Thread Rating:
  • 3 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అదృశ్య మందిరం - శంభల రాజ్యం – 10
#64
శంభల రాజ్యానికి పయనం – 2
అద్భుతం....అమోఘం.....అజ'రామ'రం

ఉత్తరాదిన ఉన్న సీతానది వైపుగా సిద్ధపురుషుడు సంజయ్, అభిజిత్, అంకితలను తీసుకెళ్తున్నాడు. దక్షిణాదిన ఉన్న రాజవరం నుండి ఉత్తరాదిన ఉండే వారణాసికి ఫ్లైట్ లో 3 గంటల్లో చేరిపోయారు నలుగురూ. వారణాసి నుండి వీళ్ళు సీతానదిని వెతుకుతూ బయలుదేరి ఇప్పటికి 8 గంటలు గడుస్తోంది. అయినా సీతానది కనిపించలేదు. సంజయ్, అభిజిత్, అంకితలు అసహనానికి లోనవుతున్నారు. అయినా సిద్ధపురుషుడి మీదున్న నమ్మకంతో ఒక్క మాట కూడా బయటికి మాట్లాడటం లేదు. ఇంతలో ఒక చిన్న మందిరం ఒకటి కనిపించింది వాళ్లకి. చుట్టుపక్కల నివసించే ప్రజలు తండోప తండాలుగా తరలివచ్చారు గుడికి. సాయంత్రం 7 కావస్తోంది.
 
సిద్ధపురుషుడు వాళ్ళతో ఇలా అన్నాడు," సీతానదికి మనకు దారి దొరికేలా ఉన్నది. ముందు మనం గుడికి వెళ్లి దేవిని దర్శించుకుందాం. నారాయణుడే మనకు ఏదో ఒక మార్గాన్ని నిర్దేశిస్తాడు."
 
నలుగురూ గుడికి వెళ్లారు. చిత్రమేమిటంటే అది సీతాదేవి ఆలయం. అక్కడున్న గ్రామ ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో సీతాదేవిని కొలుస్తున్నారు.
 
ఆలయ ప్రాంగణంలోకి వీళ్ళు అడుగుపెట్టగానే అక్కడున్న కొంత మంది గ్రామ ప్రజలు ఎదురొచ్చారు. వాళ్లలో ఒకడు,"మీరొస్తున్నారని మాకు ముందే తెలిసింది. ఆలయ పూజారి చెప్పారు. ఇక్కడున్న కొళాయిలో మీరు కాళ్ళు కడుక్కున్న తర్వాతే ఆలయంలోకి ప్రవేశించండి", అని చెప్పాడు.
 
"గంగతో పావనం అయిన తరవాతే సీతాదేవి దర్శనభాగ్యం అన్నమాట. బావుంది", అన్నాడు సిద్ధపురుషుడు.
నలుగురూ అక్కడే ఉన్న కొళాయిలో పాదాలను పరిశుద్ధి చేసి ఆలయంలోకి ప్రవేశించారు.
 
సీతాదేవి దర్శనం దివ్యంగా జరిగింది. అమ్మవారిలో ఉన్న దైవీభావాలు, పవిత్రత వల్ల దర్శనం చేసుకున్న వారెవరికైనా కొత్త శక్తులు ఉద్భవిస్తాయి. నిద్రాణంగా ఉన్న శక్తులు జాగృతం అవుతాయి.
 
దర్శనం అయిపోయాక కాసేపు అక్కడే ఆసీనులయ్యారు నలుగురూ.
ఇంతలో ఇద్దరు దివ్యపురుషులు ఆలయప్రాంగణంలోకి అడుగుపెట్టారు. ఒక దివ్యపురుషుడు నీలకాంతితో ఉన్నాడు. ఇంకొక దివ్యపురుషుడు బంగారు కాంతితో ఉన్నాడు. ఇద్దరి భుజాలకి ధనుస్సులున్నాయి. వెనుక అంబులపొదులున్నాయి.
వారిని చూడగానే అక్కడున్న వారందరూ పాదాభివందనం చేశారు. చూస్తూండగానే ఆలయంలో ఉన్న గ్రామ ప్రజలందరూ అక్కడి నుండి వెళ్లిపోయారు. ఆలయంలో పూజారి, సిద్ధపురుషుడు, సంజయ్, అభిజిత్, అంకితలు తప్ప ఇంకెవ్వరూ లేరు. దివ్యపురుషులిద్దరూ గర్భగుడిలో కెళ్ళి  సీతాదేవి దర్శనం చేసుకున్నారు. పూజారి నోట మాట రాలేదు. వారిరువుర్నీ చూస్తూ నమస్కరించాడు. దివ్యపురుషులిద్దరూ చిరుమందహాసంతో పూజారికి నమస్కరించారు. పూజారి వెంటనే అక్కడినుండి 'జై శ్రీరామ్', 'జై శ్రీరామ్' అంటూ పరుగుపరుగున వెళ్ళిపోయాడు.
 
సంజయ్, అభిజిత్, అంకితలకు ఇదంతా ఒక కలలా ఉంది. సిద్ధపురుషుడికి ఇదంతా విష్ణుమాయ అని అర్థం అవుతోంది. సీతాదేవి దర్శనం అయిన తర్వాత దివ్యపురుషులిద్దరూ వీరి దగ్గరికే వచ్చి వారి చెంతనే ఆసీనులై కూర్చున్నారు.
 
"నమస్కరించటం అంటే నిష్కల్మషమైన మనస్సును దేవునియందు  సమర్పించటమే కదా, లక్ష్మణా?" అన్నాడు రాముడు.
 
"మీకు తెలియనిదా అగ్రజా!" అన్నాడు లక్ష్మణుడు.
 
" రోజు వీరు నలుగురూ త్రికరణ శుద్ధితో సీతాదేవిని వేడుకున్నారు, లక్ష్మణా. అందుకే కదా మనిద్దరమూ ఇంత దూరం పయనమయ్యి వచ్చాము వీరి కోసం", అన్నాడు రాముడు.
 
మాట వినగానే అక్కడున్న సంజయ్, అభిజిత్, అంకితలు లేచి నిల్చున్నారు. సిద్ధపురుషుడు అప్పటికే నిలబడి ఉన్నాడు. నలుగురూ రామలక్ష్మణులకు సాష్టాంగ ప్రణామం చేశారు. శివుడు పార్వతీ దేవికి చెప్పిన 
'శ్రీ రామ రామ రామేతి'
శ్లోకాన్ని పఠించారు.
 
"విష్ణు సహస్రనామ స్తోత్రం చెప్పినంత ఫలితాన్ని 
'శ్రీ రామ రామ రామేతి'
  చెప్పేసి పొందారు. తెలివైనవాళ్ళే", అంటూ ఆటపట్టించాడు లక్ష్మణుడు.
 
"రాముడు శుద్ధమైన అంతఃకరణను మాత్రమే చూస్తాడు కదా స్వామీ. తమకు తెలియనిది ఏముంది?" అన్నాడు సిద్ధపురుషుడు.
 
"అది సరే గాని", అంటూ సంజయ్, అభిజిత్, అంకితలను చూస్తూ, "వీళ్ళేం మాట్లాడరా?" అన్నాడు లక్ష్మణుడు చమత్కారంగా.
 
"శంభల రాజ్యానికి పయనం అయినప్పటి నుండి 
 మౌనదీక్ష
వహిస్తున్నారు స్వామి. ఇప్పటి వరకూ ఏమీ తినలేదు. పచ్చి మంచి నీరు కూడా ముట్టలేదు. మానసిక, శారీరక అలసటకు గురయ్యారు" అన్నాడు సిద్ధపురుషుడు.
 
మాట వినగానే రాముడు తన దగ్గరున్న గంగాతీర్థాన్ని సిద్ధపురుషుడికిస్తూ ఇలా అన్నాడు,"బిడ్డలు అడగకుండానే అమ్మకు వాళ్ళ ఆకలి అర్థం అయిపోతుంది. మీరు సీతాదేవిని ప్రార్థించగానే గంగాతీర్థాన్ని నాకిచ్చి పంపించింది. ఎంతైనా అమ్మ అమ్మే కదా", అన్నాడు రాముడు.
 
రాముడు అలా 
'ఎంతైనా అమ్మ అమ్మే కదా'
అంటూ ఉండగానే వాళ్లకు ఆకలి తీరిపోయింది. సంజయ్, అభిజిత్, అంకితలకు గంగాతీర్థాన్ని సిద్ధపురుషుడు ఇచ్చాడు.
 
"వాళ్ళకిచ్చి నువ్వు తీసుకోవేమయ్యా?" అన్నాడు లక్ష్మణుడు.
 
"సమర్థ రాఘవునికి తీర్థాన్ని నేనే స్వయంగా ఇస్తాను లే. అసలే చాలా దూరం ప్రయాణించాలి కదా", అంటూ రాముడే పవిత్ర గంగను సిద్ధపురుషునికి తీర్థంగా ఇచ్చాడు
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 9 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: అదృశ్య మందిరం - by k3vv3 - 26-12-2023, 02:24 PM



Users browsing this thread: 6 Guest(s)