Thread Rating:
  • 3 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అదృశ్య మందిరం - శంభల రాజ్యం – 10
#80
శంభల రాజ్యానికి పయనం – 4
మైనాకుని సహాయంతో సముద్ర లంఘనము....శంభల నగరానికి ఆగమనం
సిద్ధపురుషుని నిర్దేశంతో సంజయ్, అభిజిత్, అంకితలు తమ 
మౌన దీక్షను  విడిచి పెట్టారు. కొండ చివరి అంచునే ఆసీనులై మహాసముద్రాన్ని చూస్తూ ఉన్నారు. సిద్ధపురుషుడు మాత్రం ఏదో తీవ్రంగా ఆలోచిస్తూ ఉన్నాడు.
 
"ఏమిటి స్వామి అంతలా ఆలోచిస్తున్నారు?" అడిగాడు సంజయ్.
 
" రోజున రాముడు మనకు దిశానిర్దేశం చేస్తున్నప్పుడు చివరిలో సముద్రం దాటాల్సి వస్తే మైనాకుడు మనకు తోడ్పాటుని అందిస్తాడన్నాడు. దాని గురించే ఆలోచిస్తున్నాను", అని బదులిచ్చాడు సిద్ధపురుషుడు.
 
"స్వామి....అసలు ఎవరీ మైనాకుడు?" అడిగాడు అభిజిత్.
 
"క్షమించండి స్వామి....మా వాడికి పురాణాలతో కాస్త కూడా పరిచయం లేదు", అన్నాడు సంజయ్.
 
అభిజిత్ వంక వింతగా చూస్తూ, "ఏంటి నీకు మైనాకుడు ఎవరో కూడా తెలీదా !" అన్నది అంకిత.
 
"అందరికీ అన్ని విషయాలూ తెలియాల్సిన అవసరం లేదు కదా. అభిజిత్ అడిగాడు కాబట్టి మైనాకుడి గురించి, రామాయణంలో మైనాకుని ప్రస్తావన గురించి మీకు చెబుతాను.
 
జంబూద్వీపంలోని అన్నిపర్వతాలకు రారాజు హిమవంతుడు. ఇతను మేరు పర్వతరాజు పుత్రిక అయిన మేనకను పెళ్లి చేసుకున్నాడు. మేనకా, హిమవంతుల కుమారుడే మైనాకుడు. అప్పట్లో పర్వతాలకు రెక్కలు ఉండేవి. అవి ఒక చోట నుండి మరొక చోటకు యథేచ్ఛగా సంచరిస్తూ ఉండేవి. ఒకానొక పర్వతం చేసిన తప్పిదం వల్ల కొన్ని పక్షులకు, జీవులకు ప్రాణనష్టం జరిగింది. ఇంద్రునికి ఆగ్రహం రావటంతో పర్వతాల రెక్కలు అన్నింటినీ తన వజ్రాయుధంతో ఖండిస్తూ పోతున్నాడు. సమయంలో ఇంద్రునికి భయపడ్డ మైనాకుడు వాయుదేవుని సహాయముతో దక్షిణ సముద్రంలో దాక్కున్నాడు.
 
హనుమంతుడు సీతాదేవిని వెతుకుతూ లంకకు పయనం అయ్యి సముద్రమును దాటుతుండగా, సముద్రుని కోరిక మేరకు మైనాకుడు తన ఆతిథ్యమును స్వీకరించమని హనుమను కోరాడు. సముద్ర గర్భంలో ఎక్కడో అడుగున ఉన్న మైనాకుడు వాయుదేవుని మీదున్న కృతజ్ఞతతో వాయుదేవుని పుత్రుడైన హనుమంతుడు సేద తీరటం కోసమని  తన శృంగము పై అనగా తన పర్వతశిఖరము పై విశ్రమించమని వినమ్రముగా అడిగాడు. రామకార్యం పూర్తయ్యే వరకూ తనకు విశ్రాంతి అన్నది లేదని హనుమ మైనాకుని విన్నపాన్ని సున్నితంగా తిరస్కరించాడు. హనుమంతుడికి సహాయపడి తన ఋణం తీర్చుకోవాలని తపన పడిన మైనాకుడికి ఇంద్రుడు అభయం ఇచ్చాడు.
 
ఇప్పటికీ రెక్కలు కలిగిన పర్వతంగా మనకు మైనాకుడు ఒక్కడే కనిపిస్తాడు."
 
"వావ్...అంటే మనల్ని ఇప్పుడు మైనాకుడే శంభల రాజ్యానికి తీసుకెళ్తాడన్నమాట!" అన్నాడు అభిజిత్.
 
"చాలా ఎగ్జైటింగ్ గా ఉంది అంకిత....ఫ్లయింగ్ మౌంటైన్ ని చూడబోతున్నాం ఫస్ట్ టైం మన లైఫ్ లో!" అని ఎగ్జైట్ అయ్యాడు అభిజిత్.
 
అంకిత,"నీతో ఇదే ప్రాబ్లం....తెలిసే దాకా ఆపవు, తెలిసాక అస్సలు ఆగవు"
 
సంజయ్,"ఇందాకటి నుంచి దేని గురించి స్వామి తీవ్రంగా ఆలోచిస్తున్నారు?" అడిగాడు సిద్ధపురుషుణ్ణి.
 
"రాముడు మనకు చేసిన దిశానిర్దేశంలోనే ఏదో ఒక ఆంతర్యం దాగుంది. అదేంటో అంతుపట్టట్లేదు", అన్నాడు సిద్ధపురుషుడు.
 
"వాయవ్య దిశగా వెళ్ళమన్నాడు. ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడి నుంచి వాయవ్య దిశగా ఎటు వెళ్తాము? కింద సముద్రం ఉంది. వీ హావ్ టు వెయిట్ ఫర్ మిస్టర్ మైనాక", అన్నాడు అభిజిత్.
 
"ఏది ఇంకోసారి చెప్పు", అని అభిజిత్ ని అడిగాడు సిద్ధపురుషుడు.
 
"వాయవ్య దిశగా ఇక్కడి దాకా వచ్చాము. దిశగానే వెళ్ళాలి. బట్ ఇక్కడి నుంచి కదలటానికి లేదు. సో..." అని అభిజిత్ అంటూ ఉండగానే
 
"మార్గం దొరికేసింది", అన్నాడు సిద్ధపురుషుడు.
 
"అభిజిత్ మాటలే ఇప్పుడు మనకు దారి చూపించాయి", అని ఆనందంతో చెప్పాడు సిద్ధపురుషుడు.
 
అభిజిత్ మాటలు దారి చూపించటం ఏంటి అన్న ప్రశ్న మొదలయింది సంజయ్, అంకితలకు. సిద్ధపురుషుని మాటల్లోని లోతైన భావం ఏంటో వాళ్లకు అర్థం కావట్లేదు.
 
"అదెలాగ స్వామి?" అని అడిగాడు సంజయ్.
 
"వాయవ్య దిక్కుకు అధిపతి వాయుదేవుడు. మైనాకుడిని ఆనాడు కాపాడినది వాయుదేవుడే. వాయుదేవునికి కృతజ్ఞతగా మైనాకుడు మనకు సహాయాన్ని అందిస్తాడు. ఇప్పుడు మన ముందున్న ప్రశ్న ఏంటంటే మన నలుగురిలో వాయుదేవునితో సంబంధం వున్న వాళ్ళు ఎవరు అన్నది. మీ ముగ్గురి జన్మ నక్షత్రాలు నాకు చెప్పండి", అన్నాడా సిద్ధపురుషుడు.
 
"స్వాతి", అని సంజయ్ బదులిచ్చాడు.
 
"శతభిషం", అని అభిజిత్ జవాబు ఇవ్వగా, "ధనిష్ఠ", అని అంకిత సమాధానమిచ్చింది.
 
" జన్మ నక్షత్రాలు ఎందుకు స్వామి? ఇంతకీ మీ జన్మ నక్షత్రం ఏదో చెప్పనేలేదు", అని క్యూరియాసిటీతో అడిగాడు అభిజిత్.
 
"ప్రతీ నక్షత్రానికి అధిదేవత ఒకరుంటారు. అలా మన నలుగురి నక్షత్రాలలో వాయుదేవుడు అధిదేవతగా ఉన్న నక్షత్రం ఎవరిదో తెలియాలి. అప్పుడు వ్యక్తి వాయుదేవుడిని కానీ, హనుమంతుడిని కానీ ప్రార్థిస్తే మనకు మైనాకుడి నుండి సహాయం వెంటనే అందుతుంది. అభిజిత్, నాది శ్రవణ నక్షత్రం", అన్నాడు సిద్ధపురుషుడు.
 
"సంజయ్, మన నలుగురిలో వాయుదేవుడు అధిదేవతగా కల స్వాతి నక్షత్రంలో పుట్టినది నువ్వే. సాక్షాత్తు మహాశివుని అంశతో వాయుదేవుని ఆత్మజుడు అయిన హనుమంతున్ని ప్రార్థిస్తే మనకు మార్గం తప్పక దొరుకుతుంది", అన్నాడు సిద్ధపురుషుడు.
 
సంజయ్,"తప్పకుండా స్వామి" అని తనకు తెలిసిన 
హనుమద్గాయత్రి మంత్రాన్ని జపించాడు.
 
 
ఓం అంజనీ సుతాయ విద్మహే,
 
వాయుపుత్రాయ ధీమహి
 
తన్నో మారుతిః ప్రచోదయాత్ ||
 
సిద్ధపురుషుడు 
శ్రీ రామ రామ రామేతి
మంత్రాన్ని పఠించాడు. అభిజిత్, అంకితలు కూడా అదే మంత్రాన్ని పఠించారు.
 
సిద్ధపురుషుడు, అభిజిత్, అంకితలు ముగ్గురూ రామ నామ జపంలో ఉన్నారు. సంజయ్ హనుమద్గాయత్రి చేస్తూ ధ్యానంలో ఉన్నాడు. అలా ఎంతసేపు గడిచిందో తెలీదు.
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 6 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: అదృశ్య మందిరం - by k3vv3 - 24-01-2024, 06:11 PM



Users browsing this thread: 7 Guest(s)