Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అహం తుభ్యం ప్రణయామి
#5
అమ్మ వాళ్ళని బస్సెకించా. మేఘా వాళ్ళది కూడా ఒకే ఊరు కావటంతో వాళ్లు కూడా అదే బస్సుకే బయల్దేరారు. నేను డైరెక్టుగా ఆఫీసుకు వెళ్ళాలి కాబట్టి, వాళ్ళనెక్కించి హైదరాబాద్ బస్సు పట్టుకున్నాను. ఇంకా తను నా మది వీడలేదు. దీన్నేమంటారో నాకు తెలీదు. కానీ తనతో గడిపిన రోజులు నేను ఎన్నటికీ మరువలేని. చూద్దాం పరిచయం ఎంతవరకెళుతుందో.
ఆలోచనలతో ముందుకు సాగుతున్న నా మదికి సడన్ బ్రేక్ పడింది.
" ఇక్కడ కూర్చోమ్మ. ఇంకెక్కడా ఖాళీ లేదు. ఏన్ పర్వాఇళ్ల హల్లా నినగే..?"
నాదీ తెలుగేనండి.
"ఓహ్..అయితే మరీ మంచిది. ఏం పేరు నాయనా?"
అభిమన్యు..
"నా మనవరాలు...అస్మిత. నువ్వు లగేజ్ అంతా పెట్టుకున్నావ్ గా?"
ఓహ్..హలో...అని నవ్వు నవ్వా...
"నువ్వెక్కడి వరకు బాబు?"
హైదరాబాదండి.
"మా పాప కూడా. కొంచెం జాగ్రత్తగా చూసుకో బాబు. మరేం అనుకోవద్దు. బస్ మిస్సయ్యింది. లేకుంటే కష్టముండేది కాదు."
అయ్యే... ఓకేనండి. నేను చూసుకుంటాను.
"అదే లగేజ్ కాస్త ఎక్కువుందిగా...అప్పుడప్పుడు కొంచెం లేచి చూస్తూ ఉండమ్మా."
వారినీ... నీ బాధ లగేజ్ గురించా... షాక్ నుంచి తేరుకుని,
ఇక నుంచి మీ లగేజ్... నాది. నేను చూసుకుంటాగా...
"నీ నంబర్ ఇవ్వు బాబు. పడుంటుంది...ముందు జాగ్రత్తగా."
అదే నేను కూడా అడుగుదామనుకున్నా...ముందు జాగ్రత్తగా..
"అమ్మాయి...నీ దగ్గరా పెట్టుకో...", అనుమానాలతో కూడిన నవ్వు నవ్వి బస్సు దిగిపోయింది.
బస్సు స్టార్ట్ అయ్యింది.
*****
మీ ఫ్యామిలీలో అందరికీ ఇలా ముందు జాగ్రత్త ఎక్కువా? లేక ఈవిడ ఒకత్తేనా...? ఊరికే క్లారిఫికేషన్ కోసం.
చలికాలంలో భోగి మంటలా ఉంది తన చూపు. మనకెందుకులే అని తల అటువైపు తిప్పుకున్నాను.
*****   
ఒక నవ్వు వినిపించింది. ఇంకోసారి...ఇంకాస్త గట్టిగా.
మొబైల్ స్క్రీన్ చూస్తూ..తెగ నవ్వుతుంది. మధ్యలో ఏదో టైప్ చేస్తుంది. అంతగా నవ్వొచేంతగా ఏముందో మరి.
నేను కళ్లు మూసుకుని కలల లోకంలో విహరిస్తున్నా...నా పక్క సీట్లో మేఘాను ఊహించుకుంటున్నా...
అలా ఇద్దరం కలిసి, చల్లటి గాలిలో వెళ్తుంటే...
కలవరమాయే మదిలో నా మదిలో...
కన్నులలోన కలలే ఆయే మనసే ప్రేమ మందిరమాయే
అంతవరకూ వున్న చలి కాస్త ఒక్కసారిగా ఎగిరిపోయింది. వెచ్చదనంతో ఒళ్ళు తేలికైనది.
"వాసూ...నేను ఇక్కడికొచ్చినా రోజూ నీ గురించే ఆలోచనలు. ఎప్పుడెప్పుడు వస్తానా... నిన్ను కలుస్తానా...అనేవుంది. నీ వాట్సాప్ లో ప్రొఫైల్ ఫోటో పెట్టావ్ గా...ఎంత బాగున్నావో. గడ్డం నీకు బాగా సెట్ అయ్యింది. ఇప్పటినుంచి అలానే ఉంచు. తీయద్దు. నీ కోసం ఎమ్ తెచ్చానో తెలుసా... హా? తెలుసా..?"
తెలియదు మేఘా...నువ్వే చెప్పుచుగా...ఎదీ చూపించు అని కళ్ళు తెరిచి చూస్తే ఇంకేముంది. నా పక్క సీట్ అమ్మాయి నన్ను తన బాయ్ ఫ్రెండ్ అనుకుని నా చేయిని చుట్టేసుకుని, తల భుజంపై వాల్చింది. ఎందుకబ్బా...సడన్ గా వెచ్చగా అనిపించింది అనుకున్నా...? కౌగిలింతల, కలవరింతల మహిమ అని తట్టలేదు...ఎవరో తెలియని అమ్మాయి అలా పాములా నన్ను చుట్టేస్తే...ఏం చేయాలో తోచలేదు.
"తెలుసారా... ఏంటి మాట్లాడవు...చెప్పు తెలుసా..?"
హా...తెలియదు. నువ్వే చెప్పచ్చుగా...
ఏం చెబుతుందో విందామని నేనూ ఎదురు చూస్తున్నా...
"చెప్పనా...చెప్పనా...?"
నీ తలకాయ్. హార్ట్ పేషంట్ అయితే సస్పెన్స్ తట్టుకోలేక చచ్చిపోతాడు. చెప్పవమ్మా తల్లి...
"చెప్పేస్తున్నా...నేను తిరిగి వస్తున్నాగా...అది చాలదా..కన్నా"
నీ.....పిసినారి పీచు మిఠాయి. అమ్మో...ఎలా వేగుతున్నావురా వాసుదేవా... వెంటనే నా చేయిని ఎలాగో అలా విడిపించుకున్నా. తలను అవతలికి నెట్టా...హమ్మయ్యా...
ఏదో అమ్మాయి పక్క సీటులో వుందిలే...కాస్త రొమాంటిక్ గా ఫీల్ అయ్యి జర్నీ చేయొచ్చు అనుకున్నా. ఇలాగైతే కష్టమే.
*****
లేత సూర్యకిరణాలు నాపై పడుతున్నాయి. కొంచెం కష్టంగా కళ్ళు రుద్దుకుని టైం చూద్దామని నా ఎడమ చేతిని పైకి లేపబోయా...
అమ్మ తల్లి...మళ్ళీ చేయి పట్టేసుకుంది. నేను కొంచెం చేయి కదిపే లోగా...
"డాడీ..! ఇక్కడ నానమ్మతో ఉన్నప్పుడంతా...మీరే గుర్తొచ్చారు. రాత్రి పడుకునే ముందు నీతో, అమ్మతో మాట్లాడినా పడుకున్నప్పుడూ మీ ఆలోచనే. అలా అని నానమ్మ బాచూసుకోలేదని కాదు. మా మంచి బామ్మ. మిస్ యూ డాడీ.."
పక్కా ఆస్కార్ కొట్టేస్తది. రాత్రి ప్రియుడు...ఇప్పుడు జనకుడు. ఇద్దరూ నేను కావడం నా కర్మ.
మొత్తానికి పాప మేలుకుంది. అటు ఇటూ నుసిగి, కళ్ళు తెరిచి చూసింది.
"హేయ్... నీకు కొంచెమ్మనా... సెన్స్ ఉందా. నేను నిద్రలో ఏదో తెలియక నిన్ను పట్టుకుంటే, పక్కకి జరపకుండా ఎంజాయ్ చేస్తున్నావా? ఛి..ఛీ... అమ్మాయి పక్కనుంటే చాలు. అడ్వాంటేజ్ తీసుకుంటారు. మీ మగ్గాల్లే అంత."
ఇది మరీ బాగుంది. మీరు నన్ను పట్టుకుని పడుకున్నారండి. నేను మిమ్మల్ని పట్టుకోలేదు. రాత్రి కూడా ఇలాగే చేసి, వాసూ...కన్నా... బుజ్జి అన్నారు. నేనే పక్కకు జరిపాను. ఇప్పుడేమో.. మిస్ యూ డాడీ అని మళ్ళీ పట్టుకున్నారు. నేను జరిపేలోపే... మీరు నిద్ర లేచారు. ఇందులో నాదేం లేదండీ బాబు. అన్ని అవార్డులు మీకే. నేను కేవలం నిమ్మిత్తమాత్రుణ్ణి.
"అవార్డులేంటి..? హా..ఏదో పాపం కదా అని ఊరుకుంటే..."
కొంచెంసేపు ఇద్దరం సైలెంటయ్యాం.
*****

ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 4 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: అహం తుభ్యం ప్రణయామి - by k3vv3 - 10-01-2024, 07:33 PM



Users browsing this thread: 1 Guest(s)