09-03-2024, 01:22 PM
శంభల నగరం – 4
సమర విజయ రాముని సమరః ప్రాకారం
చేరుకోగానే అక్కడ వారికి ఒక యోధుడి మూర్తి కనిపించింది. ఆ ప్రతిమ ధ్యానం చేస్తున్న భంగిమలో పద్మాసనంలో ఉంది. చూడటానికి ఉగ్రరూపంలో ఉన్న యోధుడిలా ఉంది. ఆ యోధుడి కళ్ళను చూస్తే కేవలం ధ్యానం చేస్తున్నట్టు మాత్రమే లేదు. ఏదో యుద్ధంలో నిర్విరామంగా శత్రువులతో పోరాడుతూ తన ఆగ్రహ జ్వాలలని కళ్ళ నిండా నింపుకున్నట్టు ఉంది. ఎందుకంటే అతను అర్ధనిమీలితనేత్రాలతో ఉన్నాడు. తీక్షణమైన ఆ చూపులను బట్టి అతను ఎవరినో అంతం చెయ్యటానికే దీక్ష పూనాడనిపిస్తోంది. ఎన్నో గాయాలతో రక్తసిక్తమై వున్న అతని దేహాన్ని చూస్తే చురకత్తులతో, బాణాలతో ఆ యోధుడిని దాడి చేసినట్టు అర్థం అవుతోంది. అయినా అది తనపై ఏ మాత్రం ప్రభావం చూపించలేదని అతని ధీరత్వం మనతో చెబుతున్నట్టు ఉంటుంది. అణువణువూ ధైర్యంతో, వీరత్వంతో, అమరత్వంతో నిండిపోయి మృత్యుదేవతకు ముచ్చెమటలు పట్టించే పోరాటపటిమ తన సొంతం అన్నట్టు ఉన్నాయి అతని చూపులు.
ఆ ప్రాంగణం అంతా నిశ్శబ్దంగా వుంది. అక్కడున్న నిశ్శబ్దాన్ని చూస్తే ఇప్పటికీ ఆ యోధుని వీరత్వానికి అర్పిస్తున్న నివాళి అదేమో అనిపించేలా ఉంది. సమరః ప్రాకారం మొత్తం ఆ యోధుడిదే అనిపించేలా ఉంది ఆ నిశ్శబ్దం. అక్కడున్న ప్రతీ అంగుళానికి ఆ యోధుడి పరాక్రమం తెలుసేమో అనిపించే నిశ్శబ్దం.
అభిజిత్, అంకిత, సంజయ్ లు ఆ యోధుడినే కన్నార్పకుండా చూస్తున్నారు. సిద్ధపురుషుడు, ఇద్దరు సైనికులు కొంచెం దూరంగా నిలబడి ఉన్నారు.
అంతలో అక్కడికి ఒక వృద్ధుడు వచ్చాడు. ఆ వృద్ధుడిని చూడగానే సైనికులిద్దరూ ప్రణామం చేశారు. సిద్ధపురుషుడు కూడా నమస్కరించాడు.
ఆ వృద్ధుడు ఎప్పటిలానే యథావిధిగా తన ఆసనం చూసుకుని అక్కడే స్థిరపడి ఆ యోధుడి ప్రతిమను చూస్తూ ఏదో మంత్రం జపిస్తూ వున్నాడు. ఇంతలో ఏదో జ్ఞప్తికి వచ్చినట్టు అనిపించి
సమరవిజయ రామా
సమరవిజయ రామా
సమరవిజయ రామా
అంటూ తన్మయత్వంతో తన కళ్ళ ముందే యుద్ధరంగం కనిపించినట్టు అనిపించి ఆ యోధుని ప్రతిమ దగ్గరకు పరిగెత్తుకుంటూ పోయి అక్కడున్న పూలను ఆ మూర్తీభవించిన వీరత్వానికి ప్రతీకగా సమర్పించి అక్కడున్న గంధపు జలంతో ఆ యోధుని పాదాలను పరిశుద్ధి చేసాడు ఆ వృద్ధుడు.
తిరిగి తన ఆసనం దగ్గరికి వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు. అభిజిత్, అంకిత, సంజయ్ లను ఇటు రమ్మని సైగ చేసాడు. సిద్ధపురుషుని వైపు భక్తి భావంతో చూస్తూ ఆహ్వానించాడు. అక్కడున్న ఇద్దరు సైనికులకు విషయం అర్థం అయిపోయి ఆ ప్రాంగణం నుండి బయటికి వెళ్లిపోయారు.
ఆ వృద్ధుడు ఇలా చెప్పటం మొదలు పెట్టాడు.
"నా పేరు మహిభార్గవుడు. శంభల నగరంలో మీకు కనిపించే భూలోకవాసిని నేను. ఇక్కడ మీరు చూస్తున్న ఆ యోధుడిని గాయాలతో రక్తసిక్తమై వున్న స్థితిలో పార్థివ శరీరంగా వున్న తనని భూలోకం నుండి ఇక్కడకు తీసుకునివచ్చే ఆ మహాభాగ్యాన్ని పొందాను. శంభలకు వచ్చి నేనూ అమరుణ్ణి ఐపోయాను. నాకు ఆనాడు కురుక్షేత్ర సంగ్రామంలో ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవదేవుడు ఆ శ్రీకృష్ణుడే", అన్నాడు ఆ వృద్ధుడు.
"స్వామీ ఆ యోధుడి వీరగాథను సవివరంగా మాకు చెప్తారా?" అని అడిగాడు సంజయ్.
"అది చెప్పటానికే మిమ్మల్ని ఇక్కడకు పిలిపించాను.
మీరు చూస్తున్న ఆ యోధుడి విగ్రహం సామాన్యమైనది కాదు. అది ఏ లోహంతో నిర్మితమైందో ఇప్పటిదాకా శంభలలో ఎవ్వరికీ తెలీదు.
దేవశిల్పి విశ్వకర్మ ప్రత్యేకంగా 3 మాసములు కేటాయించి ఆ యోధుని మూర్తిని సృజించాడు. మూర్తీభవించిన ఆ వీరత్వానికి ప్రాణప్రతిష్ట చేసాడు ఆ మాహానుభావుడు.
మీకిప్పుడు ఆ యోధుడి గురించి చెబుతాను. జాగ్రత్తగా వినండి", అంటూ ఇలా ఆ యోధుని వీరగాథను చెప్పసాగాడు ఆ మహిభార్గవుడు.
సమరవిజయ రాముడు శంభల నగరంలోని ఈ ప్రాకారంలోనే పెరిగాడు. అతని తల్లి రామ భక్తురాలు. ఈ యోధుడి సమరవిజయ రామ అన్న నామధేయం వెనుక ఉన్న బలమైన శక్తికి మూలం ఆవిడ మాతృ ప్రేమ, భక్తి.
సమరవిజయుడు కూడా తన తల్లిలానే రామభక్తుడు. అతి చిన్న వయసులోనే యుద్ధవిద్యలన్నీ నేర్చుకుని ఆరితేరిన వాడు. తనకు రాముని దర్శన భాగ్యం కావాలని పరితపించిపోయేవాడు. రామనామం జపిస్తూ ఎంతో కఠినమైన తపస్సును ఆచరించాడు. ఆహారం, నిద్ర ఏవీ లేకుండా కొన్ని నెలలు గడిపాడు. అయినా రాముడు కరుణించలేదు. అప్పుడు ఒక యోగి సమరవిజయుని చెంతకు వచ్చి శివుణ్ణి తపస్సు చెయ్యమని కోరాడు.
శివుణ్ణి భక్తిశ్రద్ధలతో పూజిస్తూ తపం ఆచరించాడు.
ఒక రోజు శివుడు ప్రత్యక్షం అయ్యి సమరవిజయుణ్ణి ఒక వరం కోరుకోమన్నాడు. అప్పుడు ఆ సమరవిజయుడు తనకు ఆ రాముని దర్శన భాగ్యం కలగాలనీ, అలాగే తన యుద్ధవిద్యా నైపుణ్యం వ్యర్థం అవ్వకుండా అదంతా ఆ రాముడికే ఉపయుక్తం అవ్వాలనీ, యుద్ధంలోనే అమరుడై శంభల చరిత్రలో తాను యోధుడిగానే మిగిలిపోవాలనీ కోరాడు.
రామదర్శనం తప్పక దొరుకుతుందని చెప్పి శివుడు అంతర్ధానమయ్యాడు. ఆ రోజు నుండి రామదర్శనం కోసమే ఎదురు చూస్తూ ఎన్నో ఏళ్ళు గడిపాడు ఆ సమరవిజయ రాముడు. అన్ని ఏళ్లలో అతను ఏ నాడూ రామనామ జపాన్ని వదిలిపెట్టలేదు.
కురుక్షేత్ర మహాసంగ్రామానికి ముందు శ్రీ కృష్ణుడు శంభల నగరానికి విచ్చేశాడు. సమరవిజయ రాముణ్ణి కలవటం కోసమే ఆయన ఇంత దూరం వచ్చాడు.
శ్రీకృష్ణుడిని చూడగానే సమరవిజయ రాముడు కంటతడి పెట్టుకున్నాడు. రాముడి దర్శనం తను కోరుకుంటే శ్రీ కృష్ణుని రూపంలో తన జన్మ తరింపజెయ్యటానికి వచ్చినందుకు భావోద్వేగానికి లోనయ్యాడు సమరవిజయుడు.
"మా అమ్మ తన జన్మను మీకే ధారబోసింది స్వామీ. మీ నామస్మరణే నా అంతిమ లక్ష్యంగా నన్ను పెంచింది. ఇన్నాళ్టికి నన్ను కరుణించారా స్వామీ", అంటూ శ్రీ కృష్ణుని పాదారవిందములకు శిరస్సువంచి నమస్కరించాడు ఆ సమరవిజయుడు.

ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ