Thread Rating:
  • 3 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అదృశ్య మందిరం - శంభల రాజ్యం – 10
#76
అంతటి చీకట్లో కూడా శంఖినీ జాతి స్త్రీ తన చుట్టూ కాంతితో అణువణువూ కనబడేలా అందంగా తయారయ్యి సంజయ్, అభిజిత్ లకు తారసపడింది.
"అమ్మాయి నడుము ఎంత మృదువుగా ఉంటుందో తెలుసా? లేత కొబ్బరిలా ఉంటుంది. తాకి చూస్తారా?" అంటూ సంజయ్, అభిజిత్ లకు దగ్గరిగా వస్తూ వారి చేతులను తీసుకుని తన నడుమును తాకించింది.
"ఎలా వుంది? మాట పడిపోయిందా? హహహ", అంటూ అందంగా నవ్వింది శంఖినీ జాతి స్త్రీ.
సంజయ్, అభిజిత్ లు నోరు మెదపలేదు.
"నాతో రతి కోసం శంభల రాజ్యంలోని ప్రతీ మగాడు తహతహలాడిపోతాడు. కానీ నన్ను సుఖపెట్టేవాడిని నేనే ఎంపిక చేసుకుంటాను. నాకు అంత తేలికగా మగాడూ నచ్చడు. మీ ఇద్దరూ మంచి వయసులో ఉన్నారు. సింహాలలా ఆకలి మీదున్నారు. మిమ్మల్ని రెచ్చగొడితే రాత్రి, పగలు అనే నియమం పెట్టుకోకుండా నాతో సంభోగిస్తారు. హహహ", అంటూ సరసం ఒలకబోస్తూ కొంటెగా కన్ను గీటింది. తన శిరోజాలని సవరిస్తూ తన కుచద్వయం కనిపించేలా కళ్ళ నిండా తమకంతో రెచ్చగొడుతోంది.
"యువకులారా! మీ వయసును వృధా చేసుకోవటానికా ఇంత దూరం వచ్చింది? హహహ" అంటూ సంజయ్, అభిజిత్ బుగ్గ మీద ముద్దు పెట్టింది.
"నా వెచ్చని శ్వాస మీ బుగ్గలను తాకితేనే ఇలా తమకంలో తేలిపోతున్నారే! హహహ. ఇక మీ పెదాలతో నా పెదాల్ని బంధిస్తే అప్సరసా ఇవ్వనంత మధువును నేను మీకందిస్తాను. అప్పుడేం ఐపోతారో ఊహించుకుంటేనే నవ్వొస్తోంది" అంటూ మాటలతోటే కాదు చేతలతోనూ కవ్విస్తోంది.
 
హంస దేవత
వివేకాన్ని ఇచ్చి చీకటిని దూరం చేస్తుందని చెప్పిన మునీశ్వరుడి మాటలు ఇప్పటికి గుర్తుకొచ్చాయి వారిద్దరికీ. బాహ్యమైన దృష్టికి కనబడేది కాదు శంభల రాజ్యం అన్న సిద్ధపురుషుని మాటలు కూడా గుర్తుకొచ్చాయి. భౌతికమైన సుఖాలను ఎరగా చూపి వశపరుచుకోవాలని చూసే శంఖినీ జాతి స్త్రీ తమలోని సంకల్ప శక్తిని మాత్రమే పరీక్షిస్తున్నదని అర్థం అయిపోయింది సంజయ్, అభిజిత్ లకు. వెంటనే మునీశ్వరుడు ఉపదేశించిన 
హంస గాయత్రి
మంత్రాన్ని పఠించారు. మంత్రం పఠించగానే తన మాయా రూపాన్ని వీడి శంఖినీ జాతి స్త్రీ ఇలా అన్నది.
"శంభల రాజ్యంలో మిమ్మల్ని మోహానికి గురిచేసే అందగత్తెలు ఎందరో ఉంటారు. వారి మాయలో పడిపోయి మీ కార్యాచరణను పూర్తిగా మరిచిపోయి వారికే వశం అయిపోయే ప్రమాదం ఎంతైనా ఉన్నది. అందుకే ఇలా శంఖినీ జాతి స్త్రీలా వచ్చి మీలో కామోద్రేకాన్ని కలిగించి మీలో వున్న మానసిక బలాన్ని పరీక్షించాను. పరీక్షలో మీరు ఇరువురూ విజయం సాధించారు. విజయోస్తు. శంభల రాజ్యంలో మీరు కోరుకున్న అన్ని శక్తులూ మీకు లభిస్తాయి" అని చెప్పి అక్కడి నుండి కనుమరుగు అయిపోయింది అదృశ్య దేవత.
సంజయ్, అభిజిత్, అంకితలు చీకట్లలోనే ఎంతో దూరం నడిచారు. అలా ఒక పది యోజనాల దూరం నడిచాక ఒక కొండ చివరి అంచు కనిపించింది. చీకటి తెర వీడిపోయింది. సంజయ్, అభిజిత్ లకు అంకిత కనిపించింది. సిద్ధపురుషుడు వీళ్లందరి కంటే ముందే అక్కడికి చేరుకున్నాడు. కొండ చివరి అంచు దగ్గర నిలబడి ఉన్నాడు.
ఆకాశంలో నుండి సూర్యుని కిరణాలు తేజోవంతంగా ప్రకాశిస్తున్నాయి.
వాళ్ళు ముగ్గురూ నడుచుకుంటూ సిద్ధపురుషుని వైపుగా వెళ్తున్నారు. వీళ్ళ ముగ్గురినీ చూడగానే సిద్ధపురుషుడు అమితానందం పొందాడు.
"మొత్తానికి అనుకున్నది సాధించారు. ఇక్కడే కొంత సేపు సేద తీరుదాం. మైనాకుడి కోసం ఎదురుచూడాల్సిందే. సముద్రాన్ని దాటడం మనవల్ల కాదు", అంటూ కొండ చివరి అంచు వరకూ వెళ్లి కిందున్న మహాసముద్రాన్ని చూపిస్తూ అన్నాడు.
 
అనంతమైన మహా సాగరంలా ఉందది. ఇంతవరకూ భూమ్మీద అలాంటి సముద్రాన్ని ఎప్పుడూ చూడలేదనిపించేలా ఉందది.
సంజయ్, అభిజిత్, అంకితలు సముద్రాన్నే చూస్తూ సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయారు.
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 8 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: అదృశ్య మందిరం - by k3vv3 - 09-01-2024, 07:02 PM



Users browsing this thread: 6 Guest(s)