు ఉన్నచోటు నుంచి కదలం అనడంతో, కృష్ణకాంత్, రమ్య, కొడుకు వేణు ని తీసుకొని ఢిల్లీ వెళ్లిపోయారు. ఒక్కసారిగా యిల్లు బోసిపోవడం, అలవాటైన మనవడు తల్లిదండ్రులతో వెళ్లిపోవడం తో లోలోపల బెంగతో రాజశేఖరం ఒకరోజు తెల్లారినా లేవలేదు. రమ గొల్లు మని, కొడుకు, కూతురు కి ఫోన్ చేసింది.


సాయంత్రం కి చుట్టాలు అందరూ చేరుకుని పని కానిచ్చారు. అద్దెకు ఇవ్వబడును బోర్డు గేటుకి తగిలించి, తల్లిని తనతోపాటు ఢిల్లీ తీసుకుని వెళ్ళిపోయాడు కృష్ణకాంత్.

 
ఏమిటమ్మా ఉదయం నుంచి రాత్రి పడుకునే దాకా ఆ భక్తి టీవీ అంత పెద్దగా సౌండ్ పెడతావు, కొద్దిగా మెల్లగా పెట్టుకో అన్నాడు విసుగ్గా కృష్ణకాంత్. నేను ఈ మూల గదిలో కూర్చుని వింటున్నా నీకు వినిపిస్తోందా, నాకు సరిగ్గా వినిపించడం లేదు అంది తల్లి.

నెలలు గడుస్తున్నాయి, రోజూ ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు తల్లికి టీవీ సౌండ్ తగ్గించమనడం అలవాటు అయిపొయింది.




ఏమిటే ఆ సౌండ్, ఎవ్వరైనా ఫోన్ చేసినప్పుడైనా మీ అత్తగారు టీవీ సౌండ్ తగ్గించారా అంటూ అమ్మ ఫోన్లో అడుగుతూవుంటే, రమ్య యింతకీ నువ్వు ఫోన్ ఎందుకు చేసావో చెప్పలేదు అంది తల్లితో. ఎక్కడే, ఆ టీవీ సౌండ్ తో ఫోన్లో నాకే పిచ్చ ఎక్కుతోంది నువ్వు ఎలా భరిస్తున్నావే తల్లి, మన ఇంటా వంటా లేవు ఈ పూజలు, ఏమిటో మీ అత్తగారి పిచ్చ అంటూ తల్లి మాట్లాడటం చూసి ఫోన్ కట్ చేసింది రమ్య, అత్తగారు ఎక్కడ వింటారో అని.

రాత్రి భర్తకి చెప్పింది అత్తయ్య గారి టీవీ వల్ల పిల్లాడి చదువుకి కూడా యిబ్బంది, కాబట్టి ఆవిడ ని వృద్ధాఆశ్రమం లో వుంచితే ఆవిడకి కూడా ఫ్రీగా వుంటుంది ఆలోచించండి అంది.

 
బాగుండదు, అమ్మ ఫీల్ అవుతుంది అన్నాడు కృష్ణకాంత్.
 
రాత్రి కృష్ణకాంత్ కి ఆలోచనలతో నిద్రపట్టక తలనొప్పి తో తెల్లవారిజామున నిద్రపోయాడు. ఆఫీస్ కి వెళ్ళక తప్పదు కాబట్టి లేచి హాల్లోకి వచ్చాడు. అమ్మ ఎప్పుడు లేచిందో అప్పుడే చాగంటి గారి స్పీచ్ వింటోంది టీవీ పెద్దగా పెట్టుకుని.
 
అమ్మా టీవీ ఆపు, నేను ఆఫీస్ కి వెళ్లిన తరువాత పెట్టుకో అన్నాడు విసుగ్గా కృష్ణకాంత్.
 
లేచావరా అబ్బాయి, యిటురా ఒక్కసారి అంది రమ. తల్లికి ఏమైనా కోపం వచ్చేదేమో అనుకుని, ఏమిటమ్మా అంటూ తల్లి దగ్గరికి వెళ్ళాడు. యిలా కూర్చో అని కొడుకు ని కూర్చోమని, అబ్బాయి నేను ఒక్కమాట చెప్పాలి శాంతంగా విను. ఉదయం ఆఫీస్ కి వెళ్లి రాత్రి వస్తావు. రాగానే టీవీ ముందు కూర్చొని ఏదో సినిమా పెట్టుకుంటారు. యిహ నాతో మాట్లాడే టైం వుండటం లేదు.

అందుకే నేను టీవీ పెట్టుకుని భక్తి ప్రోగ్రామ్స్ పెట్టుకుని కాలం గడుపుతున్నాను. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏదైనా మంచి వృద్ధాఆశ్రమంలో చేరాలి అని. నువ్వు ఆ ప్రయత్నం లో వుండు అంది కొడుకుతో.


నీ కోడలు ఏమైనా అందా అన్నాడు కృష్ణకాంత్.. పాపం తను నా విషయం లో జోక్యం చేసుకోదు, నాకే ఈ ప్రశాంతత భరించలేక వృద్ధాఆశ్రమంలో అయితే నా వయసువాళ్ళు వుంటారు, వాళ్ళతో మాట్లాడుతూ గడపవచ్చు అని అంది. నువ్వు వేరుగా అనుకోకు నేను చెప్పినట్టుగా వృద్ధాఆశ్రమంకి నన్ను పంపించు అంది.

ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply


Messages In This Thread
నాన్నమ్మ - by k3vv3 - 27-03-2024, 02:16 PM
RE: నాన్నమ్మ - by k3vv3 - 28-03-2024, 07:45 AM
RE: నాన్నమ్మ - by k3vv3 - 28-03-2024, 07:46 AM
RE: నాన్నమ్మ - by sri7869 - 28-03-2024, 10:51 AM



Users browsing this thread: 1 Guest(s)