Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అహం తుభ్యం ప్రణయామి
#8
దూరం నుంచే నన్ను చూసి నవ్వింది. చాలా సేపటినుంచి అలానే వేట్ చేస్తున్నట్లుంది.
ఇదిగో మేడం.. మీ బ్యాగ్. హ్యాపీనా..?
"చాలా థాంక్స్ అభి. లక్కీగా నీ నంబర్ తీసుకున్నా కాబట్టి నువ్వు తెచ్చిచ్చావ్. చూసావా మా నానమ్మకు ఎంత ముందు జాగ్రత్తో..."
తొక్కేమ్ కాదు. నీ గురించి మీ నానమ్మకు బా తెలుసు. అందుకే అంత హడావుడి చేసింది.
"సరే..ఎనీ వేస్. తెచ్చిచ్చావ్ థాంక్యూ. లోపలికి రా... బయటే మాట్లాడుతున్నాం."
హేయ్...పర్లేదు. ఇవ్వనీ ఏం వద్దు. వుంటాను.
ఇంతలో వాల్ల నాన్న వచ్చారు.
"అరేయ్...బాబు. లోపలికి రామ్మా... ఇంటి వరకూ వచ్చి లోపలికి రాకుండా వెళ్తానంటావు. అస్మిత... లాగేజ్ తీసుకోమ్మా..."
నాకు తప్పేలా లేదు. నమస్కారం ఆంటీ. నమస్తే అంకుల్.
"నువ్వొస్తావని మా అమ్మాయి అప్పటినుంచి చెబుతుంటే...మీ ఆంటీ బ్రేక్ ఫాస్ట్ కూడా రెడీ చేస్తుంది. నీకిష్టమని... ఎగ్ దోస చేస్తుంది. మీరు మాట్లాడుతూ వుండండి. ఐదే నిముషాల్లో రెడీ చేస్తుంది..."
వాళ్ళ నాన్నను చూస్తుంటే అస్మితను చూస్తునట్లే ఉంది. పాపది నాన్న పోలిక. నాకు ఎగ్ దోస ఇష్టమని నాకే ఇంత వరకూ తెలియదు. పిల్ల ఏదో చెప్పినట్లుందిలే...
*****
దోస సూపరుందాంటి. ఓకే అంకుల్. వుంటాను...
"సరేమ్మా..జాగ్రత్త...బై.."
నాతో పాటు అస్మిత కూడా బయటకొచ్చింది.
"ఓకే... బై. టేక్ కేర్...అండ్ థాంక్యూ అగేన్."
మీ నాన్నను చూసా...వాసుని కూడా చూపించాలి.
"తప్పకుండా...ఎలా మిస్ చేస్తాను.
బై...టేక్ కేర్...
"సేమ్ హియర్...బై..."
*****
ప్రస్తుతం ఇదంతా జరిగి అరునెలలవుతుంది. మళ్ళీ ఇంకోసారి మేఘమాలతో మాట్లాడలేదు. అప్పుడప్పుడు అస్మిత మెసేజ్ చేస్తుంటుంది. ఇప్పడుకూడా నేను మేఘమాలా గురించే ఆలోచిస్తున్నాను. అంతకు ముందు వరకు నా జీవితంలో చూడని వ్యక్తిని ఇప్పుడు చూడకుండా ఉండలేకపోతున్నాను. తను లేకుండా నా జీవితం లేదనిపిస్తుంది. తనని కలవని ఇరవై ఐదేండ్లు భూమి పై ఎలా ఉన్నానో తెలియట్లేదు. దీన్నేమంటారో మరి. తనని చూసేంతవరకు అలాంటమ్మాయి భూమిపై వున్నట్లు కూడా తెలియదే...ఇప్పుడు అమ్మాయిని మా అమ్మ, నాన్నలకు సమంగా ఫీల్ అవుతున్నాను. లోపాముద్ర మా ఇంటికొచ్చి ప్రోపోజ్ చేసినా, ఎన్నడూ ఇలా ఆలోచించలేదు. తను నా కొలీగ్. ప్రపంచంలో ఎవ్వరూ రాఖీ పౌర్ణమి రోజు రాఖీ కట్టి ప్రేమిస్తున్నట్లు చెప్పరు. ఘనత కేవలం తనకే చెందుతుంది. ఆరోజు ఏమైందంటే...
"ఎల్లప్పుడూ నేను క్షేమాన్ని కోరుకుంటాను. నీకన్నీ విజయాలు చేకూరలి. నువ్వు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలి. నీ ఊపిరి ఎల్లప్పుడూ నన్ను తాకేంత దగ్గరగా ఉండాలి. నీతోనే నా జీవితం. నన్ను వీడిపోవని, నా ప్రేమను అంగీకరిస్తావని కోరుకుంటూ రాఖీని కడుతున్నాను", అంది..నా కళ్ళలో కళ్ళు పెట్టి.
నాకర్థంకాలేదు. నోటి నుంచి ఒక్క మాట కూడా రాలేదు.
"రాఖీ కేవలం అన్న చెల్లెళ్ళ మధ్యనే కాదు. ప్రేమించిన వారి మధ్య కూడా ఉంటుంది. మొదటి రాఖీ, ఒక భార్య...తన భర్తకు కట్టింది. తను ఎల్లప్పుడూ క్షేమంగా ఉండాలని. మనమేంటో రాఖీని అన్న చెల్లెళ్ళ మధ్యనే పరిమితం చేసాం. ఆలోచించి నీ నిర్ణయం చెప్పు. నిన్ను నా జీవితంలో కోరుకుంటూ...నీ లోపాముద్ర."
మాటలకు నాకంటే మా నాన్న ఎక్కువగా ఇంప్రెస్ అయ్యారు. వేరే ఊరికొచ్చి, తల్లిదండ్రుల ముందర ఒకమ్మాయి, తన ప్రేమను అంగీకరించమని అడగటం అతనికి బాగా నచ్చింది. మా అమ్మ కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి రాఖీ కడుతుందట. రాఖీ పౌర్ణమికే అంత షాకిచ్చింది. రేపు ఫిబ్రవరి పద్నాలుగు. ఈసారి ఏంచేస్తుందో. ఆరునెల్లలో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. వాటిల్లో ఇది కూడా ఒకటని అనుకోలేకున్నా. ఏం జరుగుతుందో, తనేం చేస్తుందో..? మనసులో నాకే తెలియకుండా ఒకమ్మాయిని ఇష్టపడ్డాను. స్థానాన్ని ఇప్పుడు వేరొకరికి ఇవ్వలేను.
*****
ఇంటికి తిరిగొస్తున్నా. నాన్న నాకోసం ఎదురుచూస్తున్నట్లు కనిపించారు.
"రేయ్..కన్నా... జీవితంలో చాలా జరుగుతాయి. కొన్ని మంచిని తెలుపుతాయి. కొన్ని చెడుని తెలుపుతాయి. నువ్వు దేవుడ్ని, చెడు జరిగినప్పుడు ఎందుకిలా చేసావని అడుగుతావు. కానీ మంచి జరిగినప్పుడు ఎందుకు మంచి చేసావని అడగవుగా. జీవితంలో చాలా చిన్నవి కూడా ఎంతో సంతోషాన్నిస్తాయి. సంతోషాలే నీకు నిజమైన ప్రేమేంటో చెబుతాయి. ఒకరికి ఇవ్వడంలో ఆనందముంటుంది. ఒకరికోసం కొన్ని కోల్పోవడంలో ఆనందముంటుంది. సింపుల్ గా జీవించడం అన్నిటికన్నా చాలా కష్టం. అలా జీవించినప్పుడే నిజమైన ప్రేమేంటో తెలుస్తుంది. ప్రేమ దక్కేటప్పుడు దక్కుతుంది. దాన్ని ఎవరూ ఆపలేరు. సో..మరీ అంతగా ఆలోచించి మనసు పాడుచేసుకోవద్దు. వెళ్లి పడుకో...ఇప్పటికే లేటయింది." మాటలు నాకు జోల పాటలాగనిపించాయి. ఒకరకమైన మత్తులోకెళ్లిపోయా. మనసు తేలికపడింది. కళ్ళు మూసుకున్నాయి.
*****
చాలా రోజుల తర్వాత బాగా నిద్రపట్టింది. లేచిన తర్వాత రోజు నేను చూసే ఆంజనేయుడి ఫోటో బదులు, ఎదురుగా మేఘమాలా కనిపిస్తుంది. నా కల చాలా నిజంగా ఉంది. కల నిజమైతే బాగుండు. కలలో కూడా చేతిలో కాఫీ కప్పు. ముఖంపై అదే చిరునవ్వు.
"కాఫీ.. తీసుకో.."తనిందాక మట్లాడినట్లనిపించింది. చెవిలో అమృతం పోసినట్లనిపించింది. పట్టుకున్న కాఫీ కప్పు కాలినట్లు కూడా అనిపించింది. కానీ కాలటం మాత్రం నిజం. హేయ్.. తను నిజంగా మా ఇంట్లో..నా కళ్లముందరుంది. ఇంకా నమ్మలేకున్నా.
"హ్యాపీ వాలెంటైన్స్ డే..అభి. మాట చెప్పటం కోసం ఆరు నెలలుగా వేట్ చేస్తున్నాను. నాలోని ప్రేమ ఒక అగ్నిపర్వతం. అదీరోజు బద్దలయింది. నీకేం జరుగుతుందో అర్థమవట్లేదని నాకు తెలుసు. కానీ అన్నీ తెలుస్తాయి", అని చేయి పట్టుకుని హాల్లోకి తీసుకెళ్లింది. ఇంకో షాక్ తగిలింది.
మా అమ్మ, మా నాన్న, ఇంకా అస్మిత అందరూ కలిసి కాఫీ తాగుతున్నారు. ఏం జరుగుతుందో అర్థంకావట్లేదు. కళ్ళు తిరిగేలావున్నాయి.
"రారా..నీ ఫ్రెండ్ అస్మితతో మాట్లాడు.", నన్ను చూస్తూ అన్నారు నాన్న.
"అంకుల్.. అభి కంటే ముందు నుంచే అస్మిత నా ఫ్రెండ్."
"హా.. అదేలేమ్మా. నువ్వు కొంచెం ప్రశాంతంగా కూర్చోరా. అన్ని విషయాలు తెలుస్తాయి. మేము బయట కారిడార్లో ఉంటాం."
*****
నాకు ఒక్కొక్కటిగా అన్నీ అర్థమవుతున్నాయి. వాళ్ళిద్దరూ ముందుటినుంచే ఫ్రెండ్స్. మేఘా సైలెంటుగా ఉంది. అస్మిత కథ నడిపింది. ఆరోజు బస్సులో అస్మిత చాట్ చేసింది కూడా మేఘాతోనేనని తను చెప్పేదాక తెలీదు. మేఘాను నేను ఎంతగా ప్రేమించానో.. అంతగా తను కూడా ప్రేమించింది. విషయమంతా మా ఇంట్లో వాళ్ళకి కూడా తెలుసు. వెర్రి వేగలప్పను అయింది నేనే...
ఇంతలో ఫ్లవర్ బొకేతో ప్రత్యక్షమైంది లోపాముద్ర. ఇప్పుడేం ట్విస్ట్ ఉంటుందో...పక్కనే మేఘా కూడా ఉంది.
"హ్యాపీ వాలెంటైన్స్ డే..యూ బోత్ లుక్ అమేజింగ్", అని బొకేను మేఘాకు ఇచ్చింది. తనలో బాధ కంటే సంతోషమే ఎక్కువగా కనిపించింది. దానికి కారణం నిన్న రాత్రి మా నాన్న తనకు చేసిన ఫోన్ కాల్. ఏం మాయ చేసాడో...!
*****
"మేఘా నీకివ్వాలని ఎదో తెచ్చింది. తీసుకో..", అంది అస్మిత.
మేఘా కాఫీ కప్పుని నాకిస్తూ.."ప్రేమనిస్తా తీసుకో..", అంది.
వద్దు నీదగ్గరే ఉంచుకో..
"ప్లీస్..తీసుకో.."
ఇంకోసారి వేడుకో..
"లేకుంటే..నా ప్రేమనిస్తా తీసుకో", అంది లోపాముద్ర.
అందరూ ఒక్కసారిగా నవ్వారు. అలా నవ్వుతూ.. మేఘా నన్ను కౌగిలించుకుంది.
ప్రేమించండి. ప్రేమను పంచండి. ప్రేమను పెంచండి. ప్రేమతో.. మీ అభిమన్యు.
***********

ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 4 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: అహం తుభ్యం ప్రణయామి - by k3vv3 - 23-01-2024, 12:40 PM



Users browsing this thread: 1 Guest(s)