28-02-2024, 04:33 PM
శంభల నగరం – 3
ధనుః ప్రాకారం
"మనస్సును అదుపులో పెట్టుకోవటం అన్నది తేలికగా అబ్బే విద్య కాదు. మనలో ఒక్క రోజులో కొన్ని వేల ఆలోచనలు అలా సముద్రంలోని కెరటాలలా వస్తూ పోతూ ఉంటాయి. మనసుని అలజడికి గురి చేసే విషయాల్ని కట్టడి చేస్తే మరింత ప్రమాదం. దేన్నైనా సరే ఛేదించి, సాధించాలి. అలా ఛేదించాలి అంటే మనలో వుండే అలజడిని తగ్గించే దిశగా మనం అడుగులు వెయ్యాలి. అదొక సాధనలా నిరంతరం సాగాలి. అంతే కానీ మనసుని బలవంతంగా కట్టడి చేస్తే మాత్రం అది పదింతలు ఉవ్వెత్తున ఎగిసి పడుతుంది. ఇలాంటి మనసును జ్ఞాన మార్గం వైపుకు నడిపించేదే ఈ ధనుః ప్రాకారం .
శంభల రాజ్యం లోని యోధులు, యోగులు, రాజులు ఎందరో ఈ ధనుః ప్రాకారానికి వచ్చి ఇక్కడ ధనుస్సు ఆకారంలో నిర్మించబడ్డ ఈ ప్రాంగణం అంతా తిరుగుతూ మంత్రాన్ని మననం చేసుకుంటూ 18 సార్లు ప్రదక్షిణలు చేస్తారు. ఆ తర్వాత ఎక్కు పెట్టిన బాణంలా మధ్యలో ఉన్న దారి వెంట నడుస్తూ చివరిదాకా వెళ్లి అక్కడున్న ధ్యాన పీఠము
మీద ఆసీనులవుతారు. ఈ బాణంలా వున్న దారికి ఇరు వైపులా
పుష్కరిణి ఉంటుంది. ఈ పుష్కరిణిలోని నీళ్లు స్వర్వాహినీ క్షేత్రానివే అయినా శివుని ఆలయంలోని భస్మమును ఎప్పటికప్పుడు తెచ్చి ఇక్కడి నీటితో జత చేస్తూ వుంటారు. సృష్టి, స్థితి, లయము లకు అతీతమైన ఒక ప్రపంచం ఈ శంభల నగరం. శివుని ఆజ్ఞను అనుసరించటమే ఇక్కడ పరమావధి. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆ ధ్యాన పీఠాన్ని ఏర్పాటు చేసిన వేదికకు నలుదిక్కులా శివోహం
అని వ్రాయబడి ఉంటుంది. అంటే దానర్థం నీ దారి ఆయన వేసిన దారి. నీ ప్రయాణానికి ఆయనే గమ్యం. నీ ఉనికికి ఆయనే మూలం. నీ లోని జ్ఞానమే ఆయన. ఆయనలోని జ్ఞానమే ఈ అనంతమైన విశ్వం అని.
చిదానంద రూపః శివోహం శివోహం
ధ్యాన పీఠము
మీద ఆసీనులయిన తర్వాత ఉపాసకుడు తన సంకల్పాన్ని, లక్ష్యాన్ని, గమ్యాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అప్పటికే పూర్తిగా మనసును తాను అనుకున్న లక్ష్యం వైపుగా దిశానిర్దేశం చేసి ఉండటంతో పరిపూర్ణమైన ఏకాగ్రత కుదురుతుంది. ఆ ధ్యాన పీఠము మీదున్నప్పుడే అతనికి అన్ని సమాధానాలు దొరుకుతాయి. అతని ఇచ్చాశక్తిని బట్టి అతనికి కలిగే అనుభూతి ఆధారపడి ఉంటుంది. తీవ్రమైన కోరిక వున్నప్పుడు మాత్రం ఇరువైపులా ఉన్న పుష్కరిణి లోని నీళ్లు 6 అడుగుల ఎత్తుకు ఎగసి పడుతూ ధ్యాన పీఠము మీదున్న ఉపాసకుడిని పునీతం చేస్తాయి. అనగా ఆ ఉపాసకుడు పవిత్రమైన పుష్కరిణి జలంతో ప్రోక్షణ చెయ్యబడ్డట్టు అన్నమాట. సంకల్ప సిద్ధి దొరికినట్టే అనుకోవచ్చు”, అంటూ చెప్పటం ముగించాడు
ధనుః ప్రాకారంలో ఉన్న ఆ ఉద్ధారకుడు.
"స్వామి ఇక్కడ ఆడవారికి కూడా ప్రవేశం ఉన్నదా?" అడిగింది అంకిత.
"సంకల్ప సిద్ధి కోసం చేసే ధ్యానానికి స్త్రీ, పురుష భేదం లేదు తల్లి", అన్నాడా ఉద్ధారకుడు.
"ఇంత క్రితం మీరు ఉపాసకుడు అని మాత్రమే సంబోధించారు. అందుకే ఇంతవరకు ఏ ఉపాసకురాలు ఇక్కడికి రాలేదేమోనని అనుకున్నాను", అని చమత్కారంగా అన్నది అంకిత.
"చాలా సరైన విషయాన్ని ప్రస్తావనకు తెచ్చావమ్మా. ఇక్కడ ఉపాసకుడు అంటే అర్థం పురుషుడు అని కాదు. శివుడు అని. ఎందుకంటే ఈ ధ్యాన పీఠము మీద ఆసీనులై ఎవరు ఉపాసన చేసినా సరే వారిలోని శివుడే జాగృతం అవుతాడు. సర్వం ఆ శివుడికే చెందుతుంది అన్న భావన అది.
శివుడే కర్త, కర్మ, క్రియ అన్న అంతరార్థం", అన్నాడు ఆ ఉద్ధారకుడు.
"ధనుస్సు ఆకారంలో ఉన్న ఈ ప్రాంగణం మొత్తం తిరుగుతూ పఠించే ఆ మంత్రం ఏమిటి స్వామి?" అడిగాడు సంజయ్
"
సర్వ చైతన్య రూపాంతాం
ఆద్యాం విద్యాంచ ధీమహి
బుద్ధిం యాన: ప్రచోదయాత్
ఈ మంత్రాన్ని మనసులోనే సరిగ్గా 18 సార్లు జపించిన తరువాత మాత్రమే ఆ ధ్యాన పీఠము దగ్గరికి వెళ్లే అర్హత మీకు దొరుకుతుంది", అన్నాడు ఆ ఉద్ధారకుడు.
"మాకు ఇవన్నీ చెయ్యటానికి ఇప్పుడు అనుమతి ఉన్నదా స్వామి?" అని అడిగాడు అభిజిత్.
"దృఢమైన సంకల్పంతో శంభల రాజు అనిరుద్ధుల వారు ఒక రోజు ముందుగానే శివుని ఆలయానికి వచ్చి ఇక్కడి శాస్త్రం ప్రకారం దేవప్రశ్నము వేసిన తర్వాత ఒక శుభ ముహూర్తాన ‘ధనుః ప్రాకారానికి విచ్చేసి సంకల్ప సిద్ధి కొరకు ఇవన్నీ చెయ్యటం జరుగుతుంది. ఎవ్వరైనా ఈ పద్ధతిని అనుసరించాల్సిందే" అని నిర్మొహమాటంగా చెప్పాడు ఆ ఉద్ధారకుడు.
“ఒక ముహూర్తం, ఒక దృఢమైన సంకల్పం, గ్రహబలం లేకుండా ఇక్కడ ప్రదక్షిణలు చెయ్యటానికి వీలు లేదు”, అని కాస్త ఘాటుగానే చెప్పాడాయన.
దీంతో అభిజిత్ వైపు నిరసనగా చూసారు సంజయ్, అంకితలు. సిద్ధపురుషుడు తనకి అలవాటైన నవ్వునే ధరించాడు.
తన ప్రశ్నలతో ఆ ఉద్ధారకుడికి కోపం తెప్పించి తనేమైనా అనుచితంగా ప్రవర్తించానేమోనని అభిజిత్ దిగాలుగా మొహం పెట్టి నిట్టూర్చాడు.
సిద్ధపురుషుడు ఆ విషయాన్ని గ్రహించి, "అభిజిత్ అడగటం వల్లనే కదా ఈ ప్రాకారానికి ఎవరి అనుమతితో రావాలో తెలిసింది. మీరు ఘోర కలిని ఎదుర్కోవటానికి శంభల రాజ్యంలో ఎన్ని విద్యలు నేర్చుకున్నా, ఎన్ని శాస్త్రాలు పఠించినా భూలోకం కెళ్ళాక అవన్నీ మీకు గుర్తుండాలి అన్నా, ఆ శక్తులన్నీ మీకు సహకరించాలి అన్నా మనం శంభల నుండి బయలుదేరే ముందు ఖచ్చితంగా ఈ ధనుః ప్రాకారానికే రావాలి. అభిజిత్ ఈ ప్రశ్న అడగటం మంచిదే అయ్యింది" అంటూ ముగించాడు ఆ సిద్ధపురుషుడు.
ఆ ఉద్ధారకుడి నుండి సెలవు తీసుకుని అక్కడి నుండి ముందుకు కదిలారు. ఒక ప్రాకారానికీ మరొక ప్రాకారానికి మధ్యనున్న దూరం 3 యోజనాలైనా నడుస్తూ వెళ్తున్నప్పుడు అలసట లేదు. కాళ్ళ నొప్పి లేదు. దూరం, దగ్గర అన్న వ్యత్యాసమే తెలియటం లేదు. దారి పొడవునా ఉన్న పాదుకాతీర్థం మహిమో మరేంటో కానీ శంభల నగరంలో ఎంత సేపు నడిచినా, ఎంత దూరం నడిచినా నడుస్తున్నట్టే లేదు. ఏదో శక్తి వాళ్ళను ముందుకు నడిపిస్తున్నట్టు ఉంది.
వాళ్ళు అక్కడి నుండి సమరః ప్రాకారానికి బయలుదేరారు.

ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ